< ఆదికాండము 22 >
1 ౧ ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
Sabara gahıle Allahee İbrahim siliys ı'xı'yxə. Mang'vee «İbrahimva!» ona'an. İbrahimee «Hooyva!» eyhe.
2 ౨ అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు.
Allahee mang'uk'le eyhen: – Vas ıkkanna, vorna-deşda yiğna dix I'saq'ır alyart'u Moriya eyhene cigeeqa hoora. Zı vak'le haagvasdee suval, dix gyoxhxhane'e, q'urbanna alle'e.
3 ౩ కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.
İbrahimee çakra miç'eeqana suğots'u cune əməleys palanbı ı'xı'yxə. Mang'vee cukasana q'öyre mek'vna, sayir dix I'saq' ıkkekka. Mang'vee q'urban gyooxhan ha'asın osbıd qaxı, yəq avqaaqana Allahee uvhuyne cigeeqa.
4 ౪ మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు.
Man ciga İbrahimık'le xhebıd'esde yiğıl, vuk'ul ooqa qav'uyng'a, əq'ənançe g'ece.
5 ౫ తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు.
Mang'vee mek'vunbısik'le eyhen: – Şu əməleyka inyaa aaxve, zı duxayka şaqa üqqəs. I'bəədat ha'u, şosqa savk'alas.
6 ౬ అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.
Q'urban gyooxhan ha'as qaxıyn osbı İbrahimee cune duxayne I'saq'ne mıgalqa hele. Ts'ayiy ç'ikad vucee alyaat'a. Cona q'öyre maqa əlyhəng'ə,
7 ౭ ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు.
I'saq'ee dekkık'le İbrahimık'le eyhen: – Dek! Mang'vee alidghıniy qelen: – Dix, yizın k'ırı val vod. I'saq'ee qiyghanan: – Ts'ayiy osbı vodunbu, saccu q'urbanna beder nençene vuxhes?
8 ౮ దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.
İbrahimee eyhen: – Dix, q'urbanna beder Allahee Vucee haagvasda. İnbı sacigee avayk'ananbı.
9 ౯ దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు.
Manbı qavaylenbı Allahee mang'uk'le uvhuyne cigeeqa. İbrahimee maa'ad q'urbanbı allya'an ciga ali'ı, çilqad osbı giyk'an. Qiyğar I'saq' ayt'ıl mane q'urbanbı allya'ane cigalyne osbışilqa g'alya'a.
10 ౧౦ తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు.
İbrahimee dix gik'asva xıl hotku ç'ika alyat'a.
11 ౧౧ అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
Mane gahıl Rəbbine malaaikee xəybışeençe mang'ulqa ona'an: – İbrahim, İbrahim! Mang'vee eyhen: – Zı inyaa vor!
12 ౧౨ అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.
Malaaikee eyhen: – Gadeyk simet'a! Mang'uk vuççud hıma'a! Həşde zak'le ats'axhxhayn, ğu Allahıle qəyq'ən vor, vaqa vornacar hamana sa dix, vucur ğu Cule qiykkın deş.
13 ౧౩ అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు.
İbrahimee vuk'ul ooqa qav'umee, ğı'ç'ee gaçbı açatxırna sa g'arg g'ooce. İbrahimee hark'ın mana g'arg qabı, duxayne cigee q'urbanna ablyaa'a.
14 ౧౪ అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
İbrahimee mane cigayn do Yahve-İre (Rəbbee hagvasın) giyxhe. Mançil-allad həşdilqamee insanaaşe məxüd eyhe: «Vucee Rəbbee suval hagvasın».
15 ౧౫ యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు
Rəbbine malaaikee xəybışeençe İbrahimılqa onu'u meed eyhen:
16 ౧౬ “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.
– Rəbbee inəxüdud eyhe: «Ğu ina iş hav'uva, vornacar sa dix qidiykınva, Zı Yizde doyulen k'ın g'iysar:
17 ౧౭ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
Zı vas hək'ebab xayir-düə hevles, yiğna nasıl xəədın xənebımee, deryahne hiqiy-allana g'um xhinne hexxaa'asda. Duşmanaaşin şaharbıd yiğne nasılınbı ixhes.
18 ౧౮ నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
Ğu Yizde cuvabıl k'ırı alixhxhiyl-alla, dyunyeyne gırgıne milletbışe yiğne nasılılek'e xayir-düə alyapt'as».
19 ౧౯ తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు.
İbrahim siyk'alna cuka abıyne mek'vunbışisqa. Mançe manbı sacigee siviyk'alanbı Beer-Şeveeqa. İbrahim Beer-Şevee axva.
20 ౨౦ ఆ సంగతులన్నీ జరిగిన తరువాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది.
21 ౨౧ ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు,
22 ౨౨ కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.
23 ౨౩ అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు.
24 ౨౪ అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.