< ఆదికాండము 18 >
1 ౧ మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
После му се јави Господ у равници мамријској кад сеђаше на вратима пред шатором својим у подне.
2 ౨ అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
Подигавши очи своје погледа, и гле, три човека стајаху према њему. И угледавши их потрча им у сусрет испред врата шатора свог, и поклони се до земље;
3 ౩ “ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.
И рече: Господе, ако сам нашао милост пред Тобом, немој проћи слуге свог.
4 ౪ నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
Да вам донесем мало воде и оперите ноге, те се наслоните мало под овим дрветом.
5 ౫ మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
И изнећу мало хлеба, те поткрепите срце своје, па онда пођите, кад идете поред слуге свог. И рекоше: Учини шта си казао.
6 ౬ అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు.
И Аврам отрча у шатор к Сари, и рече: Брже замеси три копање белог брашна и испеци погаче.
7 ౭ తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.
Па отрча ка говедима и ухвати теле младо и добро, и даде га момку да га брже зготови.
8 ౮ తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
Па онда изнесе масла и млека и теле које беше зготовио, и постави им, а сам стајаше пред њима под дрветом докле јеђаху.
9 ౯ వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.
И они му рекоше: Где је Сара жена твоја? А он рече: Ено је под шатором.
10 ౧౦ అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
А један између њих рече: Догодине у ово доба опет ћу доћи к теби, а Сара ће жена твоја имати сина. А Сара слушаше на вратима од шатора иза њега.
11 ౧౧ అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది.
А Аврам и Сара беху стари и временити, и у Саре беше престало шта бива у жена.
12 ౧౨ శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
Зато се насмеја Сара у себи говорећи: Пошто сам остарела, сад ли ће ми доћи радост? А и господар ми је стар.
13 ౧౩ అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది?
Тада рече Господ Авраму: Што се смеје Сара говорећи: Истина ли је да ћу родити кад сам остарела?
14 ౧౪ యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
Има ли шта тешко Господу? Догодине у ово доба опет ћу доћи к теби, а Сара ће имати сина.
15 ౧౫ అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
А Сара удари у бах говорећи: Нисам се смејала. Јер се уплаши. Али Он рече: Није истина, него си се смејала.
16 ౧౬ అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.
Потом усташе људи оданде, и пођоше пут Содома; а Аврам пође с њима да их испрати.
17 ౧౭ కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.
А Господ рече: Како бих тајио од Аврама шта ћу учинити,
18 ౧౮ అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
Кад ће од Аврама постати велик и силан народ, и у њему ће се благословити сви народи на земљи?
19 ౧౯ అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
Јер знам да ће заповедити синовима својим и дому свом након себе да се држе путева Господњих и да чине што је право и добро, да би Господ навршио на Авраму шта му је обећао.
20 ౨౦ అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
И рече Господ: Вика је у Содому и Гомору велика, и грех је њихов грдан.
21 ౨౧ నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
Зато ћу сићи да видим еда ли све чине као што вика дође преда ме; ако ли није тако, да знам.
22 ౨౨ ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.
И људи окренувши се пођоше пут Содома; али Аврам још стајаше пред Господом,
23 ౨౩ అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
И приступив Аврам рече: Хоћеш ли погубити и праведног с неправедним?
24 ౨౪ ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
Може бити да има педесет праведника у граду; хоћеш ли и њих погубити, и нећеш опростити месту за оних педесет праведника што су у њему?
25 ౨౫ నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
Немој то чинити, ни губити праведника с неправедником, да буде праведнику као и неправеднику; немој; еда ли судија целе земље неће судити право?
26 ౨౬ దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
И рече Господ: Ако нађем у Содому педесет праведника у граду, опростићу целом месту њих ради.
27 ౨౭ అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.
А Аврам одговори и рече: Гле, сада бих проговорио Господу, ако и јесам прах и пепео.
28 ౨౮ యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
Може бити праведника педесет мање пет, хоћеш ли за оних пет потрти сав град? Одговори: Нећу, ако нађем четрдесет и пет.
29 ౨౯ అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు.
И стаде даље говорити, и рече: Може бити да ће се наћи четрдесет. Рече: Нећу ради оних четрдесет.
30 ౩౦ అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
Потом рече: Немој се гневити, Господе, што ћу рећи; може бити да ће се наћи тридесет. И рече: Нећу, ако нађем тридесет.
31 ౩౧ అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
Опет рече: Гле сада бих проговорио Господу; може бити да ће се наћи двадесет. Рече: Нећу их погубити за оних двадесет.
32 ౩౨ చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
Најпосле рече: Немој се гневити, Господе, што ћу још једном проговорити; може бити да ће се наћи десет. Рече: Нећу их погубити ради оних десет.
33 ౩౩ అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
И Господ отиде свршивши разговор са Аврамом; а Аврам се врати на своје место.