< ఆదికాండము 16 >

1 అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు.
А Сарайя, жената на Аврама, не му раждаше деца; но, като имаше слугиня египтянка, на име Агар,
2 శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.
Сарайя рече на Аврама: Виж сега, Господ не ми дава да раждам; моля ти се влез при слугинята ми; може би ще придобия чадо, чрез нея. И Аврам послуша това, което каза Сарайя.
3 అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది.
И тъй, след като Аврам беше преживял десет години в Ханаанската земя, Сарайя Аврамовата жена, взе слугинята си Агар, египтянката, и я даде на мъжа си Аврама да му бъде жена.
4 అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.
И той влезе при Агар и тя зачна; и като видя че зачна, господарката й стана презряна в очите й.
5 అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది.
Тогава Сарайя рече на Аврама: Поради тебе ми дойде тая обида. Дадох слугинята си в твоите обятия; а като видя, че зачна, аз станах презряна в очите й. Господ нека съди между мене и тебе.
6 అందుకు అబ్రాము “ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.
А Аврам рече на Сарайя: Ето, слугинята ти; стори с нея, както ти се вижда угодно. Прочее, Сарайя се отнасяше зле с нея, така щото тя побягна от лицето й.
7 షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు.
Но ангел Господен я намери при един воден извор в пустинята, при извора на пътя за Сур;
8 ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది.
и рече: Агар, Сараина слугиньо, от где идеш? и къде отиваш? А тя рече: Бягам от лицето на господарката си Сарайя.
9 అప్పుడు యెహోవా దూత “నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు” అన్నాడు.
А ангелът Господен й рече: Върни се при господарката си, и покори се под властта й.
10 ౧౦ యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు.
Ангелът Господен тоже и рече: Ще преумножа потомството ти, до толкоз, че да не може да се изброи, поради своето множество.
11 ౧౧ తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు.
После ангелът Господен й каза: Ето ти си зачнала, и ще родиш син; да го наименуваш Исмаил, защото Господ чу скръбта ти.
12 ౧౨ అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు.
Той ще бъде между човеците, като див осел; ще дига ръката си против всекиго и всеки ще дига ръката си против него; и той ще живее независим от всичките си братя.
13 ౧౩ అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది.
Тогава Агар даде на Господа, Който й говореше, това име: Ти си Бог, Който вижда; защото рече: Не видях ли тук аз Онзи, Който ме вижда?
14 ౧౪ దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
Затова, тоя кладенец се наименува Вир-лахай-рой
15 ౧౫ తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు.
И Агар роди син на Аврама; и Аврам наименува сина си, роден от Агар, Исмаил.
16 ౧౬ అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.
А Аврам беше на осемдесет и шест години когато Агар му роди Исмаила.

< ఆదికాండము 16 >