< ఆదికాండము 15 >

1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు.
По цих-о подіях було слово Господнє Аврамові в видінні таке: „Не бійся, Авраме, — Я тобі щит, нагорода твоя вельми велика“.
2 అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా!
А Аврам відізвався: „Господи, Господи, — що́ даси Ти мені, коли я бездітний ходжу́, а керівник мого господарства — він Елі-Езер із Дамаску“.
3 నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు.
І сказав Аврам: „Отож, Ти не дав нащадка мені, і ото мій керівник — спадкоє́мець мені“.
4 యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు.
І ось слово Господнє до нього таке: „Він не бу́де спадкоє́мець тобі, але той, хто вийде з твойого нутра, — він буде спадкоє́мець тобі“.
5 ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.
І Господь його вивів надвір та й сказав: „Подивися на небо, та зорі злічи, коли тільки потрапиш ти їх полічити“. І до нього прорік: „Таким буде потомство твоє!“
6 అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు.
І ввірував Аврам Господе́ві, а Він залічив йому те в праведність.
7 యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు
І промовив до нього: „Я Господь, що вивів тебе з Уру халдейського, щоб дати тобі землю оцю, щоб став ти спадкоє́мець її“.
8 అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
І промовив Аврам: „Господи, Господи, — з чого я довідаюся, що буду спадкоє́мець її?“
9 ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు.
Він же промовив до нього: „Візьми трилітнє теля, і трилітню козу, і трилітнього барана, і горлицю, і пташеня голубине“.
10 ౧౦ అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు.
І взяв він для Нього все те, і розсік його пополовині, і дав кожну частину його відповідно до другої, але птаства не розсік.
11 ౧౧ ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.
І зліталося хиже птаство на трупи, та Аврам відганяв його.
12 ౧౨ చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది.
Коли ж сонце схилялось на захід, то спав сон на Аврама. І ось спадає на нього жах темний, великий.
13 ౧౩ ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.
І промовив Господь до Аврама: „Добре знай, що потомство твоє буде прихо́дьком в землі не своїй. І будуть служити вони, і будуть їх мучити чотири сотні літ.
14 ౧౪ వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు.
Але наро́д, якому служити вони будуть, Я засуджу́; та вони потім вийдуть з великим маєтком.
15 ౧౫ కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు.
А ти до своєї рідні при́йдеш у мирі, у старості добрій похований будеш.
16 ౧౬ అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో” అని అబ్రాముతో చెప్పాడు.
А покоління четверте повернеться сюди, бо досі не повний ще гріх амореянина“.
17 ౧౭ సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి.
І сталось, коли зайшло сонце й була те́мрява, то ось появилась мов димуюча піч, та смолоскип огняни́й перейшов поміж тими кусками жертви.
18 ౧౮ ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
І того дня склав Господь заповіта з Аврамом, говорячи: „Насінню твоєму Я дав оцю землю від річки Єгипту аж до річки великої, до річки Ефрата:
19 ౧౯ కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను,
хенеянина, і кенізеянина, і кадмонеянина,
20 ౨౦ హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను,
і хіттеянина, і періззеянина, і рефаеянина,
21 ౨౧ అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను” అని అబ్రాముతో నిబంధన చేశాడు.
і амореянина, і ханаанеянина, і ґірґашеянина, і евусеянина“.

< ఆదికాండము 15 >