< ఆదికాండము 11 >
1 ౧ అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
Na całej ziemi był jeden język i jedna mowa.
2 ౨ వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
A gdy wędrowali od wschodu, znaleźli równinę w ziemi Szinear i tam mieszkali.
3 ౩ వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
I mówili jeden do drugiego: Chodźcie, zróbmy cegły i wypalmy je w ogniu; i mieli cegłę zamiast kamienia, a smołę zamiast zaprawy.
4 ౪ వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
Potem powiedzieli: Chodźcie, zbudujmy sobie miasto i wieżę, której szczyt [sięgałby] do nieba, i uczyńmy sobie imię, abyśmy się nie rozproszyli po powierzchni całej ziemi.
5 ౫ యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
A PAN zstąpił, aby zobaczyć miasto i wieżę, które synowie ludzcy budowali.
6 ౬ యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
I PAN powiedział: Oto lud jest jeden i wszyscy mają jeden język, a [jest] to dopiero początek ich dzieła. Teraz nic nie powstrzyma ich od wykonania tego, co zamierzają uczynić.
7 ౭ కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.
Zstąpmy więc i pomieszajmy tam ich język, aby jeden nie zrozumiał języka drugiego.
8 ౮ ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
I tak PAN rozproszył ich stamtąd po całej powierzchni ziemi; i przestali budować miasto.
9 ౯ అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
Dlatego nazwano je Babel, bo tam PAN pomieszał język całej ziemi. I stamtąd PAN rozproszył ich po całej powierzchni ziemi.
10 ౧౦ షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
To [są] dzieje rodu Sema: Gdy Sem miał sto lat, spłodził Arpachszada, dwa lata po potopie.
11 ౧౧ షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
Po spłodzeniu Arpachszada Sem żył pięćset lat i spłodził synów i córki.
12 ౧౨ అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
Arpachszad żył trzydzieści pięć lat i spłodził Szelacha.
13 ౧౩ అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Szelacha Arpachszad żył czterysta trzy lata i spłodził synów i córki.
14 ౧౪ షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
Szelach żył trzydzieści lat i spłodził Ebera.
15 ౧౫ షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Ebera Szelach żył czterysta trzy lata i spłodził synów i córki.
16 ౧౬ ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
Eber żył trzydzieści cztery lata i spłodził Pelega.
17 ౧౭ ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Pelega Eber żył czterysta trzydzieści lat i spłodził synów i córki.
18 ౧౮ పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
Peleg żył trzydzieści lat i spłodził Reu.
19 ౧౯ పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Reu Peleg żył dwieście dziewięć lat i spłodził synów i córki.
20 ౨౦ రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
Reu żył trzydzieści dwa lata i spłodził Seruga.
21 ౨౧ రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Seruga Reu żył dwieście siedem lat i spłodził synów i córki.
22 ౨౨ సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
Serug żył trzydzieści lat i spłodził Nachora.
23 ౨౩ సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Nachora Serug żył dwieście lat i spłodził synów i córki.
24 ౨౪ నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
Nachor żył dwadzieścia dziewięć lat i spłodził Teracha.
25 ౨౫ నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
Po spłodzeniu Teracha Nachor żył sto dziewiętnaście lat i spłodził synów i córki.
26 ౨౬ తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
Terach żył siedemdziesiąt lat i spłodził Abrama, Nachora i Harana.
27 ౨౭ తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
A to są rody Teracha: Terach spłodził Abrama, Nachora i Harana. Haran zaś spłodził Lota.
28 ౨౮ హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.
I Haran umarł za życia swego ojca Teracha w ziemi swego urodzenia, w Ur chaldejskim.
29 ౨౯ అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
I Abram, i Nachor pojęli sobie żony: imię żony Abrama [było] Saraj, a imię żony Nachora – Milka. Była ona córką Harana, ojca Milki i Jeski.
30 ౩౦ శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
A Saraj była niepłodna, nie miała dzieci.
31 ౩౧ తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
I Terach wziął swego syna Abrama i swego wnuka Lota, syna Harana, i swoją synową Saraj, żonę swego syna Abrama; i wyruszyli razem z Ur chaldejskiego, aby udać się do ziemi Kanaan. Gdy przybyli do Charanu, zamieszkali tam.
32 ౩౨ తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.
I dni Teracha było dwieście pięć lat, i umarł w Charanie.