< ఆదికాండము 10 >
1 ౧ నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
Hivi ndivyo vilikuwa vizazi vya wana wa Nuhu, ambao ni, Shemu, Hamu, na Yafethi. Wana wa kiume walizaliwa kwao baada ya gharika.
2 ౨ యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
Wana wa Yafethi walikuwa Gomeri, Magogu, Madai, Yavani, Tubali, Masheki, na Tirasi.
3 ౩ గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
Na wana wa Gomeri walikuwa Ashikenazi, Rifathi na Togama.
4 ౪ యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
Wana wa Yavani walikuwa Elisha, Tarshishi, Kitimu, na Dodanimu.
5 ౫ వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
Kutoka kwa hawa watu wa pwani waligawanyika na kwenda kwenye ardhi zao, kila mtu na lugha yake, kufuatana na koo zao, kwa mataifa yao.
6 ౬ హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
Wana wa Hamu walikuwa Kushi, Misraimu, Putu, na Kanaani.
7 ౭ కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
Wana wa Kushi walikuwa Seba, Havila, Sabta, Raama, na Sabteka. Wana wa Raama walikuwa Sheba na Dedani.
8 ౮ కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
Kushi akamzaa Nimrodi, ambaye alikuwa hodari wa kwanza juu ya nchi.
9 ౯ అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
Alikuwa mwindaji mkuu mbele ya Yahwe. Hii ndiyo sababu hunenwa, “Kama Nimrod mwindaji mkuu mbele za Yahwe.”
10 ౧౦ షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
Miji ya kwanza ya ufalme wake ilikuwa Babeli, Ereku, Akadi na Kalne, katika ichi ya Shinari.
11 ౧౧ ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
Kutoka katika nchi ile alikwenda Ashuru na akajenga Ninawi, Rehoboth- iri na Kala,
12 ౧౨ నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
na Raseni ambao ulikuwa kati ya Ninawi na Kala. Ulikuwa mji mkubwa.
13 ౧౩ మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
Misraimu akazaa Waludi, Waanami, Walehabi, na Wanaftuhi,
14 ౧౪ పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
Wapathrusi na Wakasluhi ( ambao kwao Wafilisti walitokea), na Wakaftori.
15 ౧౫ కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
Kanaani akamzaa Sidono, mwanawe wa kwanza, na Hethi,
16 ౧౬ హివ్వీ, అర్కీయు, సినీయ,
pia na Myebusi, na Mwamori, Mgirgashi,
17 ౧౭ అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
Mhivi, Mwarki, Msini,
18 ౧౮ ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
Mwarvadi, Msemari, na Mhamathi. Baadaye koo za wakanaani zikasambaa.
19 ౧౯ కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
Mpaka wa Wakanaani ulianzia Sidoni, katika mwelekeo wa Gerari, hata Gaza, na kama kuelekea Sodoma, Gomora, Adma, na Seboimu hata Lasha.
20 ౨౦ వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
Hawa walikuwa wana wa Ham, kwa koo zao, kwa lugha zao, katika ardhi zao na katika mataifa yao.
21 ౨౧ యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
Pia walizaliwa wana kwa Shemu, ndugu yake mkubwa wa Yafethi. Shemu pia alikuwa baba yao na watu wote wa Eberi.
22 ౨౨ షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
Wana wa Shemu walikuwa Elamu, Ashuru, Alfaksadi, Ludi, na Aramu.
23 ౨౩ అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
Wana wa Aramu walikuwa ni Usi, Huli, Getheri, na Mashi.
24 ౨౪ అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
Arfaksadi akamzaa Sela, na Sela akamzaa Eber.
25 ౨౫ ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
Eberi akazaa wana wawili wa kiume. Jina la mmoja aliitwa Pelegi maana katika siku zake nchi iligawanyika. Jina la ndugu yake aliitwa Yoktani.
26 ౨౬ యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
Yoktani akamzaa Almodadi, Shelefu, Hasarmawethi, Yera,
27 ౨౭ హదోరము, ఊజాలు, దిక్లా,
Hadoram, Uzali, Dikla,
28 ౨౮ ఓబాలు, అబీమాయెలు, షేబ,
Obali, Abimaeli, Sheba,
29 ౨౯ ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
Ofiri, Havila, na Yobabi. Hawa wote walikuwa wana wa Yoktani.
30 ౩౦ వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
Mpaka wao ulikuwa unaanzia Mesha, hadi Sefari, mlima wa mashariki.
31 ౩౧ వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
Hawa walikuwa wana wa Shemu, kulingana na koo zao na lugha zao, katika ardhi zao kulingana na mataifa yao.
32 ౩౨ తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.
Hizi zilikuwa koo za wana wa Nuhu, kulingana na vizazi vyao, kwa mataifa yao. Kutokea kwa hawa mataifa yaligawanyika na kwenda juu ya nchi baada ya gharika.