< గలతీయులకు 1 >

1 మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
Paul, an Apostle, not from men and not through man, but through Jesus Christ, and God the Father, who raised him from the dead,
2 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
and all the brothers who are with me: to the churches of Galatia.
3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
Grace and peace to you from God the Father, and from our Lord Jesus Christ,
4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. (aiōn g165)
who gave himself on behalf of our sins, so that he might deliver us from this present wicked age, according to the will of God our Father. (aiōn g165)
5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌. (aiōn g165)
To him is glory forever and ever. Amen. (aiōn g165)
6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
I wonder that you have been so quickly transferred, from him who called you into the grace of Christ, over to another gospel.
7 అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు.
For there is no other, except that there are some persons who disturb you and who want to overturn the Gospel of Christ.
8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.
But if anyone, even we ourselves or an Angel from Heaven, were to preach to you a gospel other than the one that we have preached to you, let him be anathema.
9 మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
Just as we have said before, so now I say again: If anyone has preached a gospel to you, other than that which you have received, let him be anathema.
10 ౧౦ ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
For am I now persuading men, or God? Or, am I seeking to please men? If I still were pleasing men, then I would not be a servant of Christ.
11 ౧౧ సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
For I would have you understand, brothers, that the Gospel which has been preached by me is not according to man.
12 ౧౨ మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
And I did not receive it from man, nor did I learn it, except through the revelation of Jesus Christ.
13 ౧౩ నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
For you have heard of my former behavior within Judaism: that, beyond measure, I persecuted the Church of God and fought against Her.
14 ౧౪ అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
And I advanced in Judaism beyond many of my equals among my own kind, having proven to be more abundant in zeal toward the traditions of my fathers.
15 ౧౫ అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని
But, when it pleased him who, from my mother’s womb, had set me apart, and who has called me by his grace,
16 ౧౬ ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
to reveal his Son within me, so that I might evangelize him among the Gentiles, I did not next seek the consent of flesh and blood.
17 ౧౭ నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
Neither did I go to Jerusalem, to those who were Apostles before me. Instead, I went into Arabia, and next I returned to Damascus.
18 ౧౮ మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను.
And then, after three years, I went to Jerusalem to see Peter; and I stayed with him for fifteen days.
19 ౧౯ అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
But I saw none of the other Apostles, except James, the brother of the Lord.
20 ౨౦ నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను.
Now what I am writing to you: behold, before God, I am not lying.
21 ౨౧ ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
Next, I went into the regions of Syria and Cilicia.
22 ౨౨ క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
But I was unknown by face to the churches of Judea, which were in Christ.
23 ౨౩ “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని,
For they had only heard that: “He, who formerly persecuted us, now evangelizes the faith which he once fought.”
24 ౨౪ వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.
And they glorified God in me.

< గలతీయులకు 1 >