< గలతీయులకు 5 >

1 స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
Tad nu pastāviet tai svabadībā, uz ko Kristus mūs ir atsvabinājis, un neliekaties atkal gūstīties kalpošanas jūgā.
2 మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
Redzi, es Pāvils jums saku: ja jūs topat apgraizīti, tad Kristus jums nederēs nenieka.
3 సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
Un atkal es apliecināju ikvienam cilvēkam, kas top apgraizīts, ka tam visa bauslība jātur.
4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
Jūs esat atkāpušies no Kristus, jūs, kas caur bauslību gribat tapt taisnoti; jūs žēlastību esat pazaudējuši:
5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
Jo no ticības mēs garā gaidām taisnības cerību.
6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
Jo iekš Kristus Jēzus nedz apgraizīšana ko spēj, nedz priekšāda, bet ticība, kas caur mīlestību spēcīga parādās.
7 మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
Jūs gan labi tecējāt; kas jūs ir aizkavējis, ka jūs patiesībai nepaklausāt?
8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు.
Tā pierunāšana nav no Tā, kas jūs aicina.
9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
Maz rauga saraudzē visu mīklu.
10 ౧౦ మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
Es droši uz jums paļaujos iekš Tā Kunga, ka jūs citu prātu neturēsiet; bet kas jūs sajauc, tas nesīs to sodu, lai būtu, kas būdams.
11 ౧౧ సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
Bet, brāļi, ja es vēl apgraizīšanu sludināju, kam tad vēl topu vajāts? Tad tā piedauzīšanās pie krusta jau būtu mitējusies.
12 ౧౨ మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది.
Kaut jel arī tie taptu graizīti, kas jūs musina!
13 ౧౩ సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
Jo, brāļi, jūs uz svabadību esat aicināti; tikai ne uz tādu svabadību, ka miesai ir vaļa; bet kalpojiet cits citam mīlestībā.
14 ౧౪ ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది.
Jo visa bauslība vienā vārdā top piepildīta, proti šinī; Tev būs savu tuvāko mīlēt kā sevi pašu.
15 ౧౫ అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
Bet ja jūs savā starpā kožaties un ēdaties, tad pielūkojiet, ka jūs cits no cita netiekat aprīti.
16 ౧౬ నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
Bet es saku: staigājiet garā, tad jūs miesas kārību nepadarīsiet.
17 ౧౭ శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
Jo miesai gribās pret garu un garam pret miesu, un tie stāv viens otram pretī, ka jūs nedarāt, ko gribat.
18 ౧౮ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
Bet ja jūs no Gara topat vadīti, tad jūs neesat apakš bauslības.
19 ౧౯ శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
Bet miesas darbi ir zināmi, ka laulības pārkāpšana, maucība, nešķīstība, bezkaunība,
20 ౨౦ విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
Elkadievība, burvība, ienaids, bāršanās, nīdēšanās, dusmības, ķildas, šķelšanās, viltīgas mācības,
21 ౨౧ శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
Skaudības, slepkavības, plītēšanas, rīšanas, un kas šiem līdzīgi; no tiem es jums papriekš saku, tā kā jau esmu sacījis, ka tie, kas tādas lietas dara, Dieva valstību neiemantos.
22 ౨౨ అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
Bet Tā Gara auglis ir: mīlestība, līksmība, miers, pacietība, laipnība, labprātība, ticība, lēnprātība, sātība.
23 ౨౩ అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
Pret tādiem nav bauslība.
24 ౨౪ క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
Bet tie, kas Kristum pieder, savu miesu ir krustā situši ar tām kārībām un iekārošanām.
25 ౨౫ మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.
Ja mēs garā dzīvojam, tad lai arī garā staigājam.
26 ౨౬ అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
Lai nedzenamies pēc nīcīga goda, cits citu kaitinādami, cits citu skauzdami.

< గలతీయులకు 5 >