< గలతీయులకు 5 >
1 ౧ స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
Christ has set you free with freedom, Therefore stand, and be not again entangled with the yoke of bondage.
2 ౨ మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
Behold I Paul say unto you, that, if you may be circumcised, Christ shall profit you nothing.
3 ౩ సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
And again I witness to every man who is circumcised, that he is debtor to do the whole law.
4 ౪ మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
You have been divorced from Christ, whosoever are justified by law: you have fallen from grace.
5 ౫ మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
For we through the Spirit do await the hope of righteousness through faith.
6 ౬ యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
For in Christ Jesus neither circumcision or uncircumcision avails anything; but faith working through divine love.
7 ౭ మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
You were running well; who did hinder you that you should not obey the truth?
8 ౮ ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు.
The persuasion is not of the one calling you.
9 ౯ పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
A little leaven leavens the whole lump.
10 ౧౦ మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
I have confidence in reference to you in the Lord, that you shall be none otherwise minded: but the one troubling you shall bear the judgment, whosoever he may be.
11 ౧౧ సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
But I, brethren, if I yet preach circumcision, why do I still suffer persecution? then the offence of the cross would be done away.
12 ౧౨ మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది.
I would that those troubling you shall indeed cut themselves off.
13 ౧౩ సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
For you were called unto liberty, brethren; only use not the liberty unto an occasion to the flesh, but through divine love serve one another.
14 ౧౪ ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది.
For the whole law has been fulfilled in one word, in this; Thou shalt love thy neighbor with divine love as thyself.
15 ౧౫ అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
But if you bite and devour one another, take heed that you may not be consumed one of another.
16 ౧౬ నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
And I say, Walk about in the Spirit, and do not perfect the lust of carnality.
17 ౧౭ శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
For carnality wars against the Spirit, and the Spirit against carnality; for these are antagonistical to one another; so that you may not do the things which you may wish.
18 ౧౮ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
But if you are led by the Spirit, you are not under law.
19 ౧౯ శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
But the works of carnality are manifest, which are fornication, uncleanness, debauchery,
20 ౨౦ విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
idolatry, sorcery, enmities, strife, jealousy, animosities, selfseekings, divisions, heresies,
21 ౨౧ శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
envyings, drunkenness, revellings, and things like unto these: which I tell you beforehand, as I did previously say to you, that those doing such things shall not inherit the kingdom of God.
22 ౨౨ అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
But the fruit of the Spirit is divine love, joy, peace, long suffering, kindness, goodness, faith,
23 ౨౩ అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
meekness, holiness; against such things there is no law.
24 ౨౪ క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
But those belonging to Christ Jesus have crucified carnality with the passions and lusts.
25 ౨౫ మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.
If we live in the Spirit, let us also walk in the Spirit.
26 ౨౬ అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.
Let us not be fond of vain glory, provoking one another, envying one another.