< గలతీయులకు 4 >

1 నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు.
ⲁ̅ϯϫⲱ ⲇⲉ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲉⲡϩⲟⲥⲟⲛ ⲡⲉⲩⲟⲉⲓϣ ⲡⲉⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲟⲩⲕⲟⲩⲓ̈ ⲡⲉ. ⲛϥ̅ϣⲟⲃⲉ ⲗⲁⲁⲩ ⲁⲛ ⲉⲩϩⲙ̅ϩⲁⲗ. ⲉⲡϫⲟⲉⲓⲥ ⲛ̅ⲛ̅ⲕⲁ ⲛⲓⲙ ⲡⲉ.
2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు.
ⲃ̅ⲁⲗⲗⲁ ϥϣⲟⲟⲡ ϩⲁϩⲉⲛⲉⲡⲓⲧⲣⲟⲡⲟⲥ. ⲙⲛ̅ϩⲉⲛⲟⲓⲕⲟⲛⲟⲙⲟⲥ ϣⲁⲧⲉⲡⲣⲟⲑⲉⲥⲙⲓⲁ ⲙ̅ⲡⲉⲓⲱⲧ
3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
ⲅ̅ⲧⲁⲓ̈ ϩⲱⲱⲛ ⲧⲉ ⲧⲉⲛϩⲉ ⲙ̅ⲡⲉⲟⲩⲟⲉⲓϣ ⲉⲛⲟ ⲛ̅ⲕⲟⲩⲓ̈ ⲛⲉⲛϣⲟⲟⲡ ϩⲁⲛⲉⲥⲧⲟⲓⲭⲓⲟⲛ ⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲉⲛⲟ ⲛ̅ϩⲙ̅ϩⲁⲗ·
4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,
ⲇ̅ⲛ̅ⲧⲉⲣⲉⲡϫⲱⲕ ⲇⲉ ⲙ̅ⲡⲉⲩⲟⲉⲓϣ ⲉⲓ ⲁⲡⲛⲟⲩⲧⲉ ⲧⲛ̅ⲛⲟⲟⲩ ⲙ̅ⲡⲉϥϣⲏⲣⲉ ⲉⲁϥϣⲱⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲟⲩⲥϩⲓⲙⲉ. ⲁϥϣⲱⲡⲉ ϩⲁⲡⲛⲟⲙⲟⲥ.
5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.
ⲉ̅ϫⲉ ⲉϥⲉϣⲱⲡ ⲛ̅ⲛⲉⲧϩⲁⲡⲛⲟⲙⲟⲥ ϫⲉⲕⲁⲁⲥ ⲉⲛⲉϫⲓ ⲛ̅ⲧⲙⲛ̅ⲧϣⲏⲣⲉ.
6 మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు.
ⲋ̅ϫⲉ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲛ̅ϣⲏⲣⲉ ⲇⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ. ⲁϥⲧⲛ̅ⲛⲟⲟⲩ ⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲙ̅ⲡⲉϥϣⲏⲣⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲛⲉⲛϩⲏⲧ ⲉϥⲱϣ ⲉⲃⲟⲗ ϫⲉ ⲁⲃⲃⲁ ⲡⲉⲓⲱⲧ.
7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
ⲍ̅ϩⲱⲥⲧⲉ ϭⲉ ⲛ̅ⲧⲕ̅ⲟⲩϩⲙ̅ϩⲁⲗ ⲁⲛ. ⲁⲗⲗⲁ ⲛ̅ⲧⲕ̅ⲟⲩϣⲏⲣⲉ. ⲉϣϫⲉⲛ̅ⲧⲕ̅ⲟⲩϣⲏⲣⲉ ⲇⲉ ⲉⲓ̈ⲉ ⲛ̅ⲧⲕ̅ⲟⲩⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅.
8 ఆ కాలంలో మీరు దేవుని ఎరగనివారై, వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు గాని
ⲏ̅ⲁⲗⲗⲁ ⲙ̅ⲡⲓⲟⲩⲟⲉⲓϣ ⲙⲉⲛ ⲉⲛⲧⲉⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲧⲉⲧⲛ̅ⲣ̅ϩⲙ̅ϩⲁⲗ ⲫⲩⲥⲓ ⲛ̅ⲛⲉⲧⲉⲛ̅ϩⲉⲛⲛⲟⲩⲧⲉ ⲁⲛ ⲛⲉ.
9 ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా?
ⲑ̅ⲧⲉⲛⲟⲩ ⲇⲉ ⲁⲧⲉⲧⲛ̅ⲥⲟⲩⲛ̅ⲡⲛⲟⲩⲧⲉ. ⲛ̅ϩⲟⲩⲟ ⲇⲉ ⲁⲡⲛⲟⲩⲧⲉ ⲥⲟⲩⲛ̅ⲧⲏⲩⲧⲛ̅. ⲛ̅ⲁϣ ⲛ̅ϩⲉ ⲧⲉⲧⲛ̅ⲕⲱⲧⲉ ⲟⲛ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲉⲛⲉⲥⲧⲟⲓⲭⲓⲟⲛ ⲛ̅ⲁⲧϭⲟⲙ ⲁⲩⲱ ⲛ̅ϩⲏⲕⲉ. ⲛⲁⲓ̈ ⲟⲛ ⲉⲧⲉⲧⲛ̅ⲟⲩⲉϣⲣ̅ϩⲙ̅ϩⲁⲗ ⲛⲁⲩ ⲛ̅ⲕⲉⲥⲟⲡ.
10 ౧౦ మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట.
ⲓ̅ⲧⲉⲧⲛ̅ⲡⲁⲣⲁⲧⲏⲣⲉⲓ ⲉϩⲉⲛϩⲟⲟⲩ. ⲙⲛ̅ϩⲉⲛⲉⲃⲁⲧⲉ. ⲙⲛ̅ϩⲉⲛⲟⲩⲟⲉⲓϣ ⲙⲛ̅ϩⲉⲛⲣⲟⲙⲡⲉ.
11 ౧౧ మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
ⲓ̅ⲁ̅ϯⲣ̅ϩⲟⲧⲉ ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅ ϫⲉ ⲙⲏⲡⲱⲥ ⲁⲓ̈ϣⲡ̅ϩⲓⲥⲉ ⲉⲣⲱⲧⲛ̅ ⲉⲓⲕⲏ.
12 ౧౨ సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు.
ⲓ̅ⲃ̅ϣⲱⲡⲉ ⲛ̅ⲧⲁϩⲉ ϫⲉ ⲁⲛⲟⲕ ϩⲱⲱⲧ ⲟⲛ ⲛ̅ⲧⲉⲧⲛ̅ϩⲉ· ⲛⲉⲥⲛⲏⲩ ϯⲥⲟⲡⲥ̅ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲙ̅ⲡⲉⲧⲛ̅ϫⲓⲧⲗⲁⲁⲩ ⲛ̅ϭⲟⲛⲥ̅.
13 ౧౩ మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.
ⲓ̅ⲅ̅ⲧⲉⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϫⲉ ⲉⲧⲃⲉⲧⲙⲛ̅ⲧⲁⲧϭⲟⲙ ⲛ̅ⲧⲥⲁⲣⲝ̅. ⲁⲓ̈ⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲛⲏⲧⲛ̅ ⲙ̅ⲡϣⲟⲣⲡ̅ ⲛ̅ⲥⲟⲡ.
14 ౧౪ నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲡⲁⲡⲓⲣⲁⲥⲙⲟⲥ ⲉⲧϩⲛ̅ⲧⲁⲥⲁⲣⲝ̅ ⲙ̅ⲡⲉⲧⲛ̅ⲥⲟϣϥ̅ ⲟⲩⲇⲉ ⲙ̅ⲡⲉⲧⲛ̅ⲃⲁⲃⲱⲱϥ. ⲁⲗⲗⲁ ⲛ̅ⲑⲉ ⲛ̅ⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ. ⲛ̅ⲧⲉⲡⲛⲟⲩⲧⲉ. ⲁⲧⲉⲧⲛ̅ϣⲟⲡⲧ̅ ⲉⲣⲱⲧⲛ̅ ⲛ̅ⲑⲉ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅ ⲓⲥ̅.
15 ౧౫ మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.
ⲓ̅ⲉ̅ⲉϥⲧⲱⲛ ϭⲉ ⲡⲉⲧⲛ̅ⲙⲁⲕⲁⲣⲓⲥⲙⲟⲥ. ϯⲣ̅ⲙⲛ̅ⲧⲣⲉ ⲅⲁⲣ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲉⲛⲉⲟⲩⲛ̅ϣϭⲟⲙ ⲉϣϫⲡⲉ ⲁⲧⲉⲧⲛ̅ⲡⲣⲕ̅ⲛⲉⲧⲛ̅ⲁⲗⲟⲟⲩⲉ ⲁⲧⲉⲧⲛ̅ⲧⲁⲁⲩ ⲛⲁⲓ̈.
16 ౧౬ నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
ⲓ̅ⲋ̅ϩⲱⲥⲧⲉ ⲁⲓ̈ⲣ̅ϫⲁϫⲉ ⲉⲣⲱⲧⲛ̅ ϫⲉ ⲁⲓ̈ϫⲉⲧⲙⲉ ⲛⲏⲧⲛ̅.
17 ౧౭ వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు.
ⲓ̅ⲍ̅ⲥⲉⲕⲱϩ ⲉⲣⲱⲧⲛ̅ ⲕⲁⲗⲱⲥ ⲁⲛ. ⲁⲗⲗⲁ ⲉⲩⲟⲩⲱϣ ⲉⲣⲉⲕⲧ̅ⲧⲏⲩⲧⲛ̅ ⲉⲃⲟⲗ ϫⲉ ⲉⲧⲉⲧⲛⲉⲕⲱϩ ⲉⲣⲟⲟⲩ.
18 ౧౮ నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది.
ⲓ̅ⲏ̅ⲛⲁⲛⲟⲩⲥ ⲅⲁⲣ ⲉⲧⲣⲉⲩⲕⲱϩ ⲉⲣⲱⲧⲛ̅ ϩⲙ̅ⲡⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛ̅ⲟⲩⲟⲉⲓϣ ⲛⲓⲙ. ⲁⲩⲱ ⲉⲉⲓϩⲁⲧⲉⲧⲏⲩⲧⲛ̅ ⲙ̅ⲙⲁⲧⲉ ⲁⲛ·
19 ౧౯ నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.
ⲓ̅ⲑ̅ⲛⲁϣⲏⲣⲉ ⲛⲁⲓ̈ ⲟⲛ ⲉϯϯⲛⲁⲁⲕⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ϣⲁⲛⲧⲉⲡⲉⲭ̅ⲥ̅ ϫⲓⲙⲟⲣⲫⲏ ⲛ̅ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅.
20 ౨౦ మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ⲕ̅ⲛⲉⲓ̈ⲟⲩⲱϣ ⲇⲉ ⲉⲉⲓ ϣⲁⲣⲱⲧⲛ̅ ⲧⲉⲛⲟⲩ ⲧⲁϣⲓⲃⲉ ⲛ̅ⲧⲁⲥⲙⲏ. ϫⲉ ϯⲧⲥ̅ⲧⲏⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅.
21 ౨౧ ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా?
ⲕ̅ⲁ̅ⲁϫⲓⲥ ⲉⲣⲟⲓ̈ ⲛⲉⲧⲟⲩⲱϣ ⲉϣⲱⲡⲉ ϩⲁⲡⲛⲟⲙⲟⲥ. ⲛ̅ⲧⲉⲧⲛⲱϣ ⲁⲛ ⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ.
22 ౨౨ దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా?
ⲕ̅ⲃ̅ϥⲥⲏϩ ⲅⲁⲣ ϫⲉ ⲁⲃⲣⲁϩⲁⲙ ⲁϥϫⲡⲉϣⲏⲣⲉ ⲥⲛⲁⲩ. ⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧϩⲙ̅ϩⲁⲗ. ⲁⲩⲱ ⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲣⲙ̅ϩⲏ.
23 ౨౩ అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.
ⲕ̅ⲅ̅ⲁⲗⲗⲁ ⲡⲉⲃⲟⲗ ⲙⲉⲛ ϩⲛ̅ⲧϩⲙ̅ϩⲁⲗ ⲛ̅ⲧⲁⲩϫⲡⲟϥ ⲕⲁⲧⲁⲥⲁⲣⲝ̅. ⲡⲉϫⲡⲟ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲣⲙ̅ϩⲏ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ̅ⲡⲉⲣⲏⲧ ⲡⲉ.
24 ౨౪ ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు.
ⲕ̅ⲇ̅ⲛⲁⲓ̈ ⲇⲉ ϩⲉⲛⲃⲱⲗ ⲛⲉ. ⲇⲓⲁⲑⲏⲕⲏ ⲅⲁⲣ ⲥⲛ̅ⲧⲉ ⲛⲉ. ⲟⲩⲉⲓ ⲙⲉⲛ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲧⲟⲟⲩ ⲛ̅ⲥⲓⲛⲁ ⲉⲥϫⲡⲟ ⲉⲩⲙⲛ̅ⲧϩⲙ̅ϩⲁⲗ ⲉⲧⲉⲧⲁⲓ̈ ⲧⲉ ⲁⲅⲁⲣ.
25 ౨౫ ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.
ⲕ̅ⲉ̅ⲡⲧⲟⲟⲩ ⲇⲉ ⲛ̅ⲥⲓⲛⲁ ⲉϥϣⲟⲟⲡ ϩⲛ̅ⲧⲁⲣⲁⲃⲓⲁ ϥϩⲏⲛ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲉⲓ̈ϩⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ. ⲥⲟ ⲅⲁⲣ ⲛ̅ϩⲙ̅ϩⲁⲗ ⲙⲛ̅ⲛⲉⲥϣⲏⲣⲉ·
26 ౨౬ అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
ⲕ̅ⲋ̅ⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ ⲇⲉ ⲛ̅ⲧⲡⲉ ⲟⲩⲣⲙ̅ϩⲏ ⲧⲉ ⲉⲧⲉⲧⲁⲓ̈ ⲧⲉ ⲧⲉⲛⲙⲁⲁⲩ.
27 ౨౭ “గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.
ⲕ̅ⲍ̅ϥⲥⲏϩ ⲅⲁⲣ ϫⲉ ⲉⲩⲫⲣⲁⲛⲉ ⲧⲁϭⲣⲏⲛ ⲉⲧⲉⲙⲉⲥⲙⲓⲥⲉ ⲱϣ ⲉⲃⲟⲗ ⲛ̅ⲧⲉⲁϣⲕⲁⲕ ⲧⲉⲧⲉⲙⲉⲥϯⲛⲁⲁⲕⲉ. ϫⲉ ⲛⲁϣⲉⲛ̅ϣⲏⲣⲉ ⲛ̅ⲧⲉⲧⲉⲙⲛ̅ⲧⲥ̅ϩⲁⲓ̈. ⲉϩⲟⲩⲉⲧⲉⲧⲉⲩⲛ̅ⲧⲥ̅ⲡϩⲁⲓ̈·
28 ౨౮ సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు.
ⲕ̅ⲏ̅ⲛ̅ⲧⲱⲧⲛ̅ ⲇⲉ ⲛⲉⲥⲛⲏⲩ ⲕⲁⲧⲁⲓ̈ⲥⲁⲁⲕ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲛ̅ϣⲏⲣⲉ ⲙ̅ⲡⲉⲣⲏⲧ
29 ౨౯ అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది.
ⲕ̅ⲑ̅ⲁⲗⲗⲁ ⲛ̅ⲑⲉ ⲙ̅ⲡⲓⲟⲩⲟⲉⲓϣ ⲉⲛⲧⲁⲡⲉϫⲡⲟ ⲕⲁⲧⲁⲥⲁⲣⲝ̅ ⲡⲱⲧ ⲛ̅ⲥⲁⲡⲕⲁⲧⲁⲡ̅ⲛ̅ⲁ̅. ⲧⲁⲓ̈ ⲟⲛ ⲧⲉⲛⲟⲩ ⲧⲉ ⲑⲉ.
30 ౩౦ అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.”
ⲗ̅ⲁⲗⲗⲁ ⲟⲩ ⲡⲉⲧⲉⲣⲉⲧⲉⲅⲣⲁⲫⲏ ϫⲱ ⲙ̅ⲙⲟϥ ϫⲉ ⲛⲟⲩϫⲉ ⲉⲃⲟⲗ ⲛ̅ϯϩⲙ̅ϩⲁⲗ ⲙⲛ̅ⲡⲉⲥϣⲏⲣⲉ. ⲛ̅ⲛⲉϥⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲓ ⲅⲁⲣ ⲛ̅ϭⲓⲡϣⲏⲣⲉ ⲛ̅ⲑⲙ̅ϩⲁⲗ. ⲙⲛ̅ⲡϣⲏⲣⲉ ⲛ̅ⲧⲣⲙ̅ϩⲏ·
31 ౩౧ అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.
ⲗ̅ⲁ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ϭⲉ ⲛⲉⲥⲛⲏⲩ ⲛ̅ⲁⲛⲟⲛⲛ̅ϣⲏⲣⲉ ⲛ̅ⲑⲙ̅ϩⲁⲗ ⲁⲛ. ⲁⲗⲗⲁ ⲁⲛⲟⲛⲛⲁⲧⲣⲙ̅ϩⲏ

< గలతీయులకు 4 >