< గలతీయులకు 3 >

1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా!
Ой ви безумні Галати! хто вас очарував, щоб ви не корились правді, (ви) котрим перед очима наперед був прописаний Христос, рознятий між вами?
2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా?
Про одно се хочу довідатись од вас: Чи дїлами закону прийняли ви Духа, чи, слухаючи, проповіддю віри?
3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
Чи такі ви незмислі, що почавши духом, звершуєте тепер тїлом?
4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా?
Марно стільки ви терпіли? Коли б тільки марно!
5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
Хто подає вам Духа і робить чудеса між вами, чи дїлами закону, чи проповіддю віри?
6 అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.”
Яко ж Авраам вірував у Бога, і полїчено йому за праведність.
7 కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి.
Знайте ж, що хто од віри, ті сини Авраамові.
8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.
І писаннє знаючи наперед, що Бог вірою оправдує поган, благовістило Авраамові: що в тобі благословлять ся всї народи.
9 కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.
Тимже хто од віри, ті благословенні із вірним Авраамом.
10 ౧౦ ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
Которі ж од дїл закону, ті під клятьбою; писано бо: Проклят, хто не встоїть у всьому написаному в книзї закону, щоб робити те.
11 ౧౧ ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.”
А що нїхто законом не оправдуєть ся перед Богом, се явно, бо праведний вірою жив буде.
12 ౧౨ ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”
Закон же не од віри, та которий чоловік робити ме те, жити ме в тому.
13 ౧౩ ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు.
Христос викупив нас од клятьби закону, ставшись за нас клятьбою, (писано бо: Проклят всяк, хто висить на дереві, )
14 ౧౪ అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
щоб на поган благословеннє Авраамове прийшло в Христї Ісусї, щоб обітуваннє Духа прийняли ми через віру.
15 ౧౫ సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
Браттє, по чоловічи глаголю; одначе чоловічого закону ствердженого нїхто не відкидав, анї додає до него.
16 ౧౬ అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
Авраамові ж виречені обітування і насїнню його. Не сказано: І насінням, яко про многі, а яко про одно: І насїнню твоєму, що єсть Христос.
17 ౧౭ నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు.
Оце ж глаголю, що завіту перше ствердженого від Бога про Христа, закон, що постав чотириста й трийцять лїт потім, не нехтує, так щоб обернути в ніщо обітуваннє.
18 ౧౮ ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.
Бо коли від закону наслїддє, то вже не від обітування; Аврааму ж обітуваннєм дарував Бог.
19 ౧౯ అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.
Що ж тодї закон? Задля переступів додано його, доки прийде насїннє, котрому обітувано; (і був він) уряджений через ангелів рукою посередника.
20 ౨౦ మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
Посередник же не єсть (посередник) одного, а Бог один.
21 ౨౧ ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది.
То хиба закон проти обітувань Божих? Нехай не буде! Бо коли б дано закон, що міг би оживляти, то справдї від закону була б праведність.
22 ౨౨ యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
Нї, зачинило писаннє усе під гріхом, щоб обітуваннє од віри Ісус-Христової дане було віруючим.
23 ౨౩ మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము.
Перше ж приходу віри, під законом стережено нас зачинених на віру, що мала відкритись.
24 ౨౪ కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది.
Тим же закон був нам учителем (щоб привести нас) до Христа, щоб вірою нам справдитись.
25 ౨౫ అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము.
Як же прийшла віра, то вже ми не під учителем.
26 ౨౬ యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
Усї бо ви сини Божі вірою в Ісуса Христа.
27 ౨౭ క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు.
Скільки бо вас у Христа хрестилось, у Христа одягли ся.
28 ౨౮ ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
Нема Жидовина, нї Грека; нема невільника, нї вільного; нема муже-ського полу, нї женського: усї бо ви одно, в Христї Ісусї.
29 ౨౯ మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
Коди ж ви Христові, то ви насїннє Авраамове, і по обітованню наслїдники.

< గలతీయులకు 3 >