< గలతీయులకు 3 >
1 ౧ తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా!
Ak jūs neprātīgie Galatieši, kas jūs ir apmānījis, patiesībai nepaklausīt, jūs, kam priekš acīm rakstīts Jēzus Kristus, Tas krustā sistais?
2 ౨ మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా?
To vien gribu no jums zināt, vai jūs to Garu esat dabūjuši no bauslības darbiem, vai no ticības mācības?
3 ౩ మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
Vai jūs esat tik neprātīgi, ka garā iesākuši, tagad miesā pabeidziet?
4 ౪ వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా?
Vai jūs tik daudz velti esat cietuši? Ja tikai velti vien!
5 ౫ ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
Tad nu (Viņš), kas jums to Garu sniedz un iekš jums modina brīnuma spēkus, vai Viņš to dara no bauslības darbiem vai no ticības mācības?
6 ౬ అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.”
Tā kā Ābrahāms Dievam ticējis, un tas viņam ir pielīdzināts par taisnību.
7 ౭ కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి.
Tad saprotat, ka, kuri ir no ticības, tie ir Ābrahāma bērni.
8 ౮ విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.
Un tas raksts paredzēdams, ka Dievs caur ticību pagānus taisno, Ābrahāmam papriekš sludinājis to prieka vārdu: “Iekš tevis visas tautas taps svētītas.”
9 ౯ కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.
Tad nu kas ir no ticības, tie līdz ar to ticīgo Ābrahāmu top svētīti.
10 ౧౦ ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
Jo cik ir no bauslības darbiem, tie ir apakš lāsta, jo ir rakstīts: “Ikviens ir nolādēts, kas nepaliek iekš visa, kas ir rakstīts bauslības grāmatā, ka viņš to dara.”
11 ౧౧ ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.”
Un ka neviens caur bauslību netop taisnots pie Dieva, tas ir zināms: jo taisnais dzīvos no ticības.
12 ౧౨ ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”
Bet bauslība nav no ticības; bet kurš cilvēks to darīs, tas caur to dzīvos.
13 ౧౩ ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు.
Kristus mūs ir atpircis no bauslības lāsta, priekš mums par lāstu palicis, (jo ir rakstīts: “Nolādēts ikviens, kas kārts pie koka”),
14 ౧౪ అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
Ka Ābrahāma svētība nāktu uz pagāniem iekš Kristus Jēzus, un ka mēs Tā Gara apsolīšanu dabūtu caur ticību.
15 ౧౫ సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
Brāļi, es runāju cilvēcīgi: neviens jau nenicina apstiprinātu cilvēka iestādījumu (testamentu) nedz pieliek ko klāt.
16 ౧౬ అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
Tad nu Ābrahāmam un viņa sēklai tās apsolīšanas notikušas. Viņš nesaka: “Un tavām sēklām”, tā kā no daudziem, bet tā kā no vienas: “Un tavai Sēklai”, Tas ir Kristus.
17 ౧౭ నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు.
Un to es saku: tas iestādījums, kas papriekš no Dieva ir apstiprināts uz Kristu, netop nocelts caur bauslību, kas pēc četrsimt un trīsdesmit gadiem notikusi, ka tā to apsolīšanu būtu iznīcinājusi.
18 ౧౮ ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.
Jo ja tā iemantošana ir no bauslības, tad tā vairs nav no apsolīšanas: bet Dievs to Ābrahāmam ir dāvinājis caur apsolīšanu.
19 ౧౯ అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.
Par ko tad nu bauslība? Tā to pārkāpumu dēļ ir pielikta klāt, tiekams tā Sēkla nāktu, kam tā apsolīšana notikusi, un bauslība ir iestādīta caur eņģeļiem, caur vidutāja roku.
20 ౨౦ మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
Bet vidutājs nav viena paša vidutājs; bet Dievs ir vienīgs.
21 ౨౧ ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది.
Vai tad nu bauslība ir pretī Dieva apsolīšanām? Nemaz. Jo ja kāda bauslība būtu dota, kas spētu dot dzīvību, tad patiesi taisnība nāktu no bauslības.
22 ౨౨ యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
Bet tas raksts visu ir saslēdzis apakš grēka, ka tā apsolīšana tiem ticīgiem taptu dota no ticības uz Jēzu Kristu.
23 ౨౩ మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము.
Bet pirms ticība nāca, mēs tapām turēti saslēgti apakš bauslības uz tās nākamās ticības atspīdēšanu.
24 ౨౪ కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది.
Tad nu bauslība ir bijusi mūsu pamācītājs uz Kristu, ka mēs taptu taisnoti caur ticību.
25 ౨౫ అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము.
Bet kad ticība ir nākusi, tad mēs vairs neesam apakš tā pamācītāja.
26 ౨౬ యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
Jo jūs visnotaļ esat Dieva bērni caur to ticību iekš Kristus Jēzus.
27 ౨౭ క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు.
Jo jūs visi, kas esat kristīti uz Kristu, jūs Kristu esat apvilkuši.
28 ౨౮ ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
Tur nav ne Jūds, ne Grieķis, tur nav ne kalps, ne svabadnieks, tur nav ne vīrs, ne sieva, - jo jūs visi esat viens iekš Kristus Jēzus.
29 ౨౯ మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
Un ja jūs Kristum piederat, tad jūs esat Ābrahāma dzimums un pēc apsolīšanas mantinieki.