< ఎజ్రా 9 >
1 ౧ ఈ విషయాలన్నీ ముగిసిన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అందరూ కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల, అమోరీయుల జాతి ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోకుండా ఆ జాతుల ప్రజలు చేస్తున్న అసహ్యకరమైన చెడ్డ పనులు వారు కూడా చేస్తున్నారు.
És ezeknek befejezése után odaléptek hozzám a nagyok, mondván: El nem különödött a nép, az izraeliták, a papok s a leviták az országok népeitől, utálataik szerint, a kanaánitól, chittitől, perizzitől, jebúszitól, ammónitól, móábitól, az egyiptomitól és émóritól;
2 ౨ వారి ఆడపిల్లలను పెళ్లి చేసుకొంటున్నారు, తమ కూతుళ్ళని వారి కొడుకులకు ఇస్తున్నారు. ప్రత్యేక జనంగా ఉండాల్సిన వీరు ఆ జాతుల పవిత్రమైన ప్రజలతో కలిసిపోయారు. పైగా ఈ తప్పులు చేస్తున్న వారిలో మన పెద్దలు, అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు.”
mert elvettek a leányaik közül maguknak és fiaiknak és összevegyült a szent magzat az országok népeivel; a nagyok és vezérek keze pedig ebben a hűtlenségben legelül volt.
3 ౩ ఈ సంగతి విని నేను నిర్ఘాంతపోయాను. నా అంగీనీ, దుప్పటినీ చింపుకుని, నా తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకుని కూర్చుండిపోయాను.
S midőn hallottam e dolgot, megszaggattam ruhámat s köntösömet s kitéptem fejem és szakállam hajából s ültem eliszonyodva.
4 ౪ గతంలో చెర నుండి తిరిగి వచ్చినవారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు, దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండి పోయాను.
És hozzám gyülekezett mindenki, aki remegett Izraél Istenének szavaira a számkivetés hűtlensége miatt; én pedig ültem eliszonyodva az esti lisztáldozatig.
5 ౫ సాయంత్రం బలి అర్పించే సమయానికి నేను కృంగిన స్థితి నుంచి తేరుకుని లేచాను. నా దుప్పటి, అంగీ చిరిగిపోయి ఉన్న స్థితిలోనే మోకరించి, నా దేవుడైన యెహోవా వైపు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించాను,
S az esti lisztáldozatkor fölkeltem böjtölésemből megszaggatott ruhámmal s köntösömmel és lehajoltam térdeimre és kiterjesztettem kezeimet az Örökkévalóhoz, Istenemhez.
6 ౬ “నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.
És szóltam: Istenem! megszégyenültem s elpirultam, semhogy felemelhetném, oh Istenem, arczomat te hozzád, mert bűneink megsokasodtak fejünk fölé és bűnösségünk egészen az égig nőtt.
7 ౭ మా పూర్వీకులతో మొదలు ఇప్పటివరకూ మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలను బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేమూ, మా రాజులూ, యాజకులూ అన్యదేశపు రాజుల స్వాధీనంలో, చావుకూ చెరకూ దోపిడీకీ గురై ఉండడం వలన ఎంతో అవమానభారంతో సిగ్గుపడుతూ ఉన్నాం.
Õseink napjai óta nagy bűnösségben vagyunk mind e mai napig; és bűneink által adattunk mi, királyaink, papjaink az országok királyainak kezébe, a kardnak, a fogságnak, a prédálásnak és az arcz szégyenének, a mint van a mai napon.
8 ౮ అయితే ఇప్పుడు మా దేవుడైన యెహోవా మా కళ్ళను వెలిగించి, మా బానిసత్వం నుండి మేము సేదదీరేలా, మాలో కొందరిని జీవించి ఉండేలా చేసి, ఆయన పరిశుద్ధ స్థలం లో మేము స్థిర నివాసం ఏర్పరచుకొనేలా కొంతవరకూ మా విషయంలో దయ చూపించాడు.
És most alig egy pillanatig könyörület volt az Örökkévaló a mi Istenünk részéről, hogy meghagyott nekünk menedéket s adott nekünk szöget az ő szent helyén, hogy megvilágosítsa Istenünk a mi szemeinket és hogy adjon nekünk csekély föléledést a mi szolgaságunkban.
9 ౯ నిజంగా మేము దాసులమైనప్పటికీ మా దేవుడివైన నువ్వు మమ్మల్ని ఆ దాస్యంలోనే ఉండనియ్యలేదు. పర్షియా దేశపు రాజుల ముందు మా పట్ల దయ చూపించావు. మేము సేదదీరేలా మా దేవుని ఆలయం నిలబెట్టావు. యూదా దేశంలోని యెరూషలేము పట్టణంలో పాడైపోయిన స్థలాలను తిరిగి బాగుచేయడానికి, మాకు ఒక ఆశ్రయం కల్పించడానికి నీ కృప అనుగ్రహించావు.
Mert szolgák vagyunk és szolgaságunkban el nem hagyott minket a mi Istenünk s felénk fordította a kegyet Perzsia királyai előtt, adván nekünk föléledést, hogy felemeljük Istenünknek házát s föltámaszszuk a romjait, s adván nekünk védőfalat Jehúdában és Jeruzsálemben.
10 ౧౦ మా దేవా, ఇంత కనికరం పొందిన మేము ఇంకేం చెప్పగలం? నీ దాసులైన ప్రవక్తల ద్వారా నువ్వు మాకిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేకపోయాం.
És most mit mondjunk, Istenünk, ennekutána, mert elhagytuk a te parancsolataidat,
11 ౧౧ ప్రవక్తలు మాతో చెబుతూనే వచ్చారు-మీరు స్వతంత్రించుకోబోయే దేశం అక్కడి ప్రజల హేయ కృత్యాలతో, మలినకార్యాలతో అపవిత్రం అయిపోయింది. వారు చేసిన అసహ్యమైన పనులు దేశం నాలుగు దిక్కులకు వ్యాపించాయి.
a melyeket megparancsoltál a te szolgáid, a próféták által, mondván: az ország, a melybe értek, hogy elfoglaljátok, fertőzet országa az országok népeinek fertőzete által, utálatosságaik által, a melyekkel eltöltötték szinültig, az ő tisztátalanságukban.
12 ౧౨ అందువల్ల మీరు మీ కూతుళ్ళను వారి కొడుకులకు, వారి కూతుళ్ళను మీ కొడుకులకు ఇచ్చి పుచ్చుకోకండి. వాళ్లకు క్షేమం, సుఖ సౌఖ్యాలు కలగాలని ఎన్నడూ కోరుకోవద్దు. ఇలా చేసినట్టైతే మీరు స్థిరంగా నిలిచి, ఆ దేశ సుఖాలు అనుభవించి, మీ పిల్లలకు శాశ్వతంగా నిలిచి ఉండే వారసత్వం అప్పగిస్తారు.
Most tehát leányaitokat ne adjátok fiaiknak s leányaikat ne vegyétek el fiaitoknak s ne keressétek békéjüket és javukat sohasem, azért hogy megerősödjetek s egyétek az ország javát a örökségül hagyjátok fiaitoknak örökre.
13 ౧౩ మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మాపైకి వచ్చాయి. మా దేవుడవైన నువ్వు మా దోషాలకు రావలసిన శిక్షను తగ్గించి మాకు ఈ విధంగా విడుదల కలిగించావు.
És mindaz után, a mi reánk jött gonosz cselekedeteinkért s nagy bűnösségünkért, habár te, oh Istenünk, kimélettel voltál, bűneinken alul, s adtál nekünk ilyen menedéket:
14 ౧౪ అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు, తప్పించుకొనే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా.
vajon újra megszegjük-e a parancsolataidat s összeházasodjunk-e emez utálatok népeivel? Nemde haragudni fogsz reánk végpusztításig, mig nem lesz maradék és menedék?
15 ౧౫ యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”
Oh Örökkévaló, Izraél Istene, igazságos vagy, mert mi megmaradtunk menedékül, mint ez van e mai napon; íme itt vagyunk előtted bűnösségünkben, mert meg nem lehet állani teelőtted e miatt.