< ఎజ్రా 8 >

1 అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో బబులోను దేశం నుంచి నాతో కలసి వచ్చిన కుటుంబ నాయకుల వంశావళి ఇది.
アルタシャスタ王の治世に、バビロンからわたしと一緒に上って来た者の氏族の長、およびその系譜は次のとおりである。
2 ఫీనెహాసు వంశంనుంచి గెర్షోము. ఈతామారు వంశం నుంచి దానియేలు. దావీదు వంశం నుంచి హట్టూషు.
ピネハスの子孫のうちではゲルショム。イタマルの子孫のうちではダニエル。ダビデの子孫のうちではシカニヤの子ハットシ。
3 పరోషు వంశంలో ఉన్న షెకన్యా వంశంనుంచి జెకర్యా, అతనితో పాటు 150 మంది పురుషులు.
パロシの子孫のうちではゼカリヤおよび彼と共に系譜に載せられた男百五十人。
4 పహత్మోయాబు వంశంలో ఉన్న జెరహ్య కొడుకు ఎల్యోయేనై, అతనితో పాటు 200 మంది పురుషులు.
パハテ・モアブの子孫のうちではゼラヒヤの子エリヨエナイおよび彼と共にある男二百人。
5 షెకన్యా వంశంలో ఉన్న యహజీయేలు కొడుకు, అతనితో పాటు 300 మంది పురుషులు.
ザッツの子孫のうちではヤハジエルの子シカニヤおよび彼と共にある男三百人。
6 ఆదీను వంశంలో ఉన్న యోనాతాను కొడుకు ఎబెదు, అతనితో పాటు 50 మంది పురుషులు.
アデンの子孫のうちではヨナタンの子エベデおよび彼と共にある男五十人。
7 ఏలాము వంశంలో ఉన్న అతల్యా కొడుకు యెషయా, అతనితో పాటు 70 మంది పురుషులు.
エラムの子孫のうちではアタリヤの子エサヤおよび彼と共にある男七十人。
8 షెఫట్య వంశంలో ఉన్న మిఖాయేలు కొడుకు జెబద్యా, అతనితో పాటు 80 మంది పురుషులు.
シパテヤの子孫のうちではミカエルの子ゼバデヤおよび彼と共にある男八十人。
9 యోవాబు వంశంలో ఉన్న యెహీయేలు కొడుకు ఓబద్యా, అతనితో పాటు 218 మంది పురుషులు.
ヨアブの子孫のうちではエヒエルの子オバデヤおよび彼と共にある男二百十八人。
10 ౧౦ షెలోమీతు వంశంలో ఉన్న యోసిప్యా కొడుకు, అతనితో పాటు 160 మంది పురుషులు.
バニの子孫のうちではヨシピアの子シロミテおよび彼と共にある男百六十人。
11 ౧౧ బేబై వంశంలో ఉన్న బేబై కొడుకు జెకర్యా, అతనితో పాటు 28 మంది పురుషులు.
ベバイの子孫のうちではベバイの子ゼカリヤおよび彼と共にある男二十八人。
12 ౧౨ అజ్గాదు వంశంలో ఉన్న హక్కాటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు.
アズガデの子孫のうちではハッカタンの子ヨハナンおよび彼と共にある男百十人。
13 ౧౩ అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు.
アドニカムの子孫のうちでは後に来た者どもで、その名はエリペレテ、ユエル、シマヤおよび彼らと共にある男六十人。
14 ౧౪ బిగ్వయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు.
ビグワイの子孫のうちではウタイとザックルおよび彼らと共にある男七十人である。
15 ౧౫ నేను వీరందరినీ అహవా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడూ నాకు కనబడలేదు.
わたしは彼らをアハワに流れる川のほとりに集めて、そこに三日のあいだ露営した。わたしは民と祭司とを調べたが、そこにはレビの子孫はひとりもいなかったので、
16 ౧౬ అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లం అనే వారిని, ఉపదేశకులైన యోయారీబు ఎల్నాతాను అనే వారిని పిలిపించాను.
人をつかわしてエリエゼル、アリエル、シマヤ、エルナタン、ヤリブ、エルナタン、ナタン、ゼカリヤ、メシュラムという首長たる人々を招き、またヨヤリブ、およびエルナタンのような見識のある人々を招いた。
17 ౧౭ కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దో అనే అధికారి దగ్గరికి వారిని పంపించాను. మా దేవుని మందిరంలో సేవ చేసేందుకు పరిచారకులను మా దగ్గరికి తీసుకు వచ్చేలా కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దోతో, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను.
そしてわたしはカシピアという所の首長イドのもとに彼らをつかわし、カシピアという所にいるイドと、その兄弟である宮に仕えるしもべたちに告ぐべき言葉を、彼らに授け、われわれの神の宮のために、仕え人をわれわれに連れて来いと言った。
18 ౧౮ మన దేవుని కరుణా హస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ షేరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడైన మహలి కొడుకుల్లో ఒకడు.
われわれの神がよくわれわれを助けられたので、彼らはイスラエルの子、レビの子、マヘリの子孫のうちの思慮深い人、すなわちセレビヤおよびその子らとその兄弟たち十八人を、われわれに連れて来、
19 ౧౯ వారు హషబ్యాను, అతనితో మెరారీ వంశీయుడు యెషయాను అతని బంధువులను, వారి కొడుకులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు.
またハシャビヤおよび彼と共に、メラリの子孫のエサヤとその兄弟およびその子ら二十人、
20 ౨౦ లేవీయులు జరిగించే సేవలో సహాయం చేయడానికి దావీదు, అతని అధిపతులు నియమించిన దేవాలయ సేవకుల్లో 220 మంది వచ్చారు. వీరందరినీ వారి పేరుల ప్రకారం నియమించారు.
および宮に仕えるしもべ、すなわちダビデとそのつかさたちが、レビびとに仕えさせるために選んだ宮に仕えるしもべ二百二十人を連れてきた。これらの者は皆その名を言って記録された。
21 ౨౧ అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను.
そこでわたしは、かしこのアハワ川のほとりで断食を布告し、われわれの神の前で身をひくくし、われわれと、われわれの幼き者と、われわれのすべての貨財のために、正しい道を示されるように神に求めた。
22 ౨౨ ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది.
これは、われわれがさきに王に告げて、「われわれの神の手は、神を求めるすべての者の上にやさしく下り、その威力と怒りとはすべて神を捨てる者の上に下る」と言ったので、わたしは道中の敵に対して、われわれを守るべき歩兵と騎兵とを、王に頼むことを恥じたからである。
23 ౨౩ ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.
そこでわれわれは断食して、このことをわれわれの神に求めたところ、神はその願いを聞きいれられた。
24 ౨౪ నేను యాజకుల్లో ముఖ్యమైన 12 మందిని, షేరేబ్యా, హషబ్యా, వీరి బంధువుల్లో 10 మందిని సిద్ధం చేశాను.
わたしはおもだった祭司十二人すなわちセレビヤ、ハシャビヤおよびその兄弟十人を選び、
25 ౨౫ మన దేవుని ఆలయం నిలబెట్టడానికి దేశపు రాజు, అతని మంత్రులు, అధిపతులు, ఇంకా అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులంతా సమర్పించిన వెండి బంగారాలను, ఇతర సామగ్రిని బరువు తూచి వారికి అప్పగించాను.
金銀および器物、すなわち王と、その議官と、その諸侯およびすべて在留のイスラエルびとが、われわれの神の宮のためにささげた奉納物を量って彼らに渡した。
26 ౨౬ 1, 300 మణుగుల వెండి, 200 మణుగుల వెండి వస్తువులు, 200 మణుగుల బంగారం,
わたしが量って彼らの手に渡したものは、銀六百五十タラント、銀の器百タラント、金百タラントであった。
27 ౨౭ 7,000 తులాల బరువున్న 20 బంగారపు గిన్నెలు, బంగారమంత ఖరీదైన పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలు లెక్కబెట్టి
また金の大杯が二十あって、一千ダリクに当る。また光り輝く青銅の器二個あって、その尊いこと金のようである。
28 ౨౮ వారికి అప్పగించి “మీరు యెహోవాకు ప్రతిష్ట అయినవారు, పాత్రలు కూడా ప్రతిష్ట అయినాయి. ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా కోసం ఇచ్చిన అర్పణలు.
そしてわたしは彼らに言った、「あなたがたは主に聖別された者である。この器物も聖である。またこの金銀は、あなたがたの先祖の神、主にささげた真心よりの供え物である。
29 ౨౯ కాబట్టి మీరు యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం ఖజానా గదుల్లో యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలు పెద్దల, ప్రధానుల సమక్షంలో వాటి బరువు తూచి లెక్క అప్పగించేదాకా వీటిని జాగ్రత్తగా ఉంచండి” అని వారితో చెప్పాను.
あなたがたはエルサレムで、主の宮のへやの中で、祭司長、レビびとおよびイスラエルの氏族のかしらたちの前で、これを量るまで、見張り、かつ守りなさい」。
30 ౩౦ యాజకులు, లేవీయులు వాటి లెక్క, బరువు సరిచూసుకుని, యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరానికి తీసుకు వెళ్ళడానికి ఆ వెండి బంగారు పాత్రలను, ఇతర సామగ్రిని తీసుకున్నారు.
そこで祭司およびレビびとたちは、その金銀および器物を、エルサレムにあるわれわれの神の宮に携えて行くため、その重さのものを受け取った。
31 ౩౧ మేము మొదటి నెల 12 వ రోజుకు యెరూషలేము చేరుకోవాలని అహవా నది దగ్గర నుండి బయలుదేరాం. మా దేవుని హస్తం మాకు కావలిగా ఉండి, శత్రువుల బారి నుండి, దారిలో కాపు కాసి ఉన్నవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందువల్ల
われわれは正月の十二日に、アハワ川を出立してエルサレムに向かったが、われわれの神の手は、われわれの上にあって、敵の手および道に待ち伏せする者の手から、われわれを救われた。
32 ౩౨ మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడ బస చేశాం.
われわれはエルサレムに着いて、三日そこにいたが、
33 ౩౩ నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.
四日目にわれわれの神の宮の内で、その金銀および器物を、ウリヤの子祭司メレモテの手に量って渡した。ピネハスの子エレアザルが彼と共にいた。またエシュアの子ヨザバデ、およびビンヌイの子ノアデヤのふたりのレビびとも、彼らと共にいた。
34 ౩౪ తీసుకువచ్చిన సామగ్రి లెక్క ప్రకారం, బరువు ప్రకారం అన్నిటినీ సరిచూసి వాటి మొత్తం బరువు ఎంతో పుస్తకంలో రాశారు.
すなわちそのすべての数と重さとを調べ、その重さは皆書きとめられた。
35 ౩౫ చెరలోకి వెళ్ళిన వారికి పుట్టి చెర నుండి విడుదలై, తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్ళను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించారు.
そのとき捕囚の人々で捕囚から帰って来た者は、イスラエルの神に燔祭をささげた。すなわちイスラエル全体のために雄牛十二頭、雄羊九十六頭、小羊七十七頭をささげ、また罪祭として雄やぎ十二頭をささげた。これらはみな、主にささげた燔祭である。
36 ౩౬ చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్న దస్తావేజులను నది ఇవతల ఉన్న రాజు సేనాధిపతులకు, అధికారులకు అప్పగించారు. అప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ఆలయం పనికి సహాయం చేశారు.
彼らはまた王の命令書を、王の総督たち、および川向こうの州の知事たちに渡したので、彼らは民と神の宮とを援助した。

< ఎజ్రా 8 >