< ఎజ్రా 7 >
1 ౧ ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తహషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇతడు శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు.
이 일 후 바사 왕 아닥사스다가 위에 있을 때에 에스라라 하는 자가 있으니라 저는 스라야의 아들이요, 아사랴의 손자요, 힐기야의 증손이요
2 ౨ హిల్కీయా షల్లూము కొడుకు, షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహీటూబు కొడుకు,
살룸의 현손이요, 사독의 오대손이요, 아히둡의 육대손이요,
3 ౩ అహీటూబు అమర్యా కొడుకు, అమర్యా అజర్యా కొడుకు, అజర్యా మెరాయోతు కొడుకు,
아마랴의 칠대손이요, 아사랴의 팔대손이요, 므라욧의 구대손이요,
4 ౪ మెరాయోతు జెరహ్యా కొడుకు, జెరహ్యా ఉజ్జీ కొడుకు, ఉజ్జీ బుక్కీ కొడుకు,
스라히야의 십대손이요, 웃시엘의 십 일대손이요, 북기의 십 이대손이요,
5 ౫ బుక్కీ అబీషూవ కొడుకు, అబీషూవ ఫీనెహాసు కొడుకు, ఫీనెహాసు ఎలియాజరు కొడుకు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను కొడుకు.
아비수아의 십 삼대손이요, 비느하스의 십 사대손이요, 엘르아살의 십 오대손이요, 대제사장 아론의 십 륙대손이라
6 ౬ ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న లేఖికుడు. దేవుడైన యెహోవా కాపుదల అతనిపై ఉండడం వల్ల అతడు ఏమి కోరినా రాజు అతని మనవులు అంగీకరించాడు.
이 에스라가 바벨론에서 올라왔으니 저는 이스라엘 하나님 여호와께서 주신 바 모세의 율법에 익숙한 학사로서 그 하나님 여호와의 도우심을 입으므로 왕에게 구하는 것은 다 받는 자더니
7 ౭ రాజైన అర్తహషస్త పాలన ఏడో సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, దేవాలయ సేవకులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు.
아닥사스다 왕 칠년에 이스라엘 자손과 제사장들과 레위 사람들과 노래하는 자들과 문지기들과 느디님 사람들 중에 몇사람이 예루살렘으로 올라올 때에
8 ౮ రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు.
이 에스라가 올라왔으니 왕의 칠년 오월이라
9 ౯ అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను దేశం నుండి బయలుదేరి, తన దేవుని కాపుదలతో ఐదో నెల మొదటి రోజుకు యెరూషలేము చేరుకున్నాడు.
정월 초하루에 바벨론에서 길을 떠났고 하나님의 선한 손의 도우심을 입어 오월 초하루에 예루살렘에 이르니라
10 ౧౦ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు.
에스라가 여호와의 율법을 연구하여 준행하며 율례와 규례를 이스라엘에게 가르치기로 결심하였었더라
11 ౧౧ యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల, చట్టాల విషయంలో లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం నకలు.
여호와의 계명의 말씀과 이스라엘에게 주신 율례의 학사인 학사겸 제사장 에스라에게 아닥사스다 왕이 내린 조서 초본은 아래와 같으니라
12 ౧౨ “రాజైన అర్తహషస్త రాస్తున్నది, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమం కలుగు గాక.
모든 왕의 왕 아닥사스다는 하늘의 하나님의 율법에 완전한 학사겸 제사장 에스라에게
13 ౧౩ నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు, ఏడుగురు మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం.
조서하노니 우리 나라에 있는 이스라엘 백성과 저희 제사장들과 레위 사람들 중에 예루살렘으로 올라갈 뜻이 있는 자는 누구든지 너와 함께 갈지어다
14 ౧౪ మా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల్లోని యాజకులు, లేవీయుల్లో ఎవరైతే యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళంతా నీతో కలసి వెళ్లవచ్చు.
너는 네 손에 있는 네 하나님의 율법을 좇아 유다와 예루살렘의 정형을 살피기 위하여 왕과 일곱 모사의 보냄을 받았으니
15 ౧౫ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు, అతని మంత్రులు ఇష్టపూర్వకంగా సమర్పించిన వెండి బంగారాలను నీ వెంట తీసుకు వెళ్ళాలి.
왕과 모사들이 예루살렘에 거하신 이스라엘 하나님께 성심으로 드리는 은금을 가져가고
16 ౧౬ ఇంకా బబులోను రాజ్యమంతటా నీకు దొరికే వెండి బంగారంతో పాటు ప్రజలు, యాజకులు యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వచ్ఛందంగా సమర్పించే వస్తువులను కూడా నువ్వు తీసుకు వెళ్ళాలి.
또 네가 바벨론 온 도에서 얻을 모든 은금과 및 백성과 제사장들이 예루살렘 그 하나님의 전을 위하여 즐거이 드릴 예물을 가져다가
17 ౧౭ ఆలస్యం చేయకుండా నువ్వు ఆ సొమ్ముతో ఎద్దులను, పొట్లేళ్లను, గొర్రె పిల్లలను, వాటికి చెందిన నైవేద్యాలను, పానార్పణలను కొనుగోలు చేసి యెరూషలేములో ఉన్న మీ దేవుని మందిరంలో బలిపీఠం మీద వాటిని అర్పించు.
그 돈으로 수송아지와 수양과 어린 양과 그 소제와 그 전제의 물품을 신속히 사서 예루살렘 네 하나님의 전 단 위에 드리고
18 ౧౮ మిగిలిన వెండి బంగారాలతో మీ దేవుని చిత్తానుసారం నీకూ, మీవారికీ సముచితంగా అనిపించిన దాన్ని చేయవచ్చు.
그 나머지 은금은 너와 너의 형제가 선히 여기는 일에 너희 하나님의 뜻을 좇아 쓸지며
19 ౧౯ మీ దేవుని మందిరం సేవ కోసం నీకు ఇచ్చిన వస్తువులన్నిటినీ యెరూషలేములోని దేవుని సన్నిధిలో అప్పగించాలి.
네 하나님의 전에서 섬기는 일을 위하여 네게 준 기명은 예루살렘 하나님 앞에 드리고
20 ౨౦ మీ దేవుని మందిర విషయంలో మీకు అవసరమైనవి ఇంకా ఏవైనా కావలసివస్తే వాటిని రాజు ధనాగారం నుండి నువ్వు పొందవచ్చు.”
그 외에도 네 하나님의 전에 쓰일 것이 있어서 네가 드리고자 하거든 무엇이든지 왕의 내탕고에서 취하여 드릴지니라
21 ౨౧ అంతే గాక అతడు “రాజునైన అర్తహషస్త అనే నేను స్వయంగా నది అవతల ఖజానా అధికారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రం లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మీరు వాటిని అతనికి అందజేయండి.
나 곧 나 아닥사스다 왕이 강 서편 모든 고지기에게 조서를 내려 이르기를 하늘의 하나님의 율법의 학사겸 제사장 에스라가 무릇 너희에게 구하는 것은 신속히 시행하되
22 ౨౨ మూడున్నర టన్నుల వెండి, వెయ్యి తూముల గోదుమలు రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షారసం, మూడు వందల తూముల నూనె, ఇంకా అవసరమైన దాని కంటే మించి ఉప్పు ఇవ్వండి.
은은 일백 달란트까지 밀은 일백 고르까지, 포도주는 일백 밧까지, 기름도 일백 밧까지 하고 소금은 정수 없이 하라
23 ౨౩ ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి?
무릇 하늘의 하나님의 전을 위하여 하늘의 하나님의 명하신 것은 삼가 행하라! 어찌하여 진노가 왕과 왕자의 나라에 임하게 하랴
24 ౨౪ యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ పరిచారకులు, దేవుని మందిరంలో పనిచేసేవారి విషయంలో మా నిర్ణయం ఏమిటంటే, వారిపై శిస్తు గానీ, సుంకం గానీ, పన్ను గానీ విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
내가 너희에게 이르노니 제사장들이나 레위 사람들이나 노래하는 자들이나 문지기들이나 느디님 사람들이나 혹 하나님의 전에서 일하는 자들에게 조공과 잡세와 부세를 받는 것이 불가하니라 하였노라
25 ౨౫ ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.
에스라여! 너는 네 손에 있는 네 하나님의 지혜를 따라 네 하나님의 율법을 아는 자로 유사와 재판관을 삼아 강 서편 모든 백성을 재판하게 하고 그 알지 못하는 자는 너희가 가르치라
26 ౨౬ మీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు నియమించిన చట్టాలను గైకొనని వారిపై త్వరగా విచారణ జరిపి, వారికి మరణశిక్షగానీ, దేశ బహిష్కరణగానీ, వారి ఆస్తులను జప్తు చేయడం గానీ, చెరసాల గానీ విధించాలి.”
무릇 네 하나님의 명령과 왕의 명령을 준행치 아니하는 자는 속히 그 죄를 정하여 혹 죽이거나 정배하거나 가산을 적몰하거나 옥에 가둘지니라 하였더라
27 ౨౭ యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగు గాక. రాజు, అతని మంత్రులు, ఆస్థాన అధిపతులు నాపై దయ చూపేలా దేవుడు అనుగ్రహించాడు.
우리 열조의 하나님 여호와를 송축할지로다! 그가 왕의 마음에 예루살렘 여호와의 전을 아름답게 할 뜻을 두시고
28 ౨౮ నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను.
또 나로 왕과 그 모사들의 앞과 왕의 권세 있는 모든 방백의 앞에서 은혜를 얻게 하셨도다 나의 하나님 여호와의 손이 나의 위에 있으므로 내가 힘을 얻어 이스라엘 중에 두목을 모아 나와 함께 올라오게 하였노라