< ఎజ్రా 4 >

1 అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా, బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది.
А кад чуше непријатељи Јудини и Венијаминови да они који се вратише из ропства зидају цркву Господу Богу Израиљевом,
2 వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
Дођоше к Зоровавељу и ка главарима домова отачких, и рекоше им: Да и ми зидамо с вама, јер ћемо као и ви тражити Бога вашег, и Њему приносимо жртве од времена Есарадона, цара асирског, који нас је довео овамо.
3 అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరెషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం” అని వారితో చెప్పారు.
А Зоровавељ и Исус и остали главари домова отачких у Израиљу рекоше им: Не можете ви с нама зидати дом Богу нашем, него ћемо ми сами зидати Господу Богу Израиљевом, како нам је заповедио Кир, цар персијски.
4 ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు.
Тада народ земаљски досађиваше народу Јудином и сметаше их у зидању;
5 అంతేకాక, పర్షియా దేశపు రాజు కోరెషు కాలమంతటిలో, పర్షియా రాజు దర్యావేషు పాలనా కాలం వరకూ ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు.
И наимаху саветнике супрот њима да расипају намеру њихову свега времена Кира, цара персијског, до владе Дарија, цара персијског.
6 ఇంకా అహష్వేరోషు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా, యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు.
А кад се зацари Асвир, у почетку његовог царовања написаше тужбу на становнике јудејске и јерусалимске.
7 పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు.
И за времена Артаксерксовог писа Вислам, Митредат, Тавеило и остали другови његови Артаксерксу цару персијском; а књига беше писана сирским писмом и сирским језиком.
8 నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు.
Реум старешина у већу и Симсај писар написаше једну књигу против Јерусалима цару Артаксерксу овако:
9 “నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ
Реум старешина у већу и Симсај писар и остали другови њихови, Дињани, Афарсашани, Тарфаљани, Афаршани, Архевљани, Вавилоњани, Сусанашани, Деављани, Еламљани,
10 ౧౦ గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”
И остали народ који пресели велики и славни Асенафар и насели по градовима самаријским, и остали с ове стране реке, тада и тада.
11 ౧౧ వీరంతా అర్తహషస్త రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. “నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే,
Ово је препис од књиге коју му послаше: Цару Артаксерксу. Слуге твоје, људи с ове стране реке, тада и тада.
12 ౧౨ మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు.
Да је на знање цару да Јудејци који пођоше од тебе к нама, дођоше у Јерусалим, и град одметнички и опаки зидају, зидове оправљају и из темеља подижу.
13 ౧౩ కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి, పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగానీ, సుంకంగానీ, పన్నుగానీ మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది.
Него да је на знање цару: ако се овај град сазида и зидови оправе, они неће давати данка ни порезе ни царине, те ће бити штета ризници царској.
14 ౧౪ మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియచేస్తున్నాం.
Што дакле плату од двора примамо, те нам не приличи да гледамо штету цареву, тога ради шаљемо и јављамо цару,
15 ౧౫ తమ పూర్వికులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే, ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు, దేశాలకు కీడు తలపెట్టేవారనీ, కలహాలు రేపేవారనీ, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయిందనీ మీకు తెలుస్తుంది.
Да се потражи у књизи дневника отаца твојих, па ћеш наћи у књизи дневника и дознати да је овај град одметнички и да је на штету царевима и земљама и да су се у њему дизале буне од давнина, те зато би раскопан овај град.
16 ౧౬ కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.”
Дајемо на знање цару: ако се овај град сазида и зидови се његови оправе, онда овај део преко реке неће више бити твој.
17 ౧౭ అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. “మంత్రి రెహూముకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించేవారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది ఆవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగు గాక.
Тада цар посла одговор Реуму, старешини у већу и Симсају писару и осталим друговима њиховим који сеђаху у Самарији и осталим с оне стране реке: Поздравље, тада и тада.
18 ౧౮ మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకొన్నాం.
Књига коју нам посласте разговетно би прочитана преда мном.
19 ౧౯ దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వం నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి, కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసే వారని మాకు నిర్ధారణ అయింది.
И заповедих те потражише и нађоше да је тај град од давнина устајао на цареве и да су у њему бивали одмети и буне,
20 ౨౦ గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు.
И да су силни цареви бивали у Јерусалиму, који владаху свим што је преко реке, и даваху им се данци и порезе и царине.
21 ౨౧ కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకూ వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి.
Зато наредите да се забрани оним људима да се онај град не зида докле ја не заповедим.
22 ౨౨ పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి.”
И пазите да не погрешите у том. Јер зашто би зло расло на штету царевима?
23 ౨౩ రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరంలోని వివరాలు రెహూముకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా, అధికార పూర్వకంగా పని ఆపించారు.
А кад се препис од књиге цара Артаксеркса прочита пред Реумом и Симсајем писарем и пред друговима њиховим, они брже отидоше у Јерусалим к Јудејцима, те им забранише оружаном силом.
24 ౨౪ కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.
Тада стаде посао око дома Божијег у Јерусалиму, и стаја до друге године царовања Дарија, цара персијског.

< ఎజ్రా 4 >