< ఎజ్రా 4 >
1 ౧ అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా, బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది.
The enemies of the people of [the tribes of] Judah and Benjamin heard that the [Israeli] people who had returned from Babylonia were rebuilding a temple for Yahweh, the God whom the Israeli people [worshiped].
2 ౨ వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
So they went to Zerubbabel [the governor] and the other leaders, and said [deceptively], “We want to help [you build the temple], because we worship that same God whom you worship, and we have been offering sacrifices to him since Esarhaddon, the King of Assyria, brought us here.”
3 ౩ అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరెషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం” అని వారితో చెప్పారు.
But Zerubbabel, Jeshua, and the other [Israeli] leaders replied, “We will not allow you to help us build a temple for our(exc) God. We will build it (ourselves/without your help) for Yahweh, the God whom we Israelis worship, like Cyrus, the King of Persia, told us to do.”
4 ౪ ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు.
Then the people who had been living in that land [before the Israelis returned] tried to cause the Jews to become discouraged and become afraid, and to cause them to stop building the temple.
5 ౫ అంతేకాక, పర్షియా దేశపు రాజు కోరెషు కాలమంతటిలో, పర్షియా రాజు దర్యావేషు పాలనా కాలం వరకూ ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు.
They bribed government officials to oppose what the Israelis were doing [and prevent them from continuing to work on the temple]. They did that all during the time that Cyrus was King of Persia. They continued to do it when Darius became the King of Persia.
6 ౬ ఇంకా అహష్వేరోషు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా, యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు.
During the first year that [Darius’ son] Xerxes was king, the [enemies of the Jews] wrote a note [to the king] saying that the Jews [were planning to rebel against the government].
7 ౭ పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు.
Later, when [Xerxes’ son] Artaxerxes [became the King of Persia], Bishlam, Mithredath, Tabeel and their colleagues/companions wrote a letter to him. They wrote the letter in the Aramaic language, and it was translated [into another language that the king knew].
8 ౮ నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు.
Rehum, the high commissioner, and Shimshai, the provincial secretary, wrote the letter to King Artaxerxes concerning what was happening in Jerusalem.
9 ౯ “నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ
They stated that the letter was from Rehum the high commissioner/governor and Shimshai the provincial secretary and from their associates, the judges, and other government officials, who were from Erech [city], Babylon [city], and Susa [city] in Elam [district].
10 ౧౦ గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”
[They also wrote that they represented] the other people-groups whom [the army of] the great and glorious/famous [King] Ashurbanipal had (deported/forced to move from their homes) and taken to live in Samaria and in other cities in the province west of the Euphrates [River].
11 ౧౧ వీరంతా అర్తహషస్త రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. “నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే,
This is what they wrote in the letter: “To King Artaxerxes, From the officials who serve you who live in the province west of the Euphrates [River.]
12 ౧౨ మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు.
“Your majesty, we want you to know that the Jews who came here from your territories are rebuilding this city, [Jerusalem]. These people are wicked and want to rebel against you. Now they are repairing the foundations [of the walls/buildings] and building the walls [of the city].
13 ౧౩ కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి, పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగానీ, సుంకంగానీ, పన్నుగానీ మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది.
“It is important for you to know that if they rebuild the city and finish building the walls, they will stop paying any kind of taxes. As a result, there will be less money in your treasury.
14 ౧౪ మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియచేస్తున్నాం.
Now, because we are loyal to [IDM] you, and because we do not want you to be humiliated [IDM], we are sending this information to you.
15 ౧౫ తమ పూర్వికులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే, ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు, దేశాలకు కీడు తలపెట్టేవారనీ, కలహాలు రేపేవారనీ, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయిందనీ మీకు తెలుస్తుంది.
And, we suggest that you order/tell [your officials] to search the records that your ancestors made/wrote. [If you do that], you will find out that the people in this city have always rebelled [against the government]. You will also find out that from long ago these people have caused trouble for kings and for rulers of provinces. They have always revolted [against those who ruled them]. That is the reason that this city was destroyed [by the Babylonian army].
16 ౧౬ కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.”
We want you to know that if they rebuild this city and finish building its walls, you will no longer be able to control/rule [the people in] this province west of the Euphrates [River].”
17 ౧౭ అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. “మంత్రి రెహూముకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించేవారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది ఆవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగు గాక.
[After] the king [read this letter, he] sent this reply to them: “To Rehum, the high commissioner, and Shimshai, the provincial secretary, and their colleagues in Samaria and in other parts of the province that is west of the [Euphrates] River: I (send you my greetings/wish that things will go well for you).
18 ౧౮ మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకొన్నాం.
The letter that you sent to me was translated and read to me.
19 ౧౯ దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వం నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి, కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసే వారని మాకు నిర్ధారణ అయింది.
So then I ordered [my officials] to search the records. I have found out that [it is true that] the people of that city have always revolted against their rulers, and that the city is full of people who have rebelled and caused trouble.
20 ౨౦ గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు.
Powerful kings have ruled in Jerusalem, and they have also ruled over the whole province west of the [Euphrates] River. [The people in that province were] paying all kinds of taxes to those kings.
21 ౨౧ కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకూ వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి.
So you must command that the people must stop rebuilding the city. Only if I tell them [that they may rebuild it] will they be allowed to continue.
22 ౨౨ పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి.”
Do this immediately [LIT], because I do not want those people to do anything to harm the things/area about which I am concerned.”
23 ౨౩ రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరంలోని వివరాలు రెహూముకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా, అధికార పూర్వకంగా పని ఆపించారు.
[Messengers took] that letter to Rehum and Shimshai and their colleagues and read it to them. Then Rehum and the others went quickly to Jerusalem, and they forced the Jews to stop [rebuilding the city wall].
24 ౨౪ కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.
The result was that the Jews stopped rebuilding the temple. They did not do any more work to rebuild the temple until Darius became the King of Persia.