< ఎజ్రా 1 >
1 ౧ యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు.
In the first year of Cyrus, king of Persia, Yahweh fulfilled his word that came from the mouth of Jeremiah, and stirred Cyrus's spirit. Cyrus' voice went out over his entire kingdom. This is what was written and spoken:
2 ౨ “పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
“Cyrus, king of Persia, says: Yahweh, God of Heaven, gave me all the kingdoms of the earth, and he appointed me to build for him a house in Jerusalem in Judea.
3 ౩ మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి.
Whoever is from his people (may his God be with him) may go up to Jerusalem and build a house for Yahweh, the God of Israel, the God who is in Jerusalem.
4 ౪ యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.”
People of any part of the kingdom where survivors of that land are living should provide them with silver and gold, possessions and animals, as well as a freewill offering for God's house in Jerusalem.”
5 ౫ అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు.
Then the heads of the ancestors' clans of Judah and Benjamin, the priests and Levites, and everyone whose spirit God stirred to go and build his house arose.
6 ౬ మిగిలి ఉన్న ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కాకుండా, వెండి వస్తువులు, బంగారం, పశువులు, విలువైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు.
Those around them supported their work with silver and gold objects, possessions, animals, valuables, and freewill offerings.
7 ౭ ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు.
Cyrus king of Persia also released the objects belonging to Yahweh's house that Nebuchadnezzar had brought from Jerusalem and put in his own gods' houses.
8 ౮ కోరెషు రాజు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి, వాటిని యూదుల అధిపతి షేష్బజ్జరు చేతికి అప్పగించాడు.
Cyrus put them into the hand of Mithredath the treasurer, who counted them out for Sheshbazzar, Judea's leader.
9 ౯ వాటి మొత్తం లెక్క 30 బంగారం పళ్ళాలు, 1,000 వెండి పళ్ళాలు, 29 కత్తులు,
This was their number: thirty gold basins, one thousand silver basins, twenty-nine other basins,
10 ౧౦ 30 బంగారం గిన్నెలు, 410 చిన్న వెండి గిన్నెలు, ఇంకా 1,000 వేరే రకం వస్తువులు.
thirty gold bowls, 410 small silver bowls, and one thousand additional objects.
11 ౧౧ బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5, 400. ఈ మొత్తం వస్తువులతోపాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని షేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు.
There were 5,400 gold and silver items in all. Sheshbazzar brought all of them when the exiles went from Babylon to Jerusalem.