< యెహెజ్కేలు 9 >
1 ౧ నేను వింటుండగా దేవుడు పెద్ద స్వరంతో ఇలా ప్రకటించాడు. “పట్టణాన్ని కాపలా కాసే వాళ్ళంతా ఇక్కడికి రండి. ప్రతి ఒక్కడూ నిర్మూలం చేసే తన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని రావాలి”
Un Viņš sauca priekš manām ausīm ar stipru balsi un sacīja: lai nāk tuvu tie pilsētas piemeklētāji, un ikviens ar saviem kaujamiem ieročiem rokā.
2 ౨ ఇదిగో చూడండి! ఉత్తరం వైపున ఉన్న ముఖద్వారం నుండి ఉన్న దారిలో ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సంహారం చేసే ఆయుధం ఉంది. వారి మధ్యలో నారతో నేసిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని నడుముకి లేఖకుడి వ్రాత సామాను ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఇత్తడి బలిపీఠం దగ్గర నిలబడ్డారు.
Un redzi, seši vīri nāca no augšvārtu ceļa, kas pret ziemeli, ikviens savu kaujamo ieroci rokā. Bet viens vīrs bija viņu vidū, audeklī ģērbies, un rakstāmās lietas pie gurniem. Un tie nāca iekšā un nostājās vara altārim sānis.
3 ౩ ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.
Un Israēla Dieva godība aizcēlās no tā ķeruba, virs kā tā bija, pie nama sliekšņa, un sauca tam vīram, kas ģērbies audeklī, kam tās rakstāmās lietas bija pie gurniem.
4 ౪ యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు.”
Un Tas Kungs uz viņu sacīja: ej pa pilsētu cauri, pa Jeruzālemi cauri, un apzīmē ar zīmi pie pierēm tos ļaudis, kas nopūšas un vaid par visām šīm negantībām, kas viņu starpā top darītas.
5 ౫ అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. “మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.
Bet uz tiem citiem Viņš sacīja priekš manām ausīm: ejat pa pilsētu viņam pakaļ un kaujiet jūsu acs lai nežēlo, un nesaudzējiet.
6 ౬ ముసలి వాళ్ళైనా, యువకులైనా, కన్యలైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైనా అందరినీ చంపండి! కానీ నుదుటిపై గుర్తు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. నా మందిరం దగ్గరనుండే ప్రారంభం చేయండి.” కాబట్టి వాళ్ళు మందిరం ఎదుట ఉన్న పెద్దవాళ్ళతో మొదలు పెట్టారు.
Nokaujiet sirmgalvjus, jaunekļus un jaunietes un bērnus un sievas, kamēr jūs tos izdeldējat. Bet neaizskariet nevienu no tiem, pie kā tā zīme ir. Un iesāciet no manas svētās vietas. Un tie iesāka pie tiem vecajiem, kas tā nama priekšā bija.
7 ౭ ఆయన ఇంకా ఇలా అన్నాడు. “మందిరాన్ని అపవిత్రం చేయండి. దాని ఆవరణాలను శవాలతో నింపండి. మొదలు పెట్టండి.” వాళ్ళు వెళ్ళి పట్టణంపై దాడి చేసి చంపడం ప్రారంభించారు.
Un Viņš uz tiem sacīja: sagāniet to namu un piepildiet tos pagalmus ar nokautiem; izejiet! Un tie izgāja un sita to pilsētu.
8 ౮ వాళ్ళు చంపడం మొదలు పెట్టిన తరువాత నన్ను తప్ప వాళ్ళు అందరినీ చంపడం చూశాను. నేను ఒంటరిగా ఉండటం చూసి నేను సాష్టాంగ పడ్డాను. గట్టిగా వేడుకున్నాను. “అయ్యో! ప్రభూ! యెహోవా, యెరూషలేముపై నీ క్రోధాన్ని కుమ్మరించి ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేస్తావా?” అన్నాను.
Un notikās, kad tie tos sita un es atliku, tad es kritu uz savu vaigu un brēcu un sacīju: ak Kungs, Dievs! Vai Tu visus atlikušos iekš Israēla gribi izdeldēt, izgāzdams Savu bardzību pār Jeruzālemi?
9 ౯ ఆయన నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.
Tad Viņš uz mani sacīja: Israēla un Jūda nama noziegums ir ļoti varen liels, un zeme ir ar asinīm piepildīta, un pilsēta ir netaisnības pilna; jo tie saka: Tas Kungs zemi atstājis, un Tas Kungs neredz.
10 ౧౦ కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.”
Tad ir Mana acs nežēlos, un Es nesaudzēšu, Es metīšu viņu grēkus uz viņu galvu.
11 ౧౧ అప్పుడు నార బట్టలు వేసుకుని లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తి వచ్చాడు. అతడు “నీ ఆదేశాల ప్రకారం నేను అంతా చేశాను” అని చెప్పాడు.
Un redzi, tas vīrs, kas ģērbies audeklī, kam tās rakstāmās lietas bija pie gurniem, atnesa vēsti atpakaļ un sacīja: es esmu darījis, kā Tu man pavēlējis.