< యెహెజ్కేలు 8 >
1 ౧ బబులోను చెరలో ఉన్న కాలంలో, ఆరో సంవత్సరం ఆరో నెల ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదా ప్రజల్లో పెద్దలు నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువైన యెహోవా హస్తం నా పైకి వచ్చింది.
제육년 유월 오일에 나는 집에 앉았고 유다 장로들은 내 앞에 앉았는데 주 여호와의 권능이 거기서 내게 임하기로
2 ౨ నేను చూసినప్పుడు అదిగో చూడండి! నాకు ఒక మానవాకారం కనిపించింది. అది నడుము నుండి కిందకు అగ్నిలాగా ఉంది. నడుము నుండి పైకి తేజస్సుతో ప్రకాశిస్తున్న కంచులా నాకు కనిపించింది.
내가 보니 불 같은 형상이 있어 그 허리 이하 모양은 불 같고 허리 이상은 광채가 나서 단 쇠 같은데
3 ౩ ఆయన నావైపు చెయ్యి వంటిదాన్ని చాపాడు. నా తలపై జుట్టును ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నన్ను లేపి భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తాడు. అప్పుడు నాకు కలిగిన దేవుని దర్శనంలో ఆయన యెరూషలేముకు ఉత్తరాన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర తీవ్రమైన రోషాన్ని కలిగించే విగ్రహం ఉన్న చోటికి నన్ను తెచ్చాడు.
그가 손 같은 것을 펴서 내 머리털 한 모숨을 잡으며 주의 신이 나를 들어 천지 사이로 올리시고 하나님의 이상 가운데 나를 이끌어 예루살렘으로 가서 안뜰로 들어가는 북향한 문에 이르시니 거기는 투기의 우상 곧 투기를 격발케 하는 우상의 자리가 있는 곳이라
4 ౪ ఇంతకుముందు నేను మైదానప్రాంతంలో చూసిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు అక్కడ నాకు కనిపించింది.
이스라엘 하나님의 영광이 거기 있는데 내가 들에서 보던 이상과 같더라
5 ౫ అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, ఉత్తరం వైపుకి శ్రద్ధగా చూడు.” ద్వారానికి ఉత్తరం వైపు దారి బలిపీఠానికి దారి తీస్తుంది. అక్కడే రోషం కలిగించే విగ్రహం ఉంది. నేను ఆ వైపుకి తదేకంగా చూశాను. నాకు ఆ విగ్రహం కనిపించింది.
그가 내게 이르시되 인자야 이제 너는 눈을 들어 북편을 바라보라 하시기로 내가 눈을 들어 북편을 바라보니 제단문 어귀 북편에 그 투기의 우상이 있더라
6 ౬ అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, వాళ్ళేం చేస్తున్నారో చూస్తున్నావా? నా సొంత మందిరం నుండి నేను వెళ్ళిపోవడానికి కారణమైన నీచమైన పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు! నువ్వు పక్కకి తిరిగి చూస్తే వీటి కంటే అసహ్యమైన పనులు వీరు చేయడం చూస్తావు.”
그가 또 내게 이르시되 인자야 이스라엘 족속의 행하는 일을 보느냐 그들이 여기서 크게 가증한 일을 행하여 나로 내 성소를 멀리 떠나게 하느니라 너는 다시 다른 큰 가증한 일을 보리라 하시더라
7 ౭ ఆ తరువాత ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గర దించాడు. అక్కడ గోడకి ఒక రంధ్రం కనిపించింది.
그가 나를 이끌고 뜰 문에 이르시기로 내가 본즉 담에 구멍이 있더라
8 ౮ ఆయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఆ గోడ తవ్వు.” అప్పుడు నేను ఆ గోడ తవ్వాను. తవ్విన చోట ఒక ద్వారం కనిపించింది.
그가 내게 이르시되 인자야 너는 이 담을 헐라 하시기로 내가 그 담을 허니 한 문이 있더라
9 ౯ ఆయన తిరిగి నాతో “నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో చూడు” అన్నాడు.
또 내게 이르시되 들어가서 그들이 거기서 행하는 가증하고 악한 일을 보라 하시기로
10 ౧౦ కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ పాకే ప్రతి జంతువూ, అసహ్యమైన మృగాలూ ఉన్నాయి. ఆ గోడపైన ఇశ్రాయేలు జాతి దేవుళ్ళ విగ్రహాలన్నీ చెక్కి ఉన్నాయి.
내가 들어가 보니 각양 곤충과 가증한 짐승과 이스라엘 족속의 모든 우상을 그 사면 벽에 그렸고
11 ౧౧ ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది.
이스라엘 족속의 장로 중 칠십 인이 그 앞에 섰으며 사반의 아들 야아사냐도 그 가운데 섰고 각기 손에 향로를 들었는데 향연이 구름 같이 오르더라
12 ౧౨ అప్పుడాయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు చీకట్లో ఏం చేస్తున్నారో చూశావా? ప్రతి ఒక్కడూ తన తన రహస్య గదుల్లో తన విగ్రహాలకు ఇలాగే చేస్తున్నాడు. ‘యెహోవా మమ్మల్ని చూడ్డం లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు’ అని చెప్పుకుంటున్నారు.”
또 내게 이르시되 인자야 이스라엘 족속의 장로들이 각각 그 우상의 방안 어두운 가운데서 행하는 것을 네가 보았느냐 그들이 이르기를 여호와께서 우리를 보지 아니하시며 이 땅을 버리셨다 하느니라
13 ౧౩ తరువాత ఆయన “నువ్వు ఈ వైపుకి తిరిగి చూడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు” అన్నాడు.
또 내게 이르시되 너는 다시 그들의 행하는 바 다른 큰 가증한 일을 보리라 하시더라
14 ౧౪ ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరానికి ఉత్తరం వైపున ఉన్న ద్వారం దగ్గర నన్ను దించాడు. అక్కడ చూడండి! స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవుడి కోసం ఏడుస్తున్నారు.
그가 또 나를 데리고 여호와의 전으로 들어가는 북문에 이르시기로 보니 거기 여인들이 앉아 담무스를 위하여 애곡하더라
15 ౧౫ అప్పుడాయన “నరపుత్రుడా, ఇది చూశావా? ఇప్పుడు ఇంతకంటే అసహ్యమైనది చూస్తావు” అని నాకు చెప్పాడు.
그가 또 내게 이르시되 인자야 네가 그것을 보았느냐 너는 또 이보다 더 큰 가증한 일을 보리라 하시더라
16 ౧౬ ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.
그가 또 나를 데리고 여호와의 전 안뜰에 들어가시기로 보니 여호와의 전문 앞 현관과 제단 사이에서 약 이십오 인이 여호와의 전을 등지고 낯을 동으로 향하여 동방 태양에 경배하더라
17 ౧౭ అప్పుడాయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నువ్వు ఇదంతా చూస్తున్నావా? యూదా జాతి ప్రజలు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన పనులు స్వల్పమైనవా? వాళ్ళు దేశాన్ని బలాత్కారంతో నింపివేశారు. ముక్కులకు తీగలు తగిలించుకుంటూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నారు.
또 내게 이르시되 인자야 네가 보았느냐 유다 족속이 여기서 행한 가증한 일을 적다 하겠느냐 그들이 강포로 이 땅에 채우고 또 다시 내 노를 격동하고 심지어 나무가지를 그 코에 두었느니라
18 ౧౮ కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.”
그러므로 나도 분노로 갚아 아껴 보지 아니하고 긍휼을 베풀지도 아니하리니 그들이 큰 소리로 내 귀에 부르짖을지라도 내가 듣지 아니하리라