< యెహెజ్కేలు 6 >
1 ౧ నా దగ్గరికి తిరిగి యెహోవా వాక్కు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
І було мені слово Господнє таке:
2 ౨ “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు.
„Сину лю́дський, зверни своє обличчя до Ізраїлевих гір, і пророкуй на них,
3 ౩ ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
та й скажеш: Гори Ізраїлеві, послухайте сло́ва Господа Бога! Так говорить Господь Бог гора́м та підгі́ркам, і рі́чищам та долинам: Ось Я спрова́джу на вас меча, і ви́гублю ваші па́гірки, —
4 ౪ తరువాత మీ బలిపీఠాలు పాడై పోతాయి. మీ దేవతా స్తంభాలు ధ్వంసం అవుతాయి. హతమైన మీ వాళ్ళను మీ విగ్రహాల ఎదుట పారవేస్తాను.
і будуть опусто́шені ваші же́ртівники, і будуть розби́ті ваші фіґури сонця, і кину Я ваших побитих перед вашими божка́ми!
5 ౫ ఇశ్రాయేలు ప్రజల శవాలను వారి విగ్రహాల ఎదుట పేరుస్తాను. వాళ్ళ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ వెదజల్లుతాను.
І дам трупи Ізраїлевих синів перед їхніми божка́ми, і розпоро́шу ваші кості навколо ваших же́ртівників.
6 ౬ మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి.
По всіх місцях вашого перебува́ння міста́ будуть поруйно́вані, а па́гірки попусто́шені, щоб ваші же́ртівники були поруйно́вані та побезче́щені, і щоб були розтро́щені й перестали існувати ваші божки́, і були розби́ті ваші фіґури сонця, і були стерті ваші діла́,
7 ౭ ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
І впаде́ забитий між вами, і ви пізнаєте, що Я — Госпо́дь!
8 ౮ అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.
А Я позоставлю з вас решту, бо будете мати врято́ваних від меча серед наро́дів, коли ви будете розпоро́шені серед країн.
9 ౯ అప్పుడు అలా తప్పించుకుని ఇతర జాతుల మధ్య బందీలుగా ఉన్నవారు నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి నన్ను దూరం చేసిన తమ లైంగిక విశృంఖలత, విగ్రహాలపట్ల వాళ్ళకున్న అనురక్తీ నన్నెలా వేదనకి గురి చేసిందో ఆలోచిస్తారు. చండాలమైన పనులన్నిటితో తాము సాగించిన దుర్మార్గత పట్ల వాళ్ళ ముఖాలపై అసహ్యం కనిపిస్తుంది.
І ваші врятовані згадають про Мене серед наро́дів, куди бу́дуть за́брані до поло́ну, коли Я зламаю їхнє блудне́ серце, що відпало від Мене, та їхні очі, що пере́люб чинили з своїми божка́ми, і вони самі бу́дуть бри́дитися тих злих речей, що робили, щодо всіх їхніх гидо́т.
10 ౧౦ అప్పుడు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. వాళ్ళ పైకి కీడు రప్పిస్తానని నేను చెప్పిన మాట వెనుక ఒక కారణం ఉంది.”
І пізна́ють вони, що Я — Госпо́дь, і що Я не нада́рмо говорив, що вчиню́ їм оцю злу річ!
11 ౧౧ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నీ చేతులు చరిచి నీ పాదాలు నేలకు తన్ను! ఇశ్రాయేలు జాతి సాగించిన అసహ్యమైన పనుల కోసం ‘అయ్యో’ అని రోదించు. ఎందుకంటే వాళ్ళని ఖడ్గం, కరువు, తెగులు హతం చేస్తాయి.
Так говорить Господь Бог: Удар своєю долонею й ту́пни ногою своєю, і скажи: Горе за всі злі вчинки Ізраїлевого дому, за які вони попа́дають від меча, голоду та морови́ці!
12 ౧౨ దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. ఈ విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను.
Той, хто далекий, помре від морови́ці, а хто близьки́й — впаде від меча, а хто позостане та буде врято́ваний — помре від голоду. І так Я ви́кінчу Свою лютість на них!
13 ౧౩ వాళ్ళలో హతం అయిన వాళ్ళు ఎత్తయిన కొండలన్నిటి పైనా బలిపీఠాల చుట్టూ ఉన్న విగ్రహాల మధ్యలోనూ, పర్వత శిఖరాల పైనా, తమ విగ్రహాలకి పరిమళ ధూపం వేసిన పచ్చని చెట్లన్నిటి మధ్యా, సింధూర వృక్షాల మధ్యా పడి ఉంటారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
І пізна́єте ви, що Я — Госпо́дь, коли їхні забиті будуть лежати серед їхніх божкі́в навколо їхніх же́ртівників на всякім високім підгі́р'ї, на всіх щита́х гір, і під усяким зеленим деревом, і під усяким густим дубом, на місці, де вони прино́сили приємні пахощі для всіх своїх божкі́в.
14 ౧౪ నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”
І Я ви́тягну руку Свою на них, і зроблю́ цей Край спусто́шенням та пу́сткою, від пустині аж до Рівли́, по всіх місцях їхнього сиді́ння... І пізнають вони, що Я — Госпо́дь!“