< యెహెజ్కేలు 5 >

1 “తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో.
“Then you, son of man, take a sharp sword as a barber's razor for yourself, and pass the razor over your head and your beard, then take scales to weigh and divide your hair.
2 పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.
Burn a third of it with fire in the midst of the city when the days of the siege are completed, and take a third of the hair and strike it with the sword all around the city. Then scatter a third of it to the wind, and I will draw out a sword to chase after the people.
3 అయితే కొద్దిగా వెంట్రుకలను తీసుకుని నీ చెంగుకి కట్టుకో.
But take a small number of hairs from them and tie them into the folds of your robe.
4 మళ్ళీ వాటిలో కొన్నిటిని తీసి అగ్నిలో వేసి కాల్చి వెయ్యి. అక్కడ నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు జాతినంతటినీ తగులబెట్టేస్తుంది.”
Then take more of the hair and throw it into the midst of the fire; and burn it in the fire; from there a fire will go out to all the house of Israel.”
5 ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు. “ఇది అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము పట్టణం. నేను అనేక రాజ్యాలు దాని చుట్టూ ఉండేలా చేశాను.
The Lord Yahweh says this, “This is Jerusalem in the midst of the nations, where I have placed her, and where I have surrounded her with other lands.
6 అయితే ఆమె ఇతర జాతుల కంటే దుర్మార్గంగా నా శాసనాలను తిరస్కరించింది. ఇతర రాజ్యాల కంటే దుర్మార్గంగా నా నియమాలను తిరస్కరించింది. వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించి నా నియమాల ప్రకారం నడుచుకోలేదు.”
But she has in wickedness rejected my decrees more than the nations have, and my statutes more than the countries that surround her. The people have rejected my judgments and have not walked in my statutes.”
7 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరు నాకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నా శాసనాల ప్రకారం మీరు నడుచుకోలేదు. నా నియమాలను బట్టి నడుచుకోలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న రాజ్యాల నియమాలను బట్టి కూడా మీరు నడుచుకోలేదు.
Therefore the Lord Yahweh says this, “Because you are more troublesome than the nations that surround you and have not walked in my statutes or acted according to my decrees, or even acted according to the decrees of the nations that surround you,”
8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
therefore the Lord Yahweh says this, “Behold! I myself will act against you. I will execute judgments within your midst for the nations to see.
9 నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.
I will do to you what I have not done and the like of which I will not do again, because of all your disgusting actions.
10 ౧౦ దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను.
Therefore fathers will eat the children in your midst, and sons will eat their fathers, since I will execute judgment on you and scatter to every direction all of you who are left.
11 ౧౧ కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన. “నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను.
Therefore, as I live—this is the Lord Yahweh's declaration—it is certainly because you have defiled my sanctuary with all your hateful things and with all your disgusting deeds, that I myself will reduce you in number; my eye will not have pity on you, and I will not spare you.
12 ౧౨ మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.
A third of you will die by plague, and they will be consumed by famine in your midst. A third will fall by the sword surrounding you. Then I will scatter a third in every direction, and draw out a sword to chase after them as well.
13 ౧౩ అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు.
Then my wrath will be completed, and I will cause my fury toward them to rest. I will be satisfied, and they will know that I, Yahweh, have spoken in my wrath when I have completed my fury against them.
14 ౧౪ నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ, నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను.
I will make you a desolation and a reproach to the nations that surround you in the sight of everyone who passes by.
15 ౧౫ కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.
So Jerusalem will become something for other people to condemn and to mock, a warning and a horror to the nations that surround you. I will execute judgments against you in wrath and fury, and with a furious rebuke—I, Yahweh have declared this!
16 ౧౬ నీ పైకి నేను కఠినమైన కరువు బాణాలు వేస్తాను. అవి నువ్వు నాశనం కావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే నీ పైకి వచ్చిన కరువును అధికం చేస్తాను. నీ ఆహారానికి ఆధారంగా ఉన్న వాటిని విరిచి వేస్తాను.
I will send out harsh arrows of famine against you that will become the means with which I will destroy you. For I will increase the famine on you and break your staff of bread.
17 ౧౭ నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.”
I will send a famine and disasters against you so you will be childless. Plague and blood will pass through you, and I will bring a sword against you—I, Yahweh, have declared this.”

< యెహెజ్కేలు 5 >