< యెహెజ్కేలు 5 >
1 ౧ “తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో.
"You, son of man, take a sharp sword; You shall take it as a barber's razor to you, and shall cause it to pass on your head and on your beard: then take balances to weigh, and divide the hair.
2 ౨ పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.
A third part you shall burn in the fire in the midst of the city, when the days of the siege are fulfilled; and you shall take a third part, and strike with the sword around it; and a third part you shall scatter to the wind, and I will draw out a sword after them.
3 ౩ అయితే కొద్దిగా వెంట్రుకలను తీసుకుని నీ చెంగుకి కట్టుకో.
You shall take of it a few in number, and bind them in your skirts.
4 ౪ మళ్ళీ వాటిలో కొన్నిటిని తీసి అగ్నిలో వేసి కాల్చి వెయ్యి. అక్కడ నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు జాతినంతటినీ తగులబెట్టేస్తుంది.”
Of these again you shall take, and cast them into the midst of the fire, and burn them in the fire; from it shall a fire come forth into all the house of Israel."
5 ౫ ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు. “ఇది అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము పట్టణం. నేను అనేక రాజ్యాలు దాని చుట్టూ ఉండేలా చేశాను.
"Thus says YHWH: 'This is Jerusalem; I have placed her at the center of the nations, and countries are around her.
6 ౬ అయితే ఆమె ఇతర జాతుల కంటే దుర్మార్గంగా నా శాసనాలను తిరస్కరించింది. ఇతర రాజ్యాల కంటే దుర్మార్గంగా నా నియమాలను తిరస్కరించింది. వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించి నా నియమాల ప్రకారం నడుచుకోలేదు.”
She has rebelled against my ordinances in doing wickedness more than the nations, and against my statutes more than the countries that are around her; for they have rejected my ordinances, and as for my statutes, they have not walked in them.'
7 ౭ కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరు నాకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నా శాసనాల ప్రకారం మీరు నడుచుకోలేదు. నా నియమాలను బట్టి నడుచుకోలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న రాజ్యాల నియమాలను బట్టి కూడా మీరు నడుచుకోలేదు.
"Therefore thus says YHWH: 'Because you are turbulent more than the nations that are around you, and have not walked in my statutes, neither have kept my ordinances, neither have done after the ordinances of the nations that are around you';
8 ౮ కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
therefore thus says YHWH: 'Look, I, even I, am against you; and I will execute judgments in the midst of you in the sight of the nations.
9 ౯ నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.
I will do in you that which I have not done, and whereunto I will not do any more the like, because of all your abominations.
10 ౧౦ దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను.
Therefore the fathers shall eat the sons in the midst of you, and the sons shall eat their fathers; and I will execute judgments on you; and the whole remnant of you will I scatter to all the winds.'
11 ౧౧ కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన. “నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను.
"'Therefore as I live,' says YHWH, 'surely, because you have defiled my sanctuary with all your detestable things, and with all your abominations, therefore I will also diminish you; neither shall my eye spare, and I also will have no pity.
12 ౧౨ మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.
A third part of you shall die with the pestilence, and with famine shall they be consumed in the midst of you; and a third part shall fall by the sword around you; and a third part I will scatter to all the winds, and will draw out a sword after them.
13 ౧౩ అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు.
Thus shall my anger be accomplished, and I will cause my wrath toward them to rest, and I shall be comforted; and they shall know that I, YHWH, have spoken in my zeal, when I have accomplished my wrath on them.
14 ౧౪ నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ, నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను.
Moreover I will make you a desolation and a reproach among the nations that are around you, in the sight of all that pass by.
15 ౧౫ కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.
And you shall be a reproach and a taunt, an instruction and an astonishment, to the nations that are around you, when I shall execute judgments on you in anger and in wrath, and in wrathful rebukes; I, YHWH, have spoken;
16 ౧౬ నీ పైకి నేను కఠినమైన కరువు బాణాలు వేస్తాను. అవి నువ్వు నాశనం కావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే నీ పైకి వచ్చిన కరువును అధికం చేస్తాను. నీ ఆహారానికి ఆధారంగా ఉన్న వాటిని విరిచి వేస్తాను.
when I shall send on them the evil arrows of famine, that are for destruction, which I will send to destroy you: and I will increase the famine on you, and will break your staff of bread;
17 ౧౭ నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.”
and I will send on you famine and evil animals, and they shall bereave you; and pestilence and blood shall pass through you; and I will bring the sword on you: I, YHWH, have spoken it.'"