< యెహెజ్కేలు 47 >
1 ౧ ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.
Un viņš mani veda atpakaļ pie tā nama durvīm, un redzi, tur ūdens iztecēja apakš tā nama sliekšņa pret rītiem, jo tā nama priekšgals bija pret rītiem, un tas ūdens notecēja no apakšas no tā nama labās puses, sānis altārim pret dienvidu.
2 ౨ తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి.
Un viņš mani izveda pa Ziemeļa vārtiem, un mani apveda apkārt pa āra ceļu pie ārējiem vārtiem, kas pret rītiem, un redzi, ūdens iztecēja no labās puses.
3 ౩ ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి.
Kad nu tas vīrs izgāja pret rītiem, tad mēra aukla bija viņa rokā, un viņš mēroja tūkstoš olektis, un lika man brist pār to ūdeni, un tas ūdens man sniedzās līdz krimšļiem.
4 ౪ ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి.
Atkal viņš mēroja tūkstoš olektis un lika man brist pār to ūdeni, un tas ūdens man sniedzās līdz ceļiem, un viņš mēroja vēl tūkstoš olektis, un lika man pārbrist, un tas ūdens man sniedzās līdz gurniem.
5 ౫ ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది.
Atkal viņš mēroja tūkstoš olektis, tad bija upe, ko es nevarēju izbrist, jo tas ūdens bija dziļš, ūdens, kur bija jāpeld, upe, kur nevarēja iet cauri.
6 ౬ అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు.
Un viņš uz mani sacīja: vai tu to esi redzējis, cilvēka bērns? Tad viņš mani veda atkal atpakaļ upes malā.
7 ౭ నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి.
Kad es nu nācu atpakaļ, redzi, tad upes malā bija ļoti daudz koku, šinī un viņā pusē.
8 ౮ అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి.
Un viņš uz mani sacīja; šis ūdens iztek pret rīta pusi un notek klajumā, pēc tas nāk jūrā, un jūrā notecējis tas ūdens taps veselīgs.
9 ౯ ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.
Un notiek, ka ikviena dzīva dvaša, kas kustās, kurp šī upe(no diviem avotiem) nāk, dzīvos, un tur būs ļoti daudz zivju, tāpēc ka šis ūdens turp nāks, un būs veseli un viss dzīvos, kur šī upe nāk.
10 ౧౦ ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి.
Un zvejnieki pie tās stāvēs no Enģediem līdz EnEģlaīm, tur būs vietas, kur tīklus izmetīs. Viņu zivis būs pēc savas kārtas, kā tās lielās zivis jūrā, ļoti daudz.
11 ౧౧ అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి.
Bet viņas paltis(dumbrāji) un viņas dīķi netaps veselīgi; tie būs priekš sāls.
12 ౧౨ నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.”
Un pie tās upes viņas malas abējās pusēs augs visādi augļu koki, kam lapas nesavītīs un augļi nemitēsies, un ikmēnešus tie nesīs jaunus augļus. Jo viņas ūdens iztek no tās svētās vietas, un viņas augļi būs par barību un viņas lapas par dziedināšanu.
13 ౧౩ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి.
Tā saka Tas Kungs Dievs: šī lai ir robeža, pēc kuras jums to zemi būs ņemt par mantību pēc tām divpadsmit Israēla ciltīm: Jāzepam pienākas divas daļas.
14 ౧౪ నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.
Un jums to būs iemantot, vienam kā otram; par to es savu roku esmu pacēlis, to dot jūsu tēviem; un šī zeme jums piekritīs par mantību.
15 ౧౫ ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు.
Šī nu ir tās zemes robeža: pret ziemeli no lielās jūras pār Etlonu, kamēr nāk uz Cedadu,
16 ౧౬ అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది.
Hamata, Berota, Zibraīma, kas ir starp Damaskus robežu un Hamatas robežu, AcarTikons, kas ir pie Averana robežas.
17 ౧౭ పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
Tā būs tā robeža no jūras līdz AcarEnonam, Damaskus robežai; un tālāk pret ziemeli ir Hamatas robeža, un šī būs tā ziemeļa mala.
18 ౧౮ తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు.
Un tā rītu mala starp Averanu un Damasku un starp Gileādu un Israēla zemi jums būs Jardāne; no tās robežas līdz rītu jūrai jums būs mērot. Un šī ir tā rītu mala.
19 ౧౯ దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
Un tā dienvidu mala pret dienvidiem lai ir no Tamāra līdz Kādeša strīdus ūdenim, un tad gar upi līdz lielai jūrai. Un šī būs tā dienvidu mala pret dienvidiem.
20 ౨౦ పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు.
Un tā vakaru mala lai ir tā lielā jūra no tās robežas, līdz kamēr iet uz Hamatu. Šī būs tā vakaru mala.
21 ౨౧ ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి.
Un jums šo zemi savā starpā būs izdalīt pēc Israēla ciltīm.
22 ౨౨ మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి.
Un jums to būs izdalīt par mantību sev un arī tiem svešiniekiem, kas jūsu starpā dzīvo un bērnus dzemdinājuši jūsu vidū, un tie lai jums ir kā tas, kas no Israēla bērniem dzimis!
23 ౨౩ ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Tiem būs līdz ar jums mantot Israēla cilšu vidū, un tai ciltī, pie kuras tas svešinieks dzīvo, tur jums viņam būs dot daļu, saka Tas Kungs Dievs.