< యెహెజ్కేలు 45 >

1 “మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది.
Og når I lodder ut landet til eiendom, skal I avgi en gave til Herren, et hellig stykke av landet, fem og tyve tusen stenger langt og ti tusen bredt; det skal være hellig så langt det rekker rundt omkring.
2 దానిలో పరిశుద్ధ స్థలానికి 270 మీటర్ల నలుచదరమైన స్థలం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు వైపులా 27 మీటర్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి.
Av det skal det tas til helligdommen fem hundre stenger i lengde og fem hundre i bredde, i firkant rundt omkring, og femti alen til en fri plass for den rundt omkring.
3 ఈ స్థలం నుండి 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు గల భూమి కొలవాలి. అందులో పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది.
Således skal du efter dette mål måle fem og tyve tusen stenger i lengde og ti tusen i bredde; og der skal helligdommen, det høihellige, være.
4 యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలం అవుతుంది. అది వారి ఇళ్ళకోసం ఏర్పాటై, పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేసే లేవీయులు ఇళ్ళు కట్టుకుని నివసించేలా
Det er en hellig del av landet, den skal tilhøre prestene, helligdommens tjenere, som nærmer sig for å tjene Herren, og det skal være til hustomter for dem og en hellig plass for helligdommen.
5 వారికి స్వాస్థ్యంగా 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు 5 కిలో మీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతంలో వారి నివాస స్థలాలు ఉంటాయి.
Og fem og tyve tusen stenger i lengde og ti tusen i bredde skal tilhøre levittene, husets tjenere; de skal ha tyve gårder til eiendom.
6 పట్టణం కోసం 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్ఠిత స్థలానికి ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా అది చెందుతుంది.
Og som stadens eiendom skal I avgi fem tusen stenger i bredde og fem og tyve tusen i lengde, ved siden av helligdommens lodd; det skal tilhøre hele Israels hus.
7 ప్రతిష్ఠిత భాగానికి పట్టణానికి ఏర్పాటైన భాగానికి పశ్చిమంగా, తూర్పుగా, రెండు వైపులా రాజు కోసం భూమిని కేటాయించాలి. పశ్చిమం నుండి తూర్పు వరకూ దాన్ని కొలిచినప్పుడు అది ఒక గోత్రస్థానానికి సరిపడిన పొడవు కలిగి ఉండాలి. రాజు నా ప్రజలను బాధింపక వారి గోత్రాల ప్రకారం దేశమంతటినీ ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చేందుకు
Og fyrsten skal ha sin lodd på begge sider av helligdommens lodd og av stadens eiendom, langsmed helligdommens lodd og stadens eiendom, dels på vestsiden, mot vest, og dels på østsiden, mot øst, og i lengde svarende til én av stammenes lodder fra vestgrensen til østgrensen.
8 అది ఇశ్రాయేలీయుల్లో అతని స్వాస్త్యమైన భూమిగా ఉంటుంది.”
Dette skal han ha som sitt land, som sin eiendom i Israel, og mine fyrster skal ikke mere undertrykke mitt folk, men overlate landet til Israels hus efter deres stammer.
9 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు “ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Så sier Herren, Israels Gud: Nu får det være nok, I Israels fyrster! Få bort vold og ødeleggelse og gjør rett og rettferdighet, hør op med å drive mitt folk fra gård og grunn, sier Herren, Israels Gud.
10 ౧౦ నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి.
Rette vektskåler og rett efa og rett bat skal I ha.
11 ౧౧ తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి.
En efa og en bat skal ha samme mål, så en bat er tiendedelen av en homer, og en efa tiendedelen av en homer; efter homeren skal deres mål rette sig.
12 ౧౨ ఒక తులానికి 20 చిన్నాలు, ఒక మీనాకు 20 తులాల ఎత్తు, 25 తులాల ఎత్తు, 15 తులాల ఎత్తు ఉండాలి.
En sekel skal være tyve gera; en mine skal hos eder være tyve sekel, fem og tyve sekel, femten sekel.
13 ౧౩ ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి.
Dette er den offergave I skal gi: en sjettedel efa av en homer hvete, og likeså skal I gi en sjettedel efa av en homer bygg.
14 ౧౪ తైలం చెల్లించే విధం ఏమిటంటే 180 పళ్ల నూనెలో ఒక పడి, ముప్పాతిక చొప్పున చెల్లించాలి. తూము 180 పళ్లు పడుతుంది.
Og den fastsatte avgift av olje, av en bat olje, er en tiendedel bat av en kor - det går ti bat på en homer; for en homer er ti bat -
15 ౧౫ ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యానికీ దహనబలికీ సమాధానబలికీ బాగా మేపిన గొర్రెల్లో మందకు రెండువందల్లో ఒక గొర్రెను తేవాలి.
og av småfeet ett lam av to hundre fra Israels vannrike beitemark til matoffer og til brennoffer og takkoffer, til å gjøre soning for dem, sier Herren, Israels Gud.
16 ౧౬ దేశ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల పాలకునికి చెల్లించాల్సిన ఈ అర్పణ తేవాల్సిన బాధ్యత ఉంది.
Alt folket i landet skal være skyldig til å yde denne offergave til fyrsten i Israel.
17 ౧౭ పండగల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతిదినాల్లో, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యే నియమిత సమయాల్లో వాడే దహనబలులను, నైవేద్యాలను, పానార్పణలను సరఫరా చేసే బాధ్యత పాలకునిదే. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలిపశువులనూ నైవేద్యాలనూ దహనబలులనూ సమాధాన బలిపశువులనూ సిధ్దపరచాలి.”
Og fyrsten skal det påligge å ofre brennofferne og matofferet og drikkofferet på festene og nymånedagene og sabbatene, på alle Israels høitider; han skal ofre syndofferet og matofferet og brennofferet og takkofferne for å gjøre soning for Israels hus.
18 ౧౮ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “మొదటి నెల మొదటి రోజున ఏ లోపం లేని కోడెను తెచ్చి పరిశుద్ధ స్థలం కోసం పాప పరిహారార్థబలి అర్పించాలి.
Så sier Herren, Israels Gud: I den første måned, på den første dag i måneden, skal du ta en ung okse uten lyte, og du skal rense helligdommen fra synd.
19 ౧౯ ఎలాగంటే యాజకుడు పాప పరిహారార్థబలి పశువు రక్తం కొంచెం తీసి, మందిరపు ద్వారబంధాల మీదా బలిపీఠం చూరు నాలుగు మూలల మీదా లోపటి ఆవరణం వాకిలి ద్వారబంధాల మీదా చల్లాలి.
Og presten skal ta noget av syndofferets blod og stryke på husets dørstolper og på de fire hjørner av alterets avsats og på dørstolpene i den indre forgårds port.
20 ౨౦ అనుకోకుండా లేక తెలియక పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం మందిరానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతి నెల ఏడో రోజున ఆ విధంగా చేయాలి.
Og likeså skal du gjøre på den syvende dag i måneden for deres skyld som har syndet av vanvare eller uvitenhet, og således skal I gjøre soning for huset.
21 ౨౧ మొదటి నెల 14 వ రోజున పస్కాపండగ ఆచరించాలి. ఏడు రోజులు దాన్ని జరుపుకోవాలి. మీరు పులియని ఆహారం తినాలి.
I den første måned, på den fjortende dag i måneden, skal I holde påske; på denne fest skal I ete usyret brød i syv dager.
22 ౨౨ ఆ రోజున పాలకుడు తన కోసం, దేశ ప్రజలందరి కోసం పాప పరిహారార్థబలిగా ఒక ఎద్దును అర్పించాలి.
På den dag skal fyrsten ofre en okse til syndoffer for sig og for alt folket i landet.
23 ౨౩ ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి.
Og på festens syv dager skal han ofre Herren et brennoffer, syv okser uten lyte og syv værer uten lyte hver dag i de syv dager, og som syndoffer en gjetebukk hver dag.
24 ౨౪ ఒక్కొక్క ఎద్దుకు, పొట్టేలుకు ఒక తూము పిండితో నైవేద్యం చేయాలి. ఒక్క తూముకి మూడు పళ్ల నూనె ఉండాలి.
Og som matoffer skal han ofre en efa til hver okse og en efa til hver vær og en hin olje til hver efa.
25 ౨౫ ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.”
I den syvende måned, på den femtende dag i måneden, på festen, skal han ofre lignende offer i syv dager, både syndofferet og brennofferet, både matofferet og oljen.

< యెహెజ్కేలు 45 >