< యెహెజ్కేలు 45 >
1 ౧ “మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది.
१जेव्हा तुम्ही वतनासाठी चिठ्ठ्या टाकून देशाची वाटणी कराल तेव्हा परमेश्वरास अर्पायचा प्रदेश, देशाचा पवित्र विभाग, तुम्ही अर्पण कराल, त्याची लांबी पंचवीस हजार हात व रुंदी वीस हजार हात असावी. त्याच्या सभोवतालचा सर्व प्रदेश पवित्र होईल.
2 ౨ దానిలో పరిశుద్ధ స్థలానికి 270 మీటర్ల నలుచదరమైన స్థలం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు వైపులా 27 మీటర్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి.
२यापैकी पांचशे हात लांब व पांचशे हात रुंद एवढी चौरस जागा पवित्रस्थानासाठी ठेवून तिच्याभोवती पन्नास हात खुली जागा राखून ठेवावी, ती सभोवती चौरस असावी.
3 ౩ ఈ స్థలం నుండి 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు గల భూమి కొలవాలి. అందులో పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది.
३त्या मोजलेल्या जमिनीतून तू पंचवीस हजार हात लांब व दहा हजार हात रुंद जागा मोजून काढ.
4 ౪ యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలం అవుతుంది. అది వారి ఇళ్ళకోసం ఏర్పాటై, పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేసే లేవీయులు ఇళ్ళు కట్టుకుని నివసించేలా
४जे याजक पवित्रस्थानाचे सेवा करावयास परमेश्वराजवळ येतील त्यांना हा भूमीचा पवित्र प्रदेश होईल. तो त्यांना त्यांच्या घरासाठी जागा आणि पवित्रस्थानासाठी पवित्र जागा होईल.
5 ౫ వారికి స్వాస్థ్యంగా 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు 5 కిలో మీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతంలో వారి నివాస స్థలాలు ఉంటాయి.
५म्हणून ती पंचवीस हजार हात लांब व दहा हजार हात रुंद, एवढी जागा जे कोणी लेवी मंदिरात सेवा करतात त्यांची व्हावी. वस्तीसाठी हे त्यांचे वतन होय.
6 ౬ పట్టణం కోసం 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్ఠిత స్థలానికి ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా అది చెందుతుంది.
६अर्पिलेला पवित्र प्रदेशसुद्धा तुम्ही पाच हजार हात रुंद व पंचवीस हजार हात लांब प्रदेश नगराचा विभाग म्हणून नेमून द्याल; तो इस्राएलाच्या सर्व घराण्याला होईल.
7 ౭ ప్రతిష్ఠిత భాగానికి పట్టణానికి ఏర్పాటైన భాగానికి పశ్చిమంగా, తూర్పుగా, రెండు వైపులా రాజు కోసం భూమిని కేటాయించాలి. పశ్చిమం నుండి తూర్పు వరకూ దాన్ని కొలిచినప్పుడు అది ఒక గోత్రస్థానానికి సరిపడిన పొడవు కలిగి ఉండాలి. రాజు నా ప్రజలను బాధింపక వారి గోత్రాల ప్రకారం దేశమంతటినీ ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చేందుకు
७“अर्पिलेल्या पवित्र प्रदेशाच्या व नगराच्या विभागाच्या एकाबाजूस व दुसऱ्याबाजूस अर्पिलेल्या पवित्र प्रदेशासमोर आणि नगराच्या विभागासमोर पश्चिम सीमेपासून पश्चिमेकडे, आणि पूर्व सीमेपासून पूर्वेकडे अधिपतीस विभाग होईल.
8 ౮ అది ఇశ్రాయేలీయుల్లో అతని స్వాస్త్యమైన భూమిగా ఉంటుంది.”
८ही जमीन इस्राएलात अधिपतीचे वतन व्हावी म्हणजे यापुढे माझ्या अधिपतींनी माझ्या लोकांवर जुलूम करू नये; तर त्याऐवजी इस्राएल घराण्याला त्यांच्या त्यांच्या वंशाप्रमाणे जमीन द्यावी.
9 ౯ యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు “ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
९प्रभू परमेश्वर असे म्हणतो, इस्राएलाच्या अधिपतींनो, हे तुमच्यासाठी पुरे होवो. जबरदस्ती आणि जुलूम दूर करा! न्याय व न्यायीपण आचरा, माझ्या लोकांची हकालपट्टी करण्याचे सोडा.” असे प्रभू परमेश्वर म्हणतो.
10 ౧౦ నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి.
१०तुम्ही खरी तागडी, खरी एफा, खरी बथ वापरा.
11 ౧౧ తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి.
११एफा व बथ सारख्याच मापाचे असावे. याकरिता बथ होमराचा दहावा भाग; तशीच एफाही होमराचा दहावा भाग; या होमराच्या मापाप्रमाणे असाव्या.
12 ౧౨ ఒక తులానికి 20 చిన్నాలు, ఒక మీనాకు 20 తులాల ఎత్తు, 25 తులాల ఎత్తు, 15 తులాల ఎత్తు ఉండాలి.
१२शेकेल वीस गेराचा असावा. माने वीस शेकेलाचा, पंचवीस शेकेलाचा किंवा पंधरा शेकेलाचा असावा.
13 ౧౩ ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి.
१३तुमची जे अर्पणे अर्पावयाचे ती अशी असावीः तुम्ही होमभर गव्हातून एफाचा सहावा भाग गहू व होमरभर जवातून एफाचा सहावा भाग जव द्यावा.
14 ౧౪ తైలం చెల్లించే విధం ఏమిటంటే 180 పళ్ల నూనెలో ఒక పడి, ముప్పాతిక చొప్పున చెల్లించాలి. తూము 180 పళ్లు పడుతుంది.
१४तेलाचा नियम हाच, तुम्ही तेलाच्या बथाचा म्हणजे खोरभर तेलातून बथाचा दहावा भाग अर्पावा; दहा बथांचा खोर म्हणजे एक होमर, कारण दहा बथ एक होमर आहेत;
15 ౧౫ ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యానికీ దహనబలికీ సమాధానబలికీ బాగా మేపిన గొర్రెల్లో మందకు రెండువందల్లో ఒక గొర్రెను తేవాలి.
१५आणि इस्राएल देशातील पाणथळाच्या कुरणातील दोनशे मेंढरांच्या कळपातून एक कोकरू, अन्नार्पण व होमार्पण व शांत्यर्पणे म्हणून त्यांच्यासाठी प्रायश्चित करायला अर्पावे, असे प्रभू परमेश्वर म्हणतो.
16 ౧౬ దేశ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల పాలకునికి చెల్లించాల్సిన ఈ అర్పణ తేవాల్సిన బాధ్యత ఉంది.
१६देशातील सर्व लोकांनी इस्राएलातल्या अधिपतीस ही अर्पणे दिली पाहिजेत.
17 ౧౭ పండగల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతిదినాల్లో, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యే నియమిత సమయాల్లో వాడే దహనబలులను, నైవేద్యాలను, పానార్పణలను సరఫరా చేసే బాధ్యత పాలకునిదే. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలిపశువులనూ నైవేద్యాలనూ దహనబలులనూ సమాధాన బలిపశువులనూ సిధ్దపరచాలి.”
१७उत्सव, व चंद्रदर्शने, शब्बाथ आणि इस्राएलाच्या घराण्याचे सर्व सण यामध्ये अन्नार्पण, होमार्पण व पेयार्पण याची तरतूद करणे हे अधिपतींचे काम आहे. इस्राएल घराण्यासाठी प्रायश्चित करण्यासाठी त्याने अन्नार्पण, होमार्पण व शांत्यर्पणे ही सिद्ध करावी.
18 ౧౮ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “మొదటి నెల మొదటి రోజున ఏ లోపం లేని కోడెను తెచ్చి పరిశుద్ధ స్థలం కోసం పాప పరిహారార్థబలి అర్పించాలి.
१८प्रभू परमेश्वर असे म्हणतो, “पहिल्या महिन्यात, महिन्याच्या पहिल्या दिवशी, तू निर्दोष तरुण गोऱ्हा घेऊन पवित्रस्थानाची शुद्धी कर.
19 ౧౯ ఎలాగంటే యాజకుడు పాప పరిహారార్థబలి పశువు రక్తం కొంచెం తీసి, మందిరపు ద్వారబంధాల మీదా బలిపీఠం చూరు నాలుగు మూలల మీదా లోపటి ఆవరణం వాకిలి ద్వారబంధాల మీదా చల్లాలి.
१९तेव्हा याजकाने पापार्पणाच्या पशूचे रक्त घेऊन ते मंदिराच्या दरवाजाच्या चौकटीला, वेदीच्या बैठकीच्या चाऱ्ही कोपऱ्यांवर व आंतील अंगणाच्या दरवाजाच्या चौकटीला लावावे.”
20 ౨౦ అనుకోకుండా లేక తెలియక పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం మందిరానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతి నెల ఏడో రోజున ఆ విధంగా చేయాలి.
२०पहिल्या महिन्याच्या सातव्या दिवशी, प्रत्येक चुकलेल्या किंवा भोळ्या मनुष्याकरता तू तसेच करशील आणि तुम्ही याप्रकारे मंदिरासाठी प्रायश्चित करावे.
21 ౨౧ మొదటి నెల 14 వ రోజున పస్కాపండగ ఆచరించాలి. ఏడు రోజులు దాన్ని జరుపుకోవాలి. మీరు పులియని ఆహారం తినాలి.
२१पहिल्या महिन्यात, महिन्याच्या चौदाव्या दिवशी तुम्हास सात दिवसाचा वल्हांडण सण होईल, त्यामध्ये बेखमीर भाकर खावी.
22 ౨౨ ఆ రోజున పాలకుడు తన కోసం, దేశ ప్రజలందరి కోసం పాప పరిహారార్థబలిగా ఒక ఎద్దును అర్పించాలి.
२२त्यादिवशी अधिपती आपणासाठी आणि देशातील सर्व लोकांसाठी पापार्पणासाठी एक गोऱ्हा सिद्ध करील.
23 ౨౩ ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి.
२३परमेश्वरास होमार्पण करण्यासाठी सणाचे सात दिवस त्याने सात निर्दोष गोऱ्हे व सात मेंढे सिद्ध करावे आणि पापर्पणासाठी रोज एक बोकड सिद्ध करावा.
24 ౨౪ ఒక్కొక్క ఎద్దుకు, పొట్టేలుకు ఒక తూము పిండితో నైవేద్యం చేయాలి. ఒక్క తూముకి మూడు పళ్ల నూనె ఉండాలి.
२४मग अधिपती एका गोऱ्ह्यासाठी एफाभर व एका मेंढ्यासाठी एफाभर अन्नार्पण आणि एफासाठी हीनभर तेल सिद्ध करील, पापार्पण म्हणून बैल देईल.
25 ౨౫ ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.”
२५सातव्या महिन्यात, महिन्याच्या पंधराव्या दिवशी, सणात, सात दिवसपर्यंत तो पापबली, होमबली, अन्नबली आणि तेल ही याप्रमाणेच सिद्ध करील.