< యెహెజ్కేలు 43 >
1 ౧ తరువాత ఆ మనిషి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి నన్ను తోడుకుని వచ్చాడు.
Na ɔbarima no de me baa apueeɛ fam ɛpono no ano,
2 ౨ అప్పుడు నాకు ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడింది. దానినుండి పుట్టిన ధ్వని విస్తారమైన జలాల ధ్వనిలాగా వినబడింది. ఆయన మహిమ వలన భూమి ధగధగా మెరిసిపోయింది.
na mehunuu Israel Onyankopɔn animuonyam sɛ apue wɔ apueeɛ fam reba. Na ne nne te sɛ nsusenee nworosoɔ ano den, na asase no so hyerɛnee wɔ nʼanimuonyam no mu.
3 ౩ నాకు కనబడిన ఆ దర్శనం, ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నేను చూసిన దర్శనం లాగా ఉంది. కెబారు నది దగ్గర నాకు కనబడిన లాంటి దర్శనాలు చూసి నేను సాగిలపడ్డాను.
Anisoadehunu a menyaeɛ no te sɛ deɛ menyaa no ɛberɛ a ɔba bɛsɛee kuropɔn no ne deɛ menyaa wɔ Asubɔnten Kebar ho no, na mede mʼanim butuu fam.
4 ౪ తూర్పు వైపు తిరిగి ఉన్న గుమ్మం లోనుండి యెహోవా మహిమ తేజస్సు మందిరంలోకి ప్రవేశించింది.
Awurade animuonyam faa ɛpono a ani kyerɛ apueeɛ fam no mu hyɛnee asɔredan no mu.
5 ౫ ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోకి తెచ్చినప్పుడు యెహోవా మహిమ తేజస్సుతో మందిరం నిండి ఉంది.
Na honhom no pagyaa me de me baa mfimfini adihɔ hɔ na Awurade animuonyam hyɛɛ asɔredan no ma.
6 ౬ మందిరంలో నుండి ఒకరు నాతో మాటలాడినట్టు నాకు వినబడింది. అప్పుడు నాదగ్గర నిలిచి ఉన్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు.
Ɛberɛ a ɔbarima no gyina me ho no, metee sɛ obi rekasa firi asɔredan no mu kyerɛ me.
7 ౭ “నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు.
Ɔkaa sɛ, “Onipa ba, ɛha ne mʼahennwa siberɛ ne me nan ntiasoɔ. Ɛha na mɛtena wɔ Israelfoɔ mu afebɔɔ. Israel efie rengu me din ho fi bio da; wɔn anaa wɔn ahemfo remfa wɔn adwamammɔ ne ahemfo no ahoni a nkwa nni mu a wɔwɔ wɔn sorɔnsorɔmmea no rengu me din ho fi.
8 ౮ నాకు, వారికి మధ్య ఒక్క గోడ మాత్రం ఉంచి నా గుమ్మాల పక్కనే వారి గుమ్మాలు, నా ద్వారబంధాల పక్కనే వారి ద్వారబంధాలు నిలబెట్టి, నా పవిత్రమైన పేరుకు ఇక ముందు అవమానం కలిగించరు. వారు చేసిన అకృత్యాల చేత నా పవిత్రమైన పేరును దూషణపాలు చేశారు కాబట్టి నేను ఆగ్రహంతో వారిని నాశనం చేశాను.
Ɛberɛ a wɔmaa wɔn aboboano bɛnee me deɛ, na wɔn aponnwa nso bɛnee me deɛ a na ɔfasuo na ɛtwa yɛn ntam no, wɔde wɔn akyiwadeɛ guu me din kronkron ho fi. Ɛno enti mesɛee wɔn wɔ mʼabufuo mu.
9 ౯ ఇకనుండి వారు అపనమ్మకత్వం మాని, తమ రాజుల విగ్రహాలను నా ఎదుట నుండి దూరంగా తొలగిస్తే వారి మధ్యలో నేను ఎల్లకాలం నివసిస్తాను.
Afei ma wɔnyi wɔn adwamammɔ ne ahemfo no ahoni a wɔnni nkwa no mfiri mʼani so, na mɛtena wɔn mu afebɔɔ.
10 ౧౦ కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాలను బట్టి సిగ్గుపడేలా ఈ మందిరం గురించి వారికి వివరించు. వారు దాని నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలి.
“Onipa ba, kyerɛkyerɛ Israelfoɔ sɛdeɛ asɔredan no teɛ na wɔn ani nwu wɔ wɔn bɔne ho. Ma wɔnsusu ne sie mfoni ho,
11 ౧౧ తాము చేసినవాటిని బట్టి వారు పశ్చాత్తాపపడితే, మందిర నిర్మాణాన్ని, దాని వివరాలను, ప్రవేశ, నిర్గమ మార్గాలను, వాటి మర్యాదలను, విధులను, దాని ఆచారాలను, పద్ధతులను వారికి వివరించి, వారు ఆ ఆచారవిధులన్నిటికి లోబడి ఆచరించేలా వారు చూస్తూ ఉండగా వాటిని రాయించు.”
na sɛ wɔn ani wu deɛ wɔayɛ ho a, twa asɔredan no mfoni kyerɛ wɔn; ne ntotoeɛ, apono a wɔfa mu pue ne deɛ wɔfa kɔ mu, ne mfoni nyinaa, ne ɛho akwankyerɛ nyinaa ne mmara. Twerɛ saa nneɛma yi wɔ wɔn anim na wɔadi me ntotoeɛ ne ne sie no mfoni no so.
12 ౧౨ ఆ మందిరం గూర్చిన పద్ధతి ఏమంటే, పర్వతం మీద దానితో చేరి ఉన్న స్థలమంతా అతి పవిత్రం. ఇదే మందిరం గూర్చిన విధి.
“Asɔredan no ho mmara nie: Asase a ɛda ho wɔ bepɔ no so nyinaa yɛ kronkron. Sei na asɔredan no ho mmara teɛ.
13 ౧౩ మందిర ఆవరణం కొలతల ప్రకారం బలిపీఠం కొలతలు ఇవి. దాని అడుగుభాగం ఎత్తు అర మీటరు. దాని డొలుపు అర మీటరు ఎత్తు, అర మీటరు వెడల్పు. దాని చుట్టూ దాని అంచు ఎనిమిది సెంటిమీటర్ల వెడల్పుతో విచిత్రమైన పనితో ఉండాలి.
“Afɔrebukyia no nsusuiɛ na ɛdidi soɔ yi. Ne nsuka mu dɔ yɛ anammɔn ne fa na ne tɛtrɛtɛ nso saa ara, na anoano hini a ɛtwa ho hyia no nso tɛtrɛtɛ bɛyɛ nsateakwaa nkron. Na yei nso ne afɔrebukyia no tentene:
14 ౧౪ నేల మీద బలిపీఠం అడుగుభాగం నుండి కింది చూరుదాకా దాని ఎత్తు ఒక మీటరు. వెడల్పు అర మీటరు. ఈ చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకూ 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. దాని వెడల్పు అర మీటరు.
Ɛfiri ne nnyinasoɔ a ɛsi nsuka no so kɔ ne soro yɛ anammɔn mmiɛnsa, na ne pipiripie nso yɛ ɔnamɔn ne fa, na apa ketewa no ne apa kɛseɛ no ntam yɛ anammɔn nsia, na apa no pipiripie nso yɛ ɔnamɔn ne fa.
15 ౧౫ బలిపీఠం పొయ్యి ఎత్తు 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. ఆ అగ్నిగుండం నుండి పైకి నాలుగు కొమ్ములున్నాయి.
Afɔrebukyia no wisie tokuro no ɔsorokɔ yɛ anammɔn nsia na mmɛn ɛnan a ano hwɛ soro tuatua ho.
16 ౧౬ అది నలు చదరంగాఆరు మీటర్ల 50 సెంటి మీటర్లు కొలత కలిగి ఉంది.
Afɔrebukyia wisie tokuro no yɛ ahinanan, na ɛfa biara yɛ anammɔn dunwɔtwe.
17 ౧౭ పై చూరు పొడవు, వెడల్పు అన్ని వైపులా ఏడు మీటర్ల 60 సెంటి మీటర్లు. దాని చుట్టూ ఉన్న అంచు ఎనిమిది సెంటిమీటర్లు. దాని చుట్టూ కొలత అర మీటరు. దానికి తూర్పు వైపున మెట్లు ఉన్నాయి.
Afɔrebukyia no apa a ɛwɔ soro no nso yɛ ahinanan a afanan no mu biara yɛ anammɔn aduonu baako, na kawa a ɛyɛ nsateakwaa nkron da apa no ano na nsuka a atwa ho ahyia yɛ ɔnamɔn ne fa. Atwedeɛ a ɛkɔ afɔrebukyia no so no ani hwɛ apueeɛ fam.”
18 ౧౮ అతడు నాతో ఇంకా ఇలా అన్నాడు “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ బలిపీఠం కట్టిన తరవాత దాని మీద రక్తం చల్లి, దహనబలులు అర్పించడానికి జరిగించ వలసిన పద్ధతులు ఇవి.
Ɔka kyerɛɛ me sɛ, “Onipa ba, yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Yeinom na ɛbɛyɛ nhyehyɛeɛ a wɔbɛfa so abɔ ɔhyeɛ afɔdeɛ ne ɛkwan a, sɛ wɔsi afɔrebukyia no wie a wɔbɛfa so de mogya apete ho:
19 ౧౯ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చే సాదోకు సంతానమైన యాజకులకు పాప పరిహారార్థబలి అర్పించడానికి ఒక కోడెను ఇవ్వాలి.
Ɛsɛ sɛ wode nantwie ba ma asɔfoɔ a wɔyɛ Lewifoɔ na wɔfiri Sadok abusua mu na wɔba mʼanim bɛsom me no, sɛ bɔne afɔrebɔdeɛ, Otumfoɔ Awurade asɛm nie.
20 ౨౦ వారు దాన్ని పాప పరిహారార్థబలిగా అర్పించి, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దాని రక్తంలో కొంచెం తీసి దాని నాలుగు కొమ్ముల మీదా దాని చూరు నాలుగు మూలల మీదా చుట్టూ ఉన్న అంచు మీదా పూయాలి.
Ɛsɛ sɛ wofa nantwie ba no mogya no bi na wode keka afɔrebukyia mmɛn ɛnan no ho. Wode bi bɛkeka apa a ɛwɔ soro no ntwɛtwɛaso ne anoano kawa a atwa ho ahyia no ho na wɔnam so ate afɔrebukyia no ho de ayɛ mpata nso.
21 ౨౧ తరవాత పాప పరిహారార్థ బలి అయిన ఎద్దును తీసి పరిశుద్ధ స్థలం అవతల మందిరంలోని నియమిత స్థలంలో దాన్ని దహించాలి.
Ɛsɛ sɛ wofa bɔne afɔrebɔdeɛ nantwie no na wokɔhye no wɔ asɔredan no ho beaeɛ a wɔayi ato hɔ, wɔ kronkronbea no akyi.
22 ౨౨ రెండో రోజు పాప పరిహారార్థబలిగా ఏ లోపం లేని ఒక మేకపిల్లను అర్పించాలి. కోడెను అర్పించినప్పుడు చేసినట్టే మేకపిల్ల రక్తంతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి.
“Ɛda a ɛtɔ so mmienu no, ɛsɛ sɛ wode ɔpapo a ɔnni dɛm ma sɛ bɔne afɔrebɔdeɛ, na ɛsɛ sɛ wɔdwira afɔrebukyia no ho sɛdeɛ wɔde nantwie no yɛeɛ no.
23 ౨౩ ఆ విధంగా పాప పరిహారం చేసిన తరవాత ఏ లోపం లేని కోడెను, ఏ లోపం లేని పొట్టేలును అర్పించాలి.
Sɛ wowie ɛho dwira a, ɛsɛ sɛ wode nantwie ba ne nnwennini a wɔfiri ebuo no mu a wɔnni dɛm bɛbɔ afɔdeɛ.
24 ౨౪ వాటిని యెహోవా సన్నిధికి తెచ్చి యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
Ɛsɛ sɛ wode wɔn ba Awurade anim, na asɔfoɔ de nkyene pete wɔn so na wɔde bɔ ɔhyeɛ afɔdeɛ ma Awurade.
25 ౨౫ వారు వరసగా ఏడు రోజులు పాప పరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను, ఏ లోపం లేని ఒక కోడెను, ఏ లోపం లేని ఒక పొట్టేలును సిద్ధపరచాలి.
“Ɛsɛ sɛ wode ɔpapo ba sɛ bɔne afɔrebɔdeɛ nnanson. Afei ɛsɛ sɛ wode nantwie ba ne nnwennini a wɔfiri ebuo mu na wɔnni dɛm nso ba.
26 ౨౬ ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ, దాన్ని శుద్ధి చేస్తూ ప్రతిష్ఠించాలి.
Wɔbɛyɛ mpatadeɛ ama afɔrebukyia no nnanson de ate ho; sei na wɔbɛyɛ de asi hɔ ama dwumadie.
27 ౨౭ ఆ రోజులు అయిన తరవాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు, సమాధానబలులు అర్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Saa nna yi akyi, ɛfiri ɛda a ɛtɔ so nnwɔtwe de rekorɔ no, ɛsɛ sɛ asɔfoɔ no de mo ɔhyeɛ afɔrebɔdeɛ ne asomdwoeɛ afɔrebɔdeɛ no ba afɔrebukyia no so. Afei mɛgye mo atom, Otumfoɔ Awurade asɛm nie.”