< యెహెజ్కేలు 42 >

1 ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు.
و مرا به صحن بیرونی از راه سمت شمالی بیرون برد و مرا به حجره‌ای که مقابل مکان منفصل و روبروی بنیان بطرف شمال بود آورد.۱
2 ఆ కట్టడం గుమ్మం ఉత్తరం వైపుకు తిరిగి 54 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు ఉంది.
جلو طول صد ذراعی درشمالی بود و عرضش پنجاه ذراع بود.۲
3 ఆ గదులు పరిశుద్ధ స్థలానికి 11 మీటర్లు దూరంలో ఉండి బయటి ఆవరణపు తాపడం చేసిన నేలకు ఎదురుగా మూడో అంతస్థులోని వసారాలు ఒకదాని కొకటి ఎదురుగా ఉన్నాయి.
مقابل بیست ذراع که از آن صحن اندرونی بود و مقابل سنگفرشی که از صحن بیرونی بود دهلیزی روبروی دهلیزی در سه طبقه بود.۳
4 ఆ గదులకు ఎదురుగా 5 మీటర్ల 40 సెంటి మీటర్ల వెడల్పు, 54 మీటర్ల పొడవు గల వసారా ఉంది. ఆ గదుల గుమ్మాలన్నీ ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
و پیش روی حجره‌ها بطرف اندرون خرندی به عرض ده ذراع بود و راهی یک ذراع و درهای آنها بطرف شمال بود.۴
5 పైన గదులకు వసారాలుండడం వలన వాటి ఎత్తు తక్కువై మధ్యగదులు ఇరుకుగా ఉన్నాయి.
و حجره های فوقانی کوتاه بود زیرا که دهلیزها از آنها می‌گرفتند بیشتر از آنچه آنها ازحجره های تحتانی و وسطی بنیان می‌گرفتند.۵
6 మూడో అంతస్థులో ఉన్న గదులకు ఆవరణకు ఉన్న స్తంభాలు లేవు కాబట్టి అవి కింద గదులకంటే, మధ్య గదులకంటే చిన్నవిగా కట్టి ఉన్నాయి.
چونکه سه طبقه بود و ستونها مثل ستونهای صحن‌ها نداشت و از این سبب، طبقه فوقانی ازطبقات تحتانی و وسطی از زمین تنگتر می‌شد.۶
7 గదుల వరుసను బట్టి బయటి ఆవరణ వైపు గదులకు ఎదురుగా 27 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడ ఉంది.
وطول دیواری که بطرف بیرون مقابل حجره هابسوی صحن بیرونی روبروی حجره‌ها بود پنجاه ذراع بود.۷
8 బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది.
زیرا طول حجره هایی که در صحن بیرونی بود پنجاه ذراع بود و اینک جلو هیکل صدذراع بود.۸
9 ఈ గదులు గోడకింద నుండి లేచినట్టుగా కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించడానికి తూర్పువైపున మార్గం ఉంది.
و زیر این حجره‌ها از طرف شرقی مدخلی بود که از آن به آنها از صحن بیرونی داخل می‌شدند.۹
10 ౧౦ ఖాళీ స్థలానికి, కట్టడానికి ఎదురుగా ఆవరణపు గోడ వారున తూర్పువైపు కొన్ని గదులున్నాయి.
و در حجم دیوار صحن که بطرف مشرق بود پیش روی مکان منفصل و مقابل بنیان حجره‌ها بود.۱۰
11 ౧౧ వాటి ఎదుట ఉన్న మార్గం ఉత్తరం వైపు ఉన్న గదుల మార్గం లాగా ఉంది. వాటి కొలతల ప్రకారమే ఇవి కూడా కట్టి ఉన్నాయి. వీటి ద్వారాలు కూడా వాటి లాగానే ఉన్నాయి.
و راه مقابل آنها مثل نمایش راه حجره های سمت شمال بود، عرض آنها مطابق طول آنها بود و تمامی مخرج های اینها مثل رسم آنها و درهای آنها.۱۱
12 ౧౨ దక్షిణం వైపు గదుల తలుపుల్లాగా వీటి తలుపులు కూడా ఉన్నాయి. ఆ మార్గం ఆవరణంలోకి పోయేవారికి తూర్పుగా ఉన్న గోడ ఎదురుగానే ఉంది.
و مثل درهای حجره های سمت جنوب دری بر سر راه بود یعنی بر راهی که راست پیش روی دیوار مشرقی بود جایی که به آنها داخل می‌شدند.۱۲
13 ౧౩ అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం.
و مرا گفت: «حجره های شمالی وحجره های جنوبی که پیش روی مکان منفصل است، حجره های مقدس می‌باشد که کاهنانی که به خداوند نزدیک می‌آیند قدس اقداس را درآنها می‌خورند و قدس اقداس و هدایای آردی وقربانی های گناه و قربانی های جرم را در آنهامی گذارند زیرا که این مکان مقدس است.۱۳
14 ౧౪ యాజకులు లోపల ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి బయటి ఆవరణంలోకి పోకుండా అక్కడే తాము పరిచర్యకు ధరించే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితాలు కాబట్టి ప్రజలకు చెందిన దేనినైనా వారు తాకాలంటే వారు వేరే బట్టలు ధరించుకోవాలి.”
وچون کاهنان داخل آنها می‌شوند دیگر از قدس به صحن بیرونی بیرون نمی آیند بلکه لباسهای خودرا که در آنها خدمت می‌کنند در آنها می‌گذارندزیرا که آنها مقدس می‌باشد و لباس دیگرپوشیده، به آنچه به قوم تعلق دارد نزدیک می‌آیند.»۱۴
15 ౧౫ అతడు లోపలి మందిరాన్ని కొలవడం ముగించి నన్ను బయటికి తీసుకొచ్చి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి వచ్చి చుట్టూ కొలిచాడు.
و چون پیمایشهای خانه اندرونی را به اتمام رسانید، مرا بسوی دروازه‌ای که رویش به سمت مشرق بود بیرون آورد و آن را از هر طرف پیمود.۱۵
16 ౧౬ తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది.
جانب شرقی آن را به نی پیمایش، پانصد نی پیمود یعنی به نی پیمایش آن را از هرطرف (پیمود).۱۶
17 ౧౭ ఉత్తరం వైపు 270 మీటర్లు,
و جانب شمالی را به نی پیمایش از هر طرف پانصد نی پیمود.۱۷
18 ౧౮ దక్షిణం వైపు 270 మీటర్లు,
و جانب جنوبی را به نی پیمایش، پانصد نی پیمود.۱۸
19 ౧౯ పడమర వైపు 270 మీటర్లు ఉంది.
پس به سوی جانب غربی برگشته، آن را به نی پیمایش پانصد نی پیمود.۱۹
20 ౨౦ ఆవిధంగా అతడు నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన, పవిత్రం కాని స్థలాలను వేరు చేయడానికి దానిచుట్టూ నాలుగు వైపులా 270 మీటర్లు ఉన్న నలుచదరపు గోడ కట్టి ఉంది.
هر‌چهار جانب آن را پیمود وآن را دیواری بود که طولش پانصد و عرضش پانصد (نی ) بود تا در میان مقدس و غیرمقدس فرق گذارد.۲۰

< యెహెజ్కేలు 42 >