< యెహెజ్కేలు 41 >
1 ౧ తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
Me introdujo luego en el Santuario. Midió las columnas, tres metros por cada lado, lo cual era la anchura del Tabernáculo.
2 ౨ ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
La anchura de la entrada era de cinco metros. Los lados de la entrada eran de 2,5 metros cada uno. Su longitud era de 20 metros, y su anchura, diez metros.
3 ౩ అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి.
Luego pasó al interior y midió cada columna de la entrada, un metro. La entrada era de tres metros de altura y su anchura, 3,7 metros.
4 ౪ అతడు “ఇది అతి పరిశుద్ధస్థలం” అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
Midió también su longitud y su anchura. Ambas eran de diez metros, delante del Santuario. Entonces me dijo: Éste es el Lugar Santísimo.
5 ౫ తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి.
Después midió el muro de la Casa, tres metros. La anchura de cada cámara lateral era de dos metros, alrededor de toda la Casa.
6 ౬ ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి.
Las cámaras laterales estaban una sobre otra, 30 en cada uno de los tres pisos. En la pared alrededor de la Casa pusieron salientes a fin de que las cámaras no se apoyaran en la pared de la Casa.
7 ౭ ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
Había mayor anchura en las cámaras superiores. La escalera de caracol de la Casa subía hasta muy arriba por dentro de la Casa. Por tanto la anchura de la Casa aumentaba según se subía. Desde el piso inferior se subía hasta el más alto, y se pasaba por el del medio.
8 ౮ ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
Miré que la altura alrededor de la Casa tenía un basamento elevado alrededor. Los cimientos de las cámaras laterales eran de tres metros antiguos completos.
9 ౯ మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
El espesor del muro exterior de las cámaras laterales era de 2,5 metros. Entre las cámaras laterales de la Casa había un espacio de igual medida.
10 ౧౦ గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
Entre las cámaras había un espacio de diez metros alrededor de la Casa por todos los lados.
11 ౧౧ మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.
La puerta de cada cámara daba salida al espacio que quedaba, una hacia el norte y otra al sur. La anchura del espacio que quedaba alrededor era de 2,5 metros.
12 ౧౨ ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు.
El edificio que estaba frente al espacio abierto hacia el occidente tenía 35 metros de ancho. La pared de alrededor de todo el edificio tenía un espesor de 2,5 metros, y su longitud era de 45 metros.
13 ౧౩ మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.
Luego midió la Casa, 50 metros de longitud. El espacio abierto y el edificio con sus paredes, 50 metros de longitud.
14 ౧౪ తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు.
También midió la anchura del frente de la Casa y del espacio abierto que estaba hacia el oriente, 50 metros.
15 ౧౫ మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
Después midió la longitud del edificio que quedaba frente al espacio abierto que estaba detrás de él, con sus cámaras una de cada lado, 50 metros, con la cámara interior y los patios del patio.
16 ౧౬ అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి.
Las entradas, las ventanas estrechas y las cámaras en sus tres niveles, estaban cubiertas de madera desde el suelo hasta las ventanas (las cuales también estaban cubiertas)
17 ౧౭ గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి.
por encima de la entrada, hasta el interior y aun el exterior de la Casa. Toda la pared alrededor, por dentro y por fuera, según su medida,
18 ౧౮ రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి.
estaba labrada con querubines y palmeras. Entre querubín y querubín había una palmera. Cada querubín tenía dos rostros:
19 ౧౯ ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి.
rostro de hombre hacia la palmera de un lado, y cara de león hacia la palmera del otro lado. Así estaba arreglado alrededor de toda la Casa.
20 ౨౦ నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
Había querubines y palmeras labrados en la pared desde el suelo hasta la parte superior de la entrada.
21 ౨౧ మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి.
Cada columna del Lugar Santo era cuadrada. El frente del Lugar Santísimo era como el otro frente.
22 ౨౨ బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.
El altar de madera tenía 1,5 metros de altura por un metro de longitud. Sus esquinas, su superficie y sus paredes eran de madera. Y me dijo: Ésta es la mesa que está delante de Yavé.
23 ౨౩ మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి.
Había dos puertas: una para el Lugar Santo y otra para el Lugar Santísimo.
24 ౨౪ ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.
En cada puerta había dos hojas que giraban: dos en una puerta y dos en la otra.
25 ౨౫ అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది.
Había en ellas querubines y palmeras, tallados como los del muro. Había gruesas vigas de madera sobre el frente del patio exterior.
26 ౨౬ మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.
Había ventanas de celosías, y palmeras en los dos lados del patio tanto en las cámaras laterales como la Casa y en las entradas.