< యెహెజ్కేలు 40 >
1 ౧ మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.
我們充軍後第二十五年,京城被毀後第十四年,年初,月之初十日,就在這一天,上主的手臨於我。
2 ౨ దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.
在神視中領我來到以色列地,把我放在最高的山上,山的南方有座像城的建築物。
3 ౩ అక్కడికి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మెరిసే ఇత్తడిలాగా ఉండి, చేతిలో దారం, కొలిచే కర్ర పట్టుకుని నగర ద్వారంలో నిలబడిన ఒక మనిషి ఉన్నాడు.
他領我到了那裏,看,有一個人,面色似銅,手中拿著一條麻繩和測量竿。他站在門樓旁。
4 ౪ ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.”
那人對我說:「人子,你要用眼看,用耳聽,留意我向你指示的一切,因為我引你到這裏來,為叫你看見;凡你所見的,你要告訴以色列家族。」
5 ౫ నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన ఆ గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
看,在殿外四周有一道圍牆。那人手中拿的測量竿長六肘──肘是一肘加一掌──他用竿量了牆:寬一竿,高一竿。
6 ౬ అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
他來到面朝東的門樓,上了石級,量了門限,寬一竿;
7 ౭ కావలి గది పొడవు, వెడల్పులు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, కావలి గదులకు మధ్య 2 మీటర్ల 70 సెంటి మీటర్లు దూరం ఉంది. గుమ్మపు ద్వారం ప్రక్కనుండి మందిరానికి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు దూరం.
量了守衛房:長一竿,寬一竿;房與房之間相離五肘;內裏門廊的門限,為一竿。
8 ౮ గుమ్మపు ద్వారానికి, మందిరానికి మధ్య 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
又量了內裏的門廊,
9 ౯ గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.
為八肘,壁柱厚二肘,門廊是在內裏。
10 ౧౦ తూర్పు గుమ్మపు ద్వారం లోపల ఇటు మూడు, అటు మూడు కావలి గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటికీ ఒక్కటే కొలత. వాటి రెండు పక్కల ఉన్న స్తంభాలకు కూడా ఒక్కటే కొలత.
東門樓的守衛房,這邊三間,那邊三間;三間的尺寸相同,兩邊壁柱的尺寸也相同。
11 ౧౧ ఆ గుమ్మాల ప్రవేశంలో కొలత చూస్తే వాటి వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు, పొడవు ఏడు మీటర్లు.
量了門口的寬度,為十肘;門的通道為十三肘寬。
12 ౧౨ కావలి గదుల ఎదుట రెండు వైపులా అర మీటరు ఎత్తున్న గోడ ఉంది. గదులు మాత్రం రెండు పక్కలా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఎత్తు ఉన్నాయి.
守衛房前面有柵欄,兩邊各突出一肘。守衛房各邊為六肘。
13 ౧౩ ఒక గది కప్పు నుండి రెండవ గది కప్పువరకూ గుమ్మాల మధ్య కొలిసినప్పుడు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు ఉంది. రెండు వాకిళ్ళ మధ్య కూడా అదే కొలత.
量了門樓,由守衛房頂到對面守衛房頂,寬二十五肘;門與門相對。
14 ౧౪ 32 మీటర్లు ఎడంగా ఒక్కొక్క స్తంభం నిలబెట్టి ఉన్నాయి. గుమ్మం చుట్టూ ఉన్న ఆవరణం స్తంభాల వరకూ వ్యాపించింది.
量了門廊,為二十肘;通過門廊,即是外院。
15 ౧౫ బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారపు ఆవరణ వరకూ 27 మీటర్లు.
由門樓的前面到內裏門廊的前面,共五十肘。
16 ౧౬ కావలి గదులకు గుమ్మాలకు, లోపల వాటికి మధ్య చుట్టూ ఉన్న గోడలకు ప్రక్కగదులకు కమ్ములు పెట్టిన కిటికీలున్నాయి. గోడలోని స్తంభాలకు కూడా కిటికీలున్నాయి. ప్రతి స్తంభం మీదా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
門樓四周,在守衛房和牆壁上,有向內斜帶櫺的窗戶;走廊四周也有這樣向內的窗戶。壁柱上有棕櫚枝。
17 ౧౭ అతడు నన్ను బయటి ఆవరణంలోకి తీసికెళ్ళాడు. అక్కడ గదులు, చప్టా ఉన్నాయి. చప్టా మీద 30 చిన్నగదులు ఉన్నాయి.
他引我到了外院;看,有廊房,在庭院四周修的有舖道,舖道上有廊房三十間。
18 ౧౮ ఈ చప్టా గుమ్మాలదాకా ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది కింది చప్టా.
在各門樓旁邊也有舖道,同門樓一樣長,這是低舖道。
19 ౧౯ అప్పుడాయన కింది గుమ్మం నుండి లోపలి ఆవరణం వరకూ వెడల్పు కొలిచినప్పుడు అది తూర్పున, ఉత్తరాన 54 మీటర్లు ఉంది.
他由下門樓前面,量到內院門樓前面,共一百肘寬。然後他向北走去。
20 ౨౦ తరవాత బయటి ఆవరణం ఉత్తరాన ఉన్న గుమ్మం పొడవు, వెడల్పులు,
看,在外院有一座面朝北的門樓。他量的門樓的寬和長。
21 ౨౧ దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కావలి గదులు, వాటి స్తంభాలను వాటి మధ్య గోడలను కొలవగా వాటి కొలత మొదటి గుమ్మం కొలతలాగానే, అంటే 27 మీటర్లు పొడవు, 13 మీటర్ల 50 సెంటి మీటర్లు వెడల్పు ఉన్నాయి.
守衛房,兩邊各有三間;壁柱和走廊,如上面所有的尺寸一樣:五十肘長,二十五肘寬。
22 ౨౨ ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న వాటి కిటికీలు, వాటి మధ్యగోడలు తూర్పుద్వారం కొలతకు సమానంగా ఉంది. వాటికి ఏడు మెట్లు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఆవరణ ఉంది.
窗戶、走廊、棕櫚枝、如朝東的門樓所有的尺寸一樣。上去的台階有七級,直達面前的走廊。
23 ౨౩ ఉత్తర ద్వారానికి, తూర్పు ద్వారానికి, లోపలి ఆవరణకు వెళ్ళే రెండు గుమ్మాలున్నాయి. ఈ రెండు గుమ్మాల మధ్య దూరం అతడు కొలిచినప్పుడు అది 54 మీటర్లు ఉంది.
外北門的對面有一座通內院的門樓,與東門樓一樣;量了門樓與門樓的距離,為一百肘。
24 ౨౪ అప్పుడాయన నన్ను దక్షిణం వైపుకు తోడుకుని వెళ్ళాడు. అక్కడ గుమ్మం ఒకటి ఉంది. దాని స్తంభాలను మధ్య గోడలను కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
他又領我往南走,看,朝南有一座門樓;他量了壁柱和走廊,尺寸與前面的相同。
25 ౨౫ వాటికి ఉన్నట్టుగానే దీని మధ్యగోడలకు కూడా చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 25 మీటర్లు, వెడల్పు పదమూడున్నర మీటర్లు.
走廊四周也有窗戶,一如上述的窗戶。門樓五十肘長,二十五肘寬。
26 ౨౬ ఎక్కడానికి ఏడు మెట్లు, వాటికి ఎదురుగా కనిపించే మధ్య గోడలు ఉన్నాయి. దాని స్తంభాలపై కూడా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
上去的台階有七級,直達面前的走廊;兩邊的壁柱上都有棕櫚枝。
27 ౨౭ లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. ఈ గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు.
通內院朝南也有一座門樓。量了二門樓之間的距離,為一百肘。
28 ౨౮ అతడు దక్షిణ దిశగా లోపలి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దక్షిణపు గుమ్మాన్ని కొలిచాడు. దాని కొలత అదే.
他領我由南門走進內院,量了南門樓,尺寸與上述者相同。
29 ౨౯ దాని కావలి గదుల స్తంభాలు, మధ్య గోడలు పైన చెప్పిన కొలతకు సరిపోయాయి. దానికీ దాని చుట్టూ ఉన్న మధ్యగోడలకూ కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు పదమూడున్నర.
守衛房、壁柱和走廊,一如上述的尺寸;走廊四周也有窗戶;門樓五十肘長,二十五肘寬。
30 ౩౦ చుట్టూ మధ్యగోడల పొడవు పదమూడున్నర, వెడల్పు రెండున్నర మీటర్లు.
四周共五十肘長,二十五肘寬。
31 ౩౧ దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. దాని స్తంభాల మీద ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. వాటికి ఎనిమిది మెట్లున్నాయి.
門廊面向外院,壁柱上也有棕櫚枝。上去台階有八級。
32 ౩౨ తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.
他引我到了面朝東的內院門樓,量了門樓,尺寸有如上述。
33 ౩౩ దాని కావలి గదులకు స్తంభాలకు, మధ్యగోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
守衛房、壁柱和走廊,尺寸有如上述;走廊四周也有窗戶。門樓長五十肘,寬二十五肘。
34 ౩౪ దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపు చూస్తున్నాయి. వాటి స్తంభాల మీద రెండు వైపులా ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
門廊面向外院;兩邊壁柱上也有棕櫚枝。上去的台階有八級。
35 ౩౫ అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
他引我到了北門樓,量了門樓,尺寸有如上述。
36 ౩౬ దాని కావలి గదులకు, స్తంభాలకు, దాని మధ్య గోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
守衛房、壁柱和走廊,四周也有窗戶;門樓長五十肘,寬二十五肘。
37 ౩౭ అటూ ఇటూ ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న దాని స్తంభాలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
門廊面向外院;兩邊壁柱上也有棕櫚枝。上去的台階有八級。
38 ౩౮ ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.
在門樓的門廊兩旁,各有一間有門的廂房,在裏面洗滌全燔祭牲。
39 ౩౯ గుమ్మపు మంటపాల్లో రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. వీటి మీద దహనబలి, పాప పరిహారార్థ బలి, అపరాధపరిహారార్థ బలులకు పశువులను వధిస్తారు.
在門廊兩邊,每邊有兩張桌子,在上面宰殺全燔祭、贖罪祭和贖過祭犧牲。
40 ౪౦ గుమ్మాల వాకిలి దగ్గర ఉత్తరాన మెట్లు ఎక్కే చోట రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. అంటే గుమ్మపు రెండు వైపులా నాలుగేసి బల్లలున్నాయి. వీటి పైన పశువులను వధిస్తారు.
在登上門廊的入口處的北面,靠外的一面有兩張桌子,在門廊的另一面也有兩張桌子。
41 ౪౧ దహనబలి పశువులు మొదలైన వాటిని వధించడానికి వాడే ఉపకరణాలు ఉంచే ఎనిమిది బల్లలు ఈ వైపు నాలుగు, ఆ వైపు నాలుగు మెట్ల దగ్గర ఉన్నాయి.
門樓旁邊,每邊有四張桌子,共八張,在上面宰殺祭牲。
42 ౪౨ వాటి పొడవు సుమారు ఒక మీటరు, వెడల్పు సుమారు ఒక మీటరు, ఎత్తు అర మీటరు. వాటిని రాతితో మలిచారు.
又有四張為全燔祭用的桌子,都是四方石頭砌成的:長一肘半,寬一肘半,高一肘;上面放宰殺全燔祭犧牲和其他祭牲的用具。
43 ౪౩ ఈ బల్లల మీద బలి అర్పణ మాంసాన్ని ఉంచుతారు. చుట్టూ ఉన్న గోడకు ఒక అడుగు పొడుగున్న మేకులు తగిలించి ఉన్నాయి.
屋內四周釘有一掌長的掛鉤,桌上放有祭肉。
44 ౪౪ లోపటి గుమ్మం బయట, లోపలి ఆవరణంలో రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, మరొకటి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
他領我走到內院,看見在內院中,有兩座廂房:一座靠北門的廂房,面朝南;一座看南門的廂房,面朝北。
45 ౪౫ అప్పుడతడు నాతో ఇలా అన్నాడు. “దక్షిణం వైపు చూసే గది మందిరానికి కావలి కాసే యాజకులది.
他對我說:「那面朝南的廂房是為在殿內供職的司祭之用,
46 ౪౬ ఉత్తరం వైపుకు చూసే గది బలిపీఠానికి కావలి కాసే యాజకులది. వీరు లేవీయుల్లో సాదోకు సంతతికి చెంది యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు.”
那面朝北的廂房是為在祭壇前供職的司祭之用,他們是肋未的後代中,走近祭壇供職的匝多克的子孫。」
47 ౪౭ అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
他量了庭院:長一百肘,寬一百肘,為四方形;在殿前有一祭壇。
48 ౪౮ అతడు మందిర మంటపంలోకి నన్ను తీసుకొచ్చి మంటప స్తంభాలను ఒక్కొక్కటీ కొలిచినప్పుడు అది రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు ఉన్నాయి. దాని ప్రవేశ ద్వారం వెడల్పు 7 మీటర్లు ఉంది. దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం 1 మీటర్ 60 సెంటి మీటర్లు.
他領我進了聖殿的門廊,量了門廊的壁柱,兩邊各有五肘。門寬十四肘,牆壁每邊三肘。
49 ౪౯ మంటపం పొడవు 11 మీటర్లు. దాని వెడల్పు సుమారు 6 మీటర్లు. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దానికి ఇరువైపులా స్తంభాలున్నాయి.
門廊長二十肘,寬十二肘;上去的台階有十級。靠著壁柱,有二柱,每邊一柱。