< యెహెజ్కేలు 39 >

1 నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
Sine čovječji, prorokuj protiv Goga i reci: 'Ovako govori Jahve Gospod: Evo me na te, Gože, veliki kneže Mešeka i Tubala!
2 నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను.
Namamit ću te i povesti, podići te s krajnjega sjevera i dovesti na gore Izraelove.
3 నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.
Izbit ću ti luk iz lijeve ruke i prosuti strijele iz tvoje desnice.
4 నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.
Na gorama ćeš Izraelovim pasti, ti i sve tvoje čete i narodi koji budu s tobom: pticama grabljivicama, svemu krilatom, i zvijerima dadoh te za hranu.
5 నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Na otvorenom ćeš polju pasti, jer ja tako rekoh - riječ je Jahve Gospoda.
6 ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.
Poslat ću oganj na Magog i na sve koji spokojno žive na otocima - i znat će da sam ja Jahve.
7 నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.
A svoje sveto ime objavit ću posred naroda svoga izraelskoga i neću dati da se više oskvrnjuje moje sveto ime! I znat će svi narodi da sam ja, Jahve, Svetac Izraelov.
8 ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Evo dolazi i biva - riječ je Jahve Gospoda! To je dan o kojem sam govorio!
9 ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.
Izići će stanovnici izraelskih gradova, naložiti vatru i spaliti oružje, štitove, štitiće, lukove i strelice, koplja i sulice - ložit će njima vatru sedam godina.
10 ౧౦ ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Neće nositi drva iz polja ni sjeći u šumama, nego će vatru oružjem ložiti. I oplijenit će one koji su njih plijenili, opljačkati one koji su njih pljačkali - riječ je Jahve Gospoda.
11 ౧౧ “ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు.
U onaj ću dan dati Gogu za grob glasovito mjesto u Izraelu: dolinu Abarim, istočno od Mora, koja zatvara put prolaznicima; ondje će pokopati Goga i sve njegovo mnoštvo. I dolina će se prozvati Hamon-Gog.
12 ౧౨ దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.
I ukopavat će ih dom Izraelov, sedam mjeseci, da očisti svu zemlju;
13 ౧౩ ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.
pokapat će ih sav narod zemlje. I bit će im slavan dan u koji se proslavim, riječ je Jahve Gospoda.
14 ౧౪ దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు.
Izabrat će ljude da neprestano prolaze zemljom pa da s prolaznicima pokapaju one koji preostaše po zemlji, da je tako očiste.
15 ౧౫ దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.
I kad koji, prolazeći zemljom, vidi ljudske kosti, podignut će kraj njih nadgrobnik dok ih grobari ne ukopaju u dolini Hamon-Gog.
16 ౧౬ హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”
Hamona je ime i gradu. I tako će očistiti zemlju.
17 ౧౭ “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.
Sine čovječji, ovako govori Jahve Gospod: Reci pticama, svemu krilatom i svemu zvijerju: skupite se i dođite! Saberite se odasvud na žrtvu moju koju koljem za vas, na veliku gozbu po izraelskim gorama, da se najedete mesa i napijete krvi.
18 ౧౮ బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు.
Najedite se mesa od junaka i napijte se krvi zemaljskih knezova, ovnova, janjaca, jaraca, junaca, ugojene stoke bašanske!
19 ౧౯ మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి.
Najedite se do sita pretiline i napijte se krvi mojih klanica koje sam vam naklao.
20 ౨౦ నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Nasitite se za mojim stolom konja i konjanika, junaka i ratnika!' - riječ je Jahve Gospoda.
21 ౨౧ నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు.
'Tako ću se proslaviti među narodima, i svi će narodi vidjeti sud koji ću izvršiti i ruku što ću je na njih podići.
22 ౨౨ ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు.
Znat će dom Izraelov da sam ja, Jahve, Bog njihov - od toga dana zauvijek.
23 ౨౩ ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు.
I znat će narodi da dom Izraelov bijaše odveden u ropstvo zbog svojih nedjela: iznevjerio mi se, pa sakrih lice svoje od njih i predadoh ih njihovim neprijateljima u ruke da od mača poginu.
24 ౨౪ వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.
Postupih s njima po nečistoći njihovoj i nedjelima te sakrih lice svoje od njih.'
25 ౨౫ కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను.
Stoga ovako govori Jahve Gospod: 'Sad ću vratiti roblje Jakovljevo i pomilovati sav dom Izraelov - ljubomoran na ime svoje sveto,
26 ౨౬ వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.
oprostit ću im svu sramotu i nevjeru kojom mi se iznevjeriše dok još spokojno življahu u zemlji i nikoga ne bijaše da ih straši.
27 ౨౭ అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.
A kad ih dovedem iz naroda i skupim iz zemalja dušmanskih i na njima, naočigled mnogih naroda, svetost svoju pokažem,
28 ౨౮ వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
znat će da sam ja Jahve, Bog njihov, koji ih u izgnanstvo među narode odvedoh i koji ih opet skupljam u njihovu zemlju, ne ostavivši ondje nijednoga od njih.
29 ౨౯ అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
I nikada više neću kriti lica od njih, jer ću duh svoj izliti na dom Izraelov' - riječ je Jahve Gospoda.”

< యెహెజ్కేలు 39 >