< యెహెజ్కేలు 34 >
1 ౧ యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
And the word of the Lord came vnto me, saying,
2 ౨ “నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా!
Sonne of man, prophesie against the shepherdes of Israel, prophesie and say vnto them, Thus saieth the Lord God vnto the shepherds, Wo be vnto the shepherds of Israel, that feede them selues: should not the shepherds feede the flockes?
3 ౩ మీరు కొవ్విన గొర్రెలను వధించి, కొవ్వు తిని, బొచ్చును కప్పుకుంటారు. కానీ గొర్రెలను మేపరు.
Yee eate the fat, and yee clothe you with the wooll: yee kill them that are fed, but ye feede not the sheepe.
4 ౪ జబ్బు చేసిన వాటిని మీరు ఆదుకోలేదు. రోగంతో ఉన్న వాటిని మీరు బాగుచేయలేదు. గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రాలేదు. తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేకాక మీరు కఠినంగా క్రూరంగా వాటి మీద పెత్తనం చేశారు.
The weake haue ye not strengthened: the sicke haue ye not healed, neither haue ye bounde vp the broken, nor brought againe that which was driuen away, neither haue yee sought that which was lost, but with crueltie, and with rigour haue yee ruled them.
5 ౫ కాబట్టి, కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి.
And they were scattered without a shepherde: and when they were dispersed, they were deuoured of all the beastes of the fielde.
6 ౬ నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా ఎత్తయిన ప్రతి కొండ మీదా తిరిగాయి. నా గొర్రెలు ప్రపంచమంతా చెదరిపోయాయి. అయితే వాటిని ఎవరూ వెతకడం లేదు.”
My sheepe wandred through all the mountaines, and vpon euery hie hill: yea, my flocke was scattered through al the earth, and none did seeke or search after them.
7 ౭ కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి.
Therefore ye shepherds, heare the woorde of the Lord.
8 ౮ “కాపరులు లేకుండా నా గొర్రెలు దోపిడీకి గురై అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. కాపరులు నా గొర్రెలను వెదకలేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు. గొర్రెలను మేపరు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
As I liue, sayeth the Lord God, surely because my flocke was spoyled, and my sheepe were deuoured of all the beasts of the fielde, hauing no shepherde, neither did my shepherdes seeke my sheepe, but the shepherdes fedde them selues, and fedde not my sheepe,
9 ౯ కాబట్టి కాపరులారా యెహోవా మాట వినండి.
Therefore, heare ye the word of the Lord, O ye shepherds.
10 ౧౦ “యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Thus saieth the Lord God, Behold, I come against the shepherds, and will require my sheepe at their hands, and cause them to cease from feeding the sheepe: neither shall the shepherds feede them selues any more: for I wil deliuer my sheepe from their mouthes, and they shall no more deuoure them.
11 ౧౧ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను.
For thus sayeth the Lord God, Beholde, I will search my sheepe, and seeke them out.
12 ౧౨ తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,
As a shepherd searcheth out his flocke, when he hath bene among his sheepe that are scattered, so wil I seeke out my sheepe and wil deliuer them out of all places, where they haue beene scattered in the cloudie and darke day,
13 ౧౩ ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.
And I will bring them out from the people, and gather them from the countreis, and will bring them to their owne lande, and feede them vpon the mountaines of Israel, by the riuers, and in all the inhabited places of the countrey.
14 ౧౪ నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి.
I will feede them in a good pasture, and vpon the hie mountaines of Israel shall their folde be: there shall they lie in a good folde and in fat pasture shall they feede vpon the mountaines of Israel.
15 ౧౫ నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
I will feede my sheepe, and bring them to their rest, sayth the Lord God.
16 ౧౬ “తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.
I will seeke that which was lost, and bring againe that which was driue away, and will binde vp that which was broken, and will strengthen the weake but I wil destroy the fat and the strong, and I will feede them with iudgement.
17 ౧౭ నా మందా, మీ విషయం యెహోవా ప్రభువును, నేను, ఇలా చెబుతున్నాను. గొర్రెలకూ పొట్టేళ్లకూ మేకలకూ మధ్య నేను న్యాయాధికారిగా ఉంటాను.
Also you my sheepe, Thus saieth the Lord God, behold, I iudge betweene sheepe, and sheepe, betweene the rammes and the goates.
18 ౧౮ పచ్చిక మైదానాల్లో మంచి మేత మేయడం మీకు చాలదా? మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కాలా?
Seemeth it a small thing vnto you to haue eaten vp the good pasture, but yee must treade downe with your feete the residue of your pasture? and to haue drunke of the deepe waters, but yee must trouble the residue with your feete?
19 ౧౯ మీరు స్వచ్ఛమైన నీళ్ళు తాగి, మిగతా నీళ్ళు కాళ్ళతో కెలికి మురికిచేయాలా? మీరు కాళ్లతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేస్తున్నాయి. మీరు మీ కాళ్ళతో కలకలు చేసిన నీళ్ళు అవి తాగుతున్నాయి.
And my sheepe eate that which yee haue troden with your feete, and drinke that which ye haue troubled with your feete.
20 ౨౦ కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు, నేనే స్వయంగా కొవ్విన గొర్రెలకూ చిక్కిపోయిన గొర్రెలకూ మధ్య భేదం చూసి తీర్పు తీరుస్తాను.
Therefore thus sayth the Lord God vnto them, behold, I, euen I wil iudge betweene the fat sheepe and the leane sheepe.
21 ౨౧ మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.
Because ye haue thrust with side and with shoulder, and pusht al the weake with your hornes, till ye haue scattered them abroade,
22 ౨౨ కాబట్టి ఇకనుంచి నా మంద దోపిడీ కాకుండా వాటిని రక్షిస్తాను. గొర్రె గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను.
Therefore wil I helpe my sheepe, and they shall no more be spoyled, and I wil iudge betweene sheepe and sheepe.
23 ౨౩ వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
And I wil set vp a shepherd ouer them, and he shall feede them, euen my seruant Dauid, he shall feede them, and he shalbe their shepherd.
24 ౨౪ నేను, యెహోవాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
And I the Lord will be their God, and my seruant Dauid shalbe the prince amog them. I the Lord haue spoken it.
25 ౨౫ అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.
And I will make with them a couenant of peace, and will cause the euil beastes to cease out of the land: and they shall dwel safely in the wildernesse, and sleepe in the woods.
26 ౨౬ నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే.
And I wil set them, as a blessing, euen roud about my mountaine: and I will cause rayne to come downe in due season, and there shalbe raine of blessing.
27 ౨౭ పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.
And the tree of the fielde shall yeeld her fruite, and the earth shall giue her fruite, and they shalbe safe in their land, and shall know that I am the Lord, when I haue broken the cordes of their yoke, and deliuered them out of the hands of those that serued themselues of them.
28 ౨౮ ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు.
And they shall no more be spoyled of the heathen, neither shall the beastes of the land deuoure them, but they shall dwell safely and none shall make them afrayd.
29 ౨౯ వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.
And I will rayse vp for them a plant of renoume, and they shalbe no more consumed with hunger in the land, neither beare the reproche of the heathen any more.
30 ౩౦ అప్పుడు నేను వారి దేవుడు యెహోవాననీ నేను వారికి తోడుగా ఉన్నాననీ తెలుసుకుంటారు. వాళ్ళు నా ప్రజలు. ఇశ్రాయేలీయులు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Thus shall they vnderstande, that I the Lord their God am with them, and that they, euen the house of Israel, are my people, sayth the Lord God.
31 ౩౧ మీరు నా గొర్రెలు. నేను మేపే గొర్రెలు. నా ప్రజలు! నేను మీ దేవుణ్ణి. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
And yee my sheepe, the sheepe of my pasture are men, and I am your God, saith the Lord God.