< యెహెజ్కేలు 32 >
1 ౧ బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
十二年十二月初一日,耶和华的话临到我说:
2 ౨ నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. నదిలో మొసలివంటి వాడివి. నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”
“人子啊,你要为埃及王法老作哀歌,说: 从前你在列国中,如同少壮狮子; 现在你却像海中的大鱼。 你冲出江河, 用爪搅动诸水, 使江河浑浊。
3 ౩ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, “నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.
主耶和华如此说: 我必用多国的人民, 将我的网撒在你身上, 把你拉上来。
4 ౪ నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను. గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.
我必将你丢在地上, 抛在田野, 使空中的飞鸟都落在你身上, 使遍地的野兽吃你得饱。
5 ౫ నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.
我必将你的肉丢在山间, 用你高大的尸首填满山谷。
6 ౬ నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. వాగులు రక్తంతో నిండుతాయి.
我又必用你的血浇灌你所游泳之地, 漫过山顶; 河道都必充满。
7 ౭ నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.
我将你扑灭的时候, 要把天遮蔽, 使众星昏暗, 以密云遮掩太阳, 月亮也不放光。
8 ౮ నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
我必使天上的亮光都在你以上变为昏暗, 使你的地上黑暗。 这是主耶和华说的。
9 ౯ “నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.
“我使你败亡的风声传到你所不认识的各国。那时,我必使多民的心因你愁烦。
10 ౧౦ నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”
我在许多国民和君王面前向你抡我的刀,国民就必因你惊奇,君王也必因你极其恐慌。在你仆倒的日子,他们各人为自己的性命时刻战兢。”
11 ౧౧ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!
主耶和华如此说:“巴比伦王的刀必临到你。
12 ౧౨ శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.
我必借勇士的刀使你的众民仆倒;这勇士都是列国中强暴的。 他们必使埃及的骄傲归于无有; 埃及的众民必被灭绝。
13 ౧౩ సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.
我必从埃及多水旁除灭所有的走兽; 人脚兽蹄必不再搅浑这水。
14 ౧౪ అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
那时,我必使埃及河澄清, 江河像油缓流。 这是主耶和华说的。
15 ౧౫ “నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
我使埃及地变为荒废凄凉; 这地缺少从前所充满的, 又击杀其中一切的居民。 那时,他们就知道我是耶和华。
16 ౧౬ ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
“人必用这哀歌去哀哭,列国的女子为埃及和她的群众也必以此悲哀。这是主耶和华说的。”
17 ౧౭ పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.
十二年十二月十五日,耶和华的话临到我说:
18 ౧౮ నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.
“人子啊,你要为埃及群众哀号,又要将埃及和有名之国的女子,并下坑的人,一同扔到阴府去。
19 ౧౯ వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’
你埃及的美丽胜过谁呢? 你下去与未受割礼的人一同躺卧吧!
20 ౨౦ కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.
他们必在被杀的人中仆到。她被交给刀剑,要把她和她的群众拉去。
21 ౨౧ పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’ (Sheol )
强盛的勇士要在阴间对埃及王和帮助他的说话;他们是未受割礼被杀的人,已经下去,躺卧不动。 (Sheol )
22 ౨౨ అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.
“亚述和她的众民都在那里,她民的坟墓在她四围;他们都是被杀倒在刀下的。
23 ౨౩ దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.
他们的坟墓在坑中极深之处。她的众民在她坟墓的四围,都是被杀倒在刀下的;他们曾在活人之地使人惊恐。
24 ౨౪ ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు. వాళ్ళు సిగ్గు పాలవుతారు.
“以拦也在那里,她的群众在她坟墓的四围,都是被杀倒在刀下、未受割礼而下阴府的;他们曾在活人之地使人惊恐,并且与下坑的人一同担当羞辱。
25 ౨౫ చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.
人给她和她的群众在被杀的人中设立床榻。她民的坟墓在她四围,他们都是未受割礼被刀杀的;他们曾在活人之地使人惊恐,并且与下坑的人一同担当羞辱。以拦已经放在被杀的人中。
26 ౨౬ అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.
“米设、土巴,和她们的群众都在那里。她民的坟墓在她四围,他们都是未受割礼被刀杀的;他们曾在活人之地使人惊恐。
27 ౨౭ వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. (Sheol )
他们不得与那未受割礼仆倒的勇士一同躺卧;这些勇士带着兵器下阴间,头枕刀剑,骨头上有本身的罪孽;他们曾在活人之地使勇士惊恐。 (Sheol )
28 ౨౮ కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.
“法老啊,你必在未受割礼的人中败坏,与那些被杀的人一同躺卧。
29 ౨౯ అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.
“以东也在那里。她君王和一切首领虽然仗着势力,还是放在被杀的人中;他们必与未受割礼的和下坑的人一同躺卧。
30 ౩౦ అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.
“在那里有北方的众王子和一切西顿人,都与被杀的人下去。他们虽然仗着势力使人惊恐,还是蒙羞。他们未受割礼,和被刀杀的一同躺卧,与下坑的人一同担当羞辱。
31 ౩౧ కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
“法老看见他们,便为他被杀的军队受安慰。这是主耶和华说的。
32 ౩౨ “సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
我任凭法老在活人之地使人惊恐,法老和他的群众必放在未受割礼和被杀的人中。这是主耶和华说的。”