< యెహెజ్కేలు 31 >
1 ౧ బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
EIA hoi kekahi, i ka makahiki umikumamakahi, i ka malama kolu, i ka la mua o ka malama; hiki mai la ka olelo a Iehova ia'u, i mai la,
2 ౨ “నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు. ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?
E ke keiki a ke kanaka, e olelo aku oe ia Parao ko Aigupita alii, a me kona lehulehu, Owai la ka mea e like ai me oe i kou nui ana?
3 ౩ అష్షూరు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో, విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది. దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది.
Aia hoi, o ka Asuria, he laau kedera no Lebanona ia, he nani kona mau lala, he ululaau malumalu, he kino kiekie; aia hoi kona welau iwaena o na lala paapu.
4 ౪ నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి. వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి.
Na na wai i hoonui ia ia, ua hookiekie ka hohonu ia ia me kona mau waikahe e kahe ana a puni kona wahi i kanuia'i, a ua hoopuka ae i kona mau kahawai liilii i na kumu laau a pau.
5 ౫ ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది. దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
Nolaila i hookiekieia'i kona kiekie, maluna o na laau a pau o ke kula, a ua hoonuiia kona mau lala, a loloa ae la kona mau lala no ka nui o kona mau wai, i kona kupu ana'e.
6 ౬ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి. దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.
Maloko o kona mau lala i hana aku ai na manu a pau o ka lewa i ko lakou mau punana, a maloko iho o kona mau lala i hanau ai na holoholona a pau o ke kula i ka lakou mau keiki, a malalo iho o kona mala i noho ai na lahuikanaka nui a pau.
7 ౭ నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది.
Nolaila i nani ai ia i kona nui, a me ka loloa ana o kona mau lala; no ka mea, aia kona kumu ma na wai nui.
8 ౮ దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు. సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు. దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు!
Aole i hiki i ke kedera iloko o ka mala a ke Akua, ke hoonalo ia ia; aole like ka laau hukaa me kona mau lala, aole like ka laau pelatano me kona mau lala; aole laau iloko o ka mala a ke Akua i like me ia i kona nani.
9 ౯ అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను. అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”
Ua hana aku au ia ia i nani no ka nui loa o kona mau lala, i huahua hoi na laau a pau o Edena iloko o ka mala a ke Akua ia ia.
10 ౧౦ అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “అది ఎంతో ఎత్తుగా ఉంది కాబట్టి, దాని కొన మిగతా వృక్షాలన్నిటిలో కంటే ఎత్తుగా ఉంది కాబట్టి, గర్వించింది.
No ia mea la, ke olelo mai nei Iehova ka Haku, No kou hookiekie ana ia oe iho i kiekie; a hoopuka aku oia i kona welau iwaena o na lala paapu, a ua hookiekie kona naau i kona kiekie;
11 ౧౧ కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. ఈ అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు.
Nolaila i haawi aku au ia ia i ka lima o ka mea mana no na lahuikanaka, e hana no oia ia ia; ua kipaku aku au ia ia no kona hewa.
12 ౧౨ రాజ్యాలన్నిటిలో అతి క్రూరమైన విదేశీయులు అతన్ని నరికి పారవేశారు. అతని కొమ్మలు కొండల మీద, లోయల్లో పడ్డాయి. అతని శాఖలు భూమి మీదున్న అన్ని వాగుల్లో విరిగి పడ్డాయి. అప్పుడు భూరాజ్యాలన్నీ దాని నీడనుంచి వెళ్లి అతణ్ణి వదిలేశాయి.
A o na malihini, na mea weliweli o na lahuikanaka, ua oki aku lakou ia ia, a waiho aku ia ia ma na mauna, a ua haule kona mau lala ma na awawa a pau, a ua hakihaki kona mau lala ma na muliwai o ka honua, a iho iho la na lahuikanaka a pau o ka honua mai kona malu iho, a ua haalele ia ia.
13 ౧౩ అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ వాలాయి. అతని కొమ్మల్లో భూజంతువులన్నీ ఉన్నాయి.
A e noho na manu a pau o ka lewa maluna o kona puu opala, a me na holoholona o ke kula maluna o kona mau lala;
14 ౧౪ నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అతిశయంతో అంత ఎత్తుకు ఎదగకుండా ఇది జరిగింది. దాని కొనలు మిగతా వృక్షాలకంటే ఎత్తుగా ఉండకుండాా, నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అంత ఎత్తుకు ఎదగకుండా ఉంటుంది. సాధారణ మనుషులు చనిపోయినట్టుగా అవన్నీ చస్తాయి.”
I mea e hookiekie ole ai kekahi o na laau a pau ma na wai, no ko lakou kiekie, aole hoi e hoopuka i ko lakou welau mawaena o na lala paapu, aole hoi e ku iluna ko lakou mau laau i ko lakou kiekie, o na mea a pau e inu ana i ka wai; no ka mea, ua haawiia lakou a pau i ka make i ko lalo mau wahi o ka honua iwaena o na keiki a kanaka, me na mea e iho ana i ka lua.
15 ౧౫ యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి. (Sheol )
Ke i mai nei Iehova ka Haku penei; i ka la i iho ai ia i ka luakupapau, hana hoi au e kanikau; ua uhi au i ka hohonu nona, a ua kaohi au i kona mau muliwai, a ua hoopaaia na wai nui; a hana aku au e kanikau o Lebauona nona, a maule ae la na laau a pau o ke kula nona. (Sheol )
16 ౧౬ అతని పతనం వల్ల కలిగే చప్పుడు విని ప్రజలు వణికిపోయేలా చేశాను. చచ్చిన వాళ్ళుండే గుంటలో అతన్ని విసిరేశాను. పల్లం ప్రాంతాల్లో ఉన్న ఏదెను చెట్లన్నిటినీ నేను ఓదార్చాను. ఇవన్నీ లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి వృక్షాలు. (Sheol )
Ua hoohaalulu au i na lahuikanaka i ka halulu ana o kona haule ana, i kuu wa i hoolei iho ai au ia ia i ka po, me ka poe e iho ana i ka lua; a e oluolu pu na laau a pau i ko lalo wahi o ka honua, na laau a pau o Edena, o na mea i waeia a he maikai o Lebanona, a me na mea a pau e inuwai ana. (Sheol )
17 ౧౭ వాళ్ళు కూడా కత్తితో చచ్చిన వారి దగ్గరికి అతనితో కూడా పాతాళానికి దిగిపోయారు. వీరంతా అతని నీడలో నివసించిన వాళ్ళు, అతనికి సహాయం చేసిన వాళ్ళు. (Sheol )
E iho iho la lakou me ia i ka po, i ka poe i pepehiia me ka pahikaua, a o ka poe i lilo i lima nona, a noho iho la malalo iho o kona malu, iwaenakonu o na lahuikanaka. (Sheol )
18 ౧౮ ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Owai la kou mea e like ai i ka nani, a me ka nui iwaena o na laau o Edena? aka, e hooiho oe ilalo me na laau o Edena i ko lalo mau wahi o ka honua: a e moe oe iwaena o ka poe okipoepoe ole ia me ka poe i pepehiia me ka pahikaua. Oia hoi, o Parao a me kona lehulehu a pau, wahi a Iehova ka Haku.