< యెహెజ్కేలు 30 >
1 ౧ యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
Un Tā Kunga vārds uz mani notika sacīdams:
2 ౨ “నరపుత్రుడా, ప్రవచిస్తూ ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ‘అయ్యో! రాబోతున్న ఆ రోజు ఎంత భయంకరం.’
Cilvēka bērns, sludini un saki: tā saka Tas Kungs Dievs: kauciet: Ak vai, tai dienai!
3 ౩ ఆ రోజు వచ్చేసింది! యెహోవా కోసం ఆ రోజు వచ్చింది! అది మబ్బులు కమ్మే రోజు. రాజ్యాలు పతనమయ్యే రోజు!
Jo tā diena ir tuvu, tiešām Tā Kunga diena ir tuvu, diena tumši apmākusies, pagānu laiks ir klāt.
4 ౪ అప్పుడు ఐగుప్తు దేశం మీద కత్తి పడుతుంది. ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు కూలిపోతుంటే కూషు దేశస్థులు వేదన పడతారు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొడతారు!
Un zobens nāks Ēģiptes zemē, un Moru zemē būs lielas sāpes, kad kautie kritīs Ēģiptes zemē, un viņas pulki taps aizvesti, un viņas pamati taps nolauzti.
5 ౫ కూషీయులు, పూతీయులు, లూదీయులు, విదేశీయులు నిబంధన ప్రజలంతా కత్తితో కూలుతారు!
Moru zeme un Libija un Lidija un visādi ļaudis un Kubs un tās derības zemes bērni kritīs līdz ar viņiem caur zobenu.
6 ౬ యెహోవా తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తుకు అండగా ఉండే వాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది. మిగ్దోలు నుండి సెవేనే వరకూ ప్రజలు కత్తితో కూలుతారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Tā saka Tas Kungs: tiešām, Ēģiptes palīgi kritīs, un viņas lepnais stiprums taps nogāzts, no Migdolas līdz Ziēnei tie tur kritīs caur zobenu, saka Tas Kungs Dievs.
7 ౭ పాడైపోయిన దేశాల మధ్య వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఉంటారు. శిథిలాల పట్టణాల మధ్య వారి పట్టణాలుంటాయి.
Un tie taps postīti vidū starp postītām zemēm, un viņu pilsētas būs starp postītām pilsētām;
8 ౮ ఐగుప్తు దేశంలో అగ్ని రగిలించి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తే అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
Un tie samanīs, ka Es esmu Tas Kungs, kad Es uguni kuršu Ēģiptes zemē, un visi viņas palīgi taps satriekti.
9 ౯ ఆ రోజు వార్తాహరులు నా దగ్గర నుంచి ఓడల్లో బయలుదేరి సురక్షితంగా ఉన్న కూషును భయపెడతారు. ఐగుప్తు పతనమయ్యే రోజున వారికి భయభ్రాంతులు పుడతాయి. అదిగో! అది వస్తూ ఉంది.
Tai dienā no Manis izies vēstneši ar laivām, iztrūcināt Moru zemi, kas droši dzīvo, un pie tiem būs lielas bēdas, tā kā Ēģiptes dienā, jo redzi, (tie) nāk!
10 ౧౦ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు నెబుకద్నెజరు వలన ఐగుప్తులో ఇక ఏ మాత్రం జనాభా ఉండరు.
Tā saka Tas Kungs Dievs: tiešām, Es nobeigšu Ēģiptes pulkus caur Nebukadnecara, Bābeles ķēniņa, roku.
11 ౧౧ ఆ దేశాన్ని నాశనం చేయడానికి, అతడు తన సైన్యాన్ని తోడుకుని వస్తాడు. అతనికి రాజ్యాలన్నీ భయపడిపోతాయి. ఐగుప్తీయులను చంపడానికి వారు తమ కత్తులు దూసి చచ్చిన వాళ్ళతో దేశాన్ని నింపుతారు.
Šis un viņa ļaudis līdz ar viņu, tie visbriesmīgākie starp tautām, taps atvesti, postīt zemi, un izvilks savus zobenus pret Ēģipti un piepildīs zemi ar nokautiem.
12 ౧౨ నదులను ఎండగొట్టి ఆ నేను ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మి వేస్తాను. విదేశీయులతో నేను ఆ దేశాన్ని, దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
Un Es upes darīšu sausas un zemi pārdošu tiem nikniem rokā, un zemi un kas tur ir, Es izpostīšu caur svešinieku roku; Es Tas Kungs to esmu runājis.
13 ౧౩ యెహోవా ఇలా చెబుతున్నాడు. “విగ్రహాలను నేను నాశనం చేస్తాను. మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. ఇక ఐగుప్తు దేశంలో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.
Tā saka Tas Kungs Dievs: un Es izdeldēšu tos elkus un darīšu galu Nofas(Memfisas) dievekļiem, un valdnieka vairs nebūs Ēģiptes zemē; un Es sūtīšu izbailes pār Ēģiptes zemi.
14 ౧౪ పత్రోసును పాడు చేస్తాను. సోయనులో నిప్పు పెడతాను. తేబేస్ మీదికి శిక్ష పంపిస్తాను.
Un Es izpostīšu Patrus zemi, un kuršu uguni Coanā, un turēšu tiesu Noā:
15 ౧౫ ఐగుప్తుకు కోటగా ఉన్న పెలుసియం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. తేబేస్ లోని అనేకమందిని నిర్మూలం చేస్తాను.
Un Es izgāzīšu Savu bardzību pār Sinu, Ēģiptes stiprumu, un izdeldēšu tos pulkus Noā.
16 ౧౬ ఆ తరువాత ఐగుప్తును కాల్చివేస్తాను. పెలుసియం వాళ్ళు వేదనతో అల్లాడిపోతారు. తేబిస్ చిన్నాభిన్నమవుతుంది. ప్రతిరోజూ మెంఫిస్ పై శత్రువులు దాడి చేస్తారు.
Un iededzināšu uguni Ēģiptes zemē; Sina cietīs lielas sāpes, un No taps sašķelta, un Nofa dienas vidū taps spaidīta.
17 ౧౭ హీలియోపోలిస్, బుబాస్తిస్ పట్టణాల్లోని యువకులు కత్తితో కూలుతారు. ఆ పట్టణ ప్రజలు బందీలుగా పోతారు.
Avenas un Pibozetes jaunekļi kritīs caur zobenu, un pašas aizies cietumā.
18 ౧౮ ఐగుప్తు మోపిన కాడిని నేను తహపనేసులో విరిచే రోజున చీకటి కమ్ముకుంటుంది. గర్వంతో కూడిన ఐగుప్తీయుల బలం అక్కడ అంతమవుతుంది. దాన్ని మబ్బు కమ్ముకుంటుంది. దాని కూతుర్లు బందీలుగా పోతారు.
Un Takvanesā gaisma taps aptumšota, kad Es Ēģiptes jūgu tur salauzīšu un viņas lepno stiprumu tur nobeigšu; mākonis viņu apklās, un viņas meitas ies cietumā.
19 ౧౯ నేను ఐగుప్తీయులకు శిక్ష విధిస్తే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
Tā Es turēšu tiesu Ēģiptes zemē, lai tie atzīst, ka Es esmu Tas Kungs.
20 ౨౦ పదకొండవ ఏడు మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
Un vienpadsmitā gadā, pirmā mēnesī, septītā mēneša dienā Tā Kunga vārds uz mani notika sacīdams:
21 ౨౧ నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు ఫరో చేతిని విరగ గొట్టాను. అది బాగుపడేలా ఎవరూ దానికి కట్టు కట్టరు. కత్తి పట్టుకునే బలం దానికి లేదు.”
Cilvēka bērns! Faraona, Ēģiptes ķēniņa, elkoni Es esmu satriecis, un redzi, to nesasies, plāksteri neuzliks, ar autiem neaptīs, un tas vairs neatspirgs, ka varētu zobenu turēt.
22 ౨౨ కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేను ఐగుప్తురాజు ఫరో చేతులను విరిచేస్తాను. అతని బలమైన చేతినీ, విరిగిన చేతినీ విరగ గొట్టి, అతని చేతిలోనుంచి కత్తి జారిపోయేలా చేస్తాను.
Tāpēc tā saka Tas Kungs Dievs: redzi, Es celšos pret Faraonu, Ēģiptes ķēniņu, un satriekšu viņa elkoņus, to stipro kā to satriekto, un Es viņa zobenam likšu izkrist no viņa rokas.
23 ౨౩ అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.
Un Es ēģiptiešus izkaisīšu starp tautām un tos izputināšu pa zemēm.
24 ౨౪ ఫరో చేతులను నేను విరగ గొట్టడానికి, బబులోను రాజు చేతులను బలపరచి నా కత్తి అతని చేతికిస్తాను. బబులోను రాజు చూస్తూ ఉండగా ఫరో చావు దెబ్బతిన్న వాడి లాగా మూలుగుతాడు.
Un Es stiprināšu Bābeles ķēniņa elkoņus, un Savu zobenu došu viņa rokā, bet Faraona elkoņus Es satriekšu, ka tam viņa priekšā būs vaidēt, tā kā ievainots vaid.
25 ౨౫ బబులోను రాజు చేతులను నేను బలపరుస్తాను. ఫరో చేతులు పడిపోతాయి. ఐగుప్తు దేశం మీద చాపడానికి నేను నా కత్తిని బబులోను రాజు చేతికిస్తే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.
Tiešām, Es stiprināšu Bābeles ķēniņa elkoņus, bet Faraona elkoņi nogurs, un tie samanīs, ka Es esmu Tas Kungs, kad Es Savu zobenu došu Bābeles ķēniņam rokā, un viņš to pacels pār Ēģiptes zemi.
26 ౨౬ నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తును రాజ్యాల్లో చెదర గొట్టి వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.”
Un Es izkaisīšu ēģiptiešus starp tautām un tos izputināšu pa zemēm, lai tie atzīst, ka Es esmu Tas Kungs.