< యెహెజ్కేలు 27 >
1 ౧ యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.
耶和華的話又臨到我說:
2 ౨ నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.
「人子啊,要為泰爾作起哀歌,
3 ౩ సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.
說:你居住海口,是眾民的商埠;你的交易通到許多的海島。主耶和華如此說: 泰爾啊,你曾說: 我是全然美麗的。
4 ౪ నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.
你的境界在海中, 造你的使你全然美麗。
5 ౫ నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.
他們用示尼珥的松樹做你的一切板, 用黎巴嫩的香柏樹做桅杆,
6 ౬ బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.
用巴珊的橡樹做你的槳, 用象牙鑲嵌基提海島的黃楊木為坐板。
7 ౭ నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!
你的篷帆是用埃及繡花細麻布做的, 可以做你的大旗; 你的涼棚是用以利沙島的藍色、紫色布做的。
8 ౮ సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు. నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.
西頓和亞發的居民作你盪槳的。 泰爾啊,你中間的智慧人作掌舵的。
9 ౯ బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు. సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.
迦巴勒的老者和聰明人 都在你中間作補縫的; 一切泛海的船隻和水手 都在你中間經營交易的事。
10 ౧౦ పారసీక దేశస్థులు, లూదు వాళ్ళు, పూతు వాళ్ళు నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వాళ్ళు నీ డాళ్లనూ శిరస్త్రాణాలనూ నీలో వేలాడదీశారు. వాళ్ళు నీకు శోభ తెచ్చారు.
「波斯人、路德人、弗人在你軍營中作戰士;他們在你中間懸掛盾牌和頭盔,彰顯你的尊榮。
11 ౧౧ అర్వదు వాళ్ళు, హెలెక్ వాళ్ళు, నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడల మీద ఉన్నారు. గమ్మాదు వాళ్ళు నీ ప్రాకారాల్లో ఉన్నారు. వీరంతా తమ డాళ్లు నీ గోడల మీద, చుట్టూ తగిలించారు. నీ సౌందర్యాన్ని లోపం లేనిదిగా చేశారు.
亞發人和你的軍隊都在你四圍的牆上,你的望樓也有勇士;他們懸掛盾牌,成全你的美麗。
12 ౧౨ రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.
「他施人因你多有各類的財物,就作你的客商,拿銀、鐵、錫、鉛兌換你的貨物。
13 ౧౩ యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
雅完人、土巴人、米設人都與你交易;他們用人口和銅器兌換你的貨物。
14 ౧౪ బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
陀迦瑪族用馬和戰馬並騾子兌換你的貨物。
15 ౧౫ దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.
底但人與你交易,許多海島作你的碼頭;他們拿象牙、烏木與你兌換。
16 ౧౬ నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
亞蘭人因你的工作很多,就作你的客商;他們用綠寶石、紫色布繡貨、細麻布、珊瑚、紅寶石兌換你的貨物。
17 ౧౭ యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
猶大和以色列地的人都與你交易;他們用米匿的麥子、餅、蜜、油、乳香兌換你的貨物。
18 ౧౮ దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
大馬士革人因你的工作很多,又因你多有各類的財物,就拿黑本酒和白羊毛與你交易。
19 ౧౯ ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.
威但人和雅完人拿紡成的線、亮鐵、桂皮、菖蒲兌換你的貨物。
20 ౨౦ దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
底但人用高貴的毯子、鞍、屜與你交易。
21 ౨౧ అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
阿拉伯人和基達的一切首領都作你的客商,用羊羔、公綿羊、公山羊與你交易。
22 ౨౨ షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.
示巴和拉瑪的商人與你交易,他們用各類上好的香料、各類的寶石,和黃金兌換你的貨物。
23 ౨౩ హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.
哈蘭人、干尼人、伊甸人、示巴的商人,和亞述人、基抹人與你交易。
24 ౨౪ వీళ్ళు నీ బజారుల్లో అందమైన దుస్తులూ ఊదారంగు కుట్టుపనితో చేసిన బట్టలూ రంగు రంగుల తివాచీలు, గట్టిగా పేనిన తాళ్ళు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
這些商人以美好的貨物包在繡花藍色包袱內,又有華麗的衣服裝在香柏木的箱子裏,用繩捆着與你交易。
25 ౨౫ తర్షీషు ఓడలు నీ సరుకులను వేర్వేరు స్థలాలకు తీసుకుపోయేవి. నువ్వు విస్తారమైన నీ సరుకులతో సముద్రం మధ్యలో కూర్చున్నావు.
他施的船隻接連成幫為你運貨, 你便在海中豐富極其榮華。
26 ౨౬ తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.
盪槳的已經把你盪到大水之處, 東風在海中將你打破。
27 ౨౭ నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు, నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు, నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు.
你的資財、物件、貨物、 水手、掌舵的、 補縫的、經營交易的, 並你中間的戰士和人民, 在你破壞的日子必都沉在海中。
28 ౨౮ నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన సముద్ర తీర పట్టణాలు కంపిస్తాయి.
你掌舵的呼號之聲一發, 郊野都必震動。
29 ౨౯ తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.
凡盪槳的和水手, 並一切泛海掌舵的, 都必下船登岸。
30 ౩౦ తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.
他們必為你放聲痛哭, 把塵土撒在頭上, 在灰中打滾;
31 ౩౧ నీకోసం తమ తలలు బోడి చేసుకుని మొలకు గోనె పట్టా కట్టుకుని మనో వేదనతో నీ కోసం ఎంతో దుఖిస్తారు.
又為你使頭上光禿, 用麻布束腰, 號咷痛哭, 苦苦悲哀。
32 ౩౨ వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు, తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది.
他們哀號的時候, 為你作起哀歌哀哭, 說:有何城如泰爾? 有何城如她在海中成為寂寞的呢?
33 ౩౩ సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది. నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.
你由海上運出貨物, 就使許多國民充足; 你以許多資財、貨物 使地上的君王豐富。
34 ౩౪ అయితే నువ్వు అగాధజలాల్లో మునిగి సముద్ర బలంతో బద్దలయ్యావు. నీ వ్యాపారం, నీ బలగమంతా మునిగిపోయింది.
你在深水中被海浪打破的時候, 你的貨物和你中間的一切人民, 就都沉下去了。
35 ౩౫ నిన్ను బట్టి సముద్ర తీరప్రాంత ప్రజలంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాందోళనతో వణికారు. వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.
海島的居民為你驚奇; 他們的君王都甚恐慌, 面帶愁容。
36 ౩౬ ప్రజల్లోని వ్యాపారులు నిన్నుహేళన చేస్తారు. నువ్వు భయభ్రాంతులు చెందావు. నీవిక ఎంత మాత్రం ఉనికిలో ఉండవు.
各國民中的客商都向你發嘶聲; 你令人驚恐, 不再存留於世,直到永遠。」