< యెహెజ్కేలు 24 >
1 ౧ బబులోను చెరలో ఉన్న కాలంలో, తొమ్మిదో సంవత్సరం, పదో నెల, పదో రోజు యెహోవా వాక్కు నాకు మళ్ళీ ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
Afe a ɛtɔ so nkron no bosome a ɛtɔ so edu no dadu so, Awurade asɛm baa me nkyɛn sɛ:
2 ౨ “నరపుత్రుడా, ఈ రోజు పేరు రాసి ఉంచుకో. కచ్చితంగా ఈ రోజే బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు.
“Onipa ba, twerɛ saa ɛda yi, saa ɛda yi ara, ɛfiri sɛ Babiloniahene atua Yerusalem ɛnnɛ dua yi ara.
3 ౩ తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.
Ka kyerɛ saa atuatefoɔ efie yi, ka no wɔ abɛbuo mu kyerɛ wɔn sɛ: ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: “‘Fa ɛsɛn no si ogya so; fa si so na hwie nsuo gu mu.
4 ౪ తొడ, జబ్బ మొదలైన మంచి ముక్కలన్నీ అందులో వేసి, మంచి ఎముకలు ఏరి దాన్ని నింపు.
Fa nankum no gu mu, nankum a ɛyɛ akɔnnɔ no nyinaa, nnyawa ne abasa. Fa nnompe a ɛte apɔ hyɛ no ma;
5 ౫ మందలో శ్రేష్ఠమైన వాటిని తీసికో. దానిలో ఉన్న ఎముకలు ఉడికేలా ఎక్కువ కట్టెలు పోగు చెయ్యి, దాన్ని బాగా పొంగించు. ఎముకలు ఉడికేలా పొంగించు.
fa nnwankuo no mu deɛ ɔdi mu. Fa nnyentia hyehyɛ aseɛ ma nnompe no; ma ɛnhuru na noa nnompe a ɛwɔ mu no.
6 ౬ కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, రక్త నగరానికి బాధ. మడ్డి గల ఆ కుండకు బాధ తప్పదు. దానిలోనుంచి ఆ మడ్డి పోదు. దానికోసం చీటీలు వెయ్యకుండా వండిన దాన్ని ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసుకో.
“‘Na sei na Otumfoɔ Awurade seɛ: “‘Mogyahwiegu kuropɔn no nnue, nnome nka ɛsɛn a awe nnaakye seesei, na deɛ ɛwɔ mu aka mu no! Yiyi nankum no mmaako mmaako firi mu a wommɔ so ntonto.
7 ౭ దాని రక్తం దాని మధ్యనే ఉంది. అది దాన్ని నున్నటి బండ మీద ఉంచింది. మట్టితో దాన్ని కప్పేందుకు వీలుగా ఆ రక్తాన్ని నేల మీద కుమ్మరించ లేదు.
“‘Mogya a ɔhwie guiɛ no wɔ ne mfimfini: ɔhwie guu ɔbotan wesee so; wanhwie angu fam, baabi a mfuturo bɛkata soɔ.
8 ౮ కాబట్టి దాని విషయం కోపాగ్ని రేకెత్తించి ప్రతీకారం తీర్చుకోవాలని, అది చిందించిన రక్తం మట్టితో కప్పకుండా దాన్ని ఆ నున్నటి బండ మీద నేను ఉండనిచ్చాను.”
Sɛ ɛbɛhwanyan abufuhyeɛ ama aweretɔ enti mede ne mogya guu ɔbotan wesee so sɛdeɛ ɛso renkata.
9 ౯ కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆ నెత్తురు నగరానికి బాధ. నేను కూడా మరి ఎక్కువ కట్టెలు పేర్చబోతున్నాను.
“‘Enti yei ne deɛ Otumfoɔ Awurade seɛ: “‘Mogyahwiegu kuropɔn no nnue! Me nso mɛhyehyɛ nnyensin no akɔ sorosoro.
10 ౧౦ కట్టెలు ఎక్కువ చెయ్యి! అగ్ని రాజెయ్యి! మాంసాన్ని బాగా ఉడకబెట్టు. మాంసం బాగా ఉడికించి మసాలా కలిపి పులుసు పెట్టు! ఎముకలు బాగా మగ్గనివ్వు!
Enti hyehyɛ nnyensin no na sɔ ogya no. Noa ɛnam no yie, fa ahwanhwanneɛ fra mu; na ma nnompe no nhye.
11 ౧౧ తరువాత ఖాళీ గిన్నె పొయ్యి మీద పెట్టు. అప్పుడు దానికున్న అశుద్ధం, మడ్డీ కరిగిపోతాయి. అది వేడై ఆ కంచును కాల్చే వరకూ ఆ గిన్నె పొయ్యి మీదే ఉంచు.
Afei, fa ɛsɛn hunu si ogyasramma no so kɔsi sɛ ɛbɛdɔ na ayɛ kɔɔ sɛdeɛ emu fi no bɛnane na deɛ ɛwɔ mu no bɛhye asɛeɛ.
12 ౧౨ అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి ఆ తుప్పు పోలేదు.
Wama ɔbrɛ no nyinaa ayɛ kwa; emu fi dodoɔ no ankɔ, ogya mpo antumi annyi.
13 ౧౩ నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.
“‘Ɛfi a ɛwɔ wo mu no ne aniwudeyɛ. Mebɔɔ mmɔden sɛ mɛhohoro wo ho, nanso woamma ho ɛkwan, wo ho remfi bio kɔsi sɛ mʼabufuhyeɛ a ɛtia woɔ no ano bɛdwo.
14 ౧౪ యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.”
“‘Me Awurade na maka. Ɛberɛ aso sɛ meyɛ biribi. Merentwentwɛn so; merennya ahummɔborɔ, na merenwogo me ho. Wɔbɛgyina wo suban ne wo nneyɛɛ so abu wo atɛn, Otumfoɔ Awurade asɛm nie.’”
15 ౧౫ యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
Awurade asɛm baa me nkyɛn sɛ:
16 ౧౬ “నరపుత్రుడా, చూడు! నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని నీ నుంచి ఒక్క తెగులు మూలంగా తీసేస్తాను. నువ్వు సంతాప పడవద్దు. కన్నీరు కార్చ వద్దు.
“Onipa ba, merebɛbɔ wo fua na mafa adeɛ a wʼani gye ho yie. Nanso ɛntwa adwo, ɛnni awerɛhoɔ na ɛnnte nisuo.
17 ౧౭ నువ్వు మౌనంగా మూలగాలి. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చెయ్యొద్దు. తలపాగా కట్టుకుని చెప్పులు వేసుకో. నీ గడ్డం దాచుకోవద్దు, భార్యను కోల్పోయిన పురుషుని ఆహారం తినొద్దు.”
Si apinie komm; ɛnni owufoɔ ho awerɛhoɔ. Ma wʼabotiten mmɔ wo na hyɛ wo mpaboa; nkata wʼano na ɛnni amanneɛ aduane a wɔn a wɔdi awerɛhoɔ di.”
18 ౧౮ ఉదయం ప్రజలకు నేను ప్రకటించాను. సాయంత్రం నా భార్య చనిపోగా నాకు ఆజ్ఞాపించినట్టు మరుసటి ఉదయాన నేను చేశాను.
Enti mekasa kyerɛɛ nnipa no anɔpa, na nʼanwummerɛ na me yere wuiɛ. Adeɛ kyeeɛ no, meyɛɛ sɛdeɛ wɔahyɛ me no.
19 ౧౯ ప్రజలు నన్ను “నువ్వు చేస్తున్నవాటి అర్థం మాకు చెప్పవా?” అని అడిగారు.
Afei nnipa no bisaa me sɛ, “Worenkyerɛ yɛn deɛ ade a woreyɛ yi bɛyɛ wɔn yɛn ho?”
20 ౨౦ కాబట్టి నేను వాళ్ళతో “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
Enti meka kyerɛɛ wɔn sɛ, “Awurade asɛm baa me nkyɛn sɛ:
21 ౨౧ ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
Ka kyerɛ Israel efie sɛ: ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Merebɛgu me kronkronbea ho fi; mo banbɔ denden a mode hoahoa mo ho, deɛ mo ani gye ho, adeɛ a mo akoma da so. Mmammarima ne mmammaa a mogyaa wɔn akyi no bɛtotɔ wɔ akofena ano.
22 ౨౨ అప్పుడు నేను చేసినట్టే మీరూ చేస్తారు. మీ గడ్డాలు కప్పుకోరు. సంతాపంలో ఉన్న పురుషుల ఆహారం తినరు!
Na mobɛyɛ sɛdeɛ mayɛ yi: morenkata mo ano na morenni amanneɛ aduane a wɔn a wɔdi awerɛhoɔ di.
23 ౨౩ మీ తలపాగాలు మీ తలలపై ఉంటాయి. మీ చెప్పులు మీ కాళ్ళకు ఉంటాయి. మీరు సంతాపపడరు, కన్నీరు కార్చరు. ఒకడినొకరు చూసి మూలుగుతూ, మీరు చేసిన దోషాల కారణంగా క్షీణించిపోతారు.
Mobɛkɔ so abɔ mo abɔtiten ahyɛ mo mpaboa. Morenni awerɛhoɔ na morensu, mmom mo so bɛte ɛsiane mo bɔne enti, na mobɛsisi apinie wɔ mo mu.
24 ౨౪ కాబట్టి, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన ప్రకారం మీరూ చేస్తారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
Hesekiel bɛyɛ nsɛnkyerɛnneɛ ama mo. Mobɛyɛ sɛdeɛ woayɛ no pɛpɛɛpɛ. Na yei si a na mobɛhunu sɛ mene Otumfoɔ Awurade no.’
25 ౨౫ “కాని, నరపుత్రుడా, వాళ్ళ ఆనందాన్నీ, వాళ్ళ అతిశయాన్నీ, వాళ్ళ కళ్ళకు ఇష్టమైనదాన్నీ, వాళ్ళ కొడుకులనూ, వాళ్ళ కూతుళ్ళనూ నేను బలవంతంగా పట్టుకున్న రోజు నీకు సమాచారం తెలియజేయడానికి, తప్పించుకుని వచ్చిన వాడొకడు నీదగ్గరికి వస్తాడు.
“Na wo, onipa ba, ɛda a mɛfa wɔn aban denden, wɔn ahosɛpɛ ne animuonyam, adeɛ a wɔn ani gye ho, wɔn akoma so adeɛ, ne wɔn mmammarima ne wɔn mmammaa nso no,
26 ౨౬ ఆ రోజున నువ్వింక మౌనంగా ఉండకుండాా, తప్పించుకుని వచ్చిన వాడితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు,
saa ɛda no otutenani bi na ɔbɛba abɛka deɛ asi akyerɛ wo.
27 ౨౭ నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకునేలా నువ్వు వాళ్లకు సూచనగా ఉంటావు.”
Saa ɛberɛ no, wʼano bɛbue, wo ne no bɛkasa na worennyɛ komm bio. Wobɛyɛ nsɛnkyerɛnneɛ ama wɔn, na wɔbɛhunu sɛ mene Awurade no.”