< యెహెజ్కేలు 22 >
1 ౧ యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు,
फिर ख़ुदा वन्द का कलाम मुझ पर नाजिल हुआ:
2 ౨ “నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి.
कि 'ऐ आदमज़ाद, क्या तू इल्ज़ाम न लगाएगा? क्या तू इस खू़नी शहर को मुल्ज़िम न ठहराएगा? तू इसके सब नफ़रती काम इसको दिखा,
3 ౩ నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం!
और कह, ख़ुदावन्द ख़ुदा यूँ फ़रमाता है: कि ऐ शहर, तू अपने अन्दर खूँरेज़ी करता है ताकि तेरा वक़्त आजाए और तू अपने वास्ते बुतों को अपने नापाक करने के लिए बनाता है।
4 ౪ రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను.
तू उस खू़न की वजह से जो तूने बहाया मुजरिम ठहरा, और तू बुतों के ज़रिए' जिनको तूने बनाया है नापाक हुआ; तू अपने वक़्त को नज़दीक लाता है और अपने दिनों के ख़ातिमे तक पहुँचा है इसलिए मैंने तुझे क़ौमों की मलामत का निशाना और मुल्कों का ठठ्ठा बनाया है।
5 ౫ దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది.
तुझ से दूर — ओ — नज़दीक के सब लोग तेरी हँसी उड़ायेंगे क्यूँकि तू झगड़ालू और बदनाम मशहूर है।
6 ౬ నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు.
देख, इस्राईल के हाकिम सब के सब जो तुझ में हैं, मक़दूर भर खू़ँरेज़ी पर मुसत'इद थे।
7 ౭ నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.
तेरे अन्दर उन्होंने माँ बाप को बेकार जाना है, तेरे अन्दर उन्होंने परदेसियों पर ज़ुल्म किया तेरे अन्दर उन्होंने यतीमों और बेवाओं पर सितम किया है।
8 ౮ నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు.
तूने मेरी पाक चीज़ों को नाचीज़ जाना, और मेरे सबतों को नापाक किया।
9 ౯ దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు.
तेरे अन्दर वह लोग हैं जो चुगलखोरी करके खू़न करवाते हैं, और तेरे अन्दर वह हैं जो बुतों की क़ुर्बानी से खाते हैं; तेरे अन्दर वह हैं जो बुराई करते हैं।
10 ౧౦ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు.
तेरे अन्दर वह भी हैं जिन्होंने अपने बाप की लौंडी शिकनी की, तुझ में उन्होंने उस 'औरत से जो नापाकी की हालत में थी मुबाश्रत की।
11 ౧౧ ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు.
किसी ने दूसरे की बीवी से बदकारी की, और किसी ने अपनी बहू से बदज़ाती की, और किसी ने अपनी बहन अपने बाप की बेटी को तेरे अन्दर रुस्वा किया।
12 ౧౨ వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
तेरे अन्दर उन्होंने खूँरेज़ी के लिए रिश्वत ख़्वारी की तूने ब्याज और सूद लिया और ज़ुल्म करके अपने पड़ोसी को लूटा और मुझे फ़रामोश किया ख़ुदावन्द ख़ुदा फ़रमाता है।
13 ౧౩ “కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను.
“देख, तेरे नारवा नफ़े' की वजह से जो तूने लिया, और तेरी खू़ँरेज़ी के ज़रिए' जो तेरे अन्दर हुई, मैंने ताली बजाई।
14 ౧౪ నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను.
क्या तेरा दिल बर्दाश्त करेगा और तेरे हाथों में ज़ोर होगा, जब मैं तेरा मु'आमिले का फ़ैसला करूँगा? मैं ख़ुदावन्द ने फ़रमाया, और मैं ही कर दिखाऊँगा।
15 ౧౫ కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను.
हाँ, मैं तुझ को क़ौमों में तितर बितर और मुल्कों में तितर — बितर करूँगा, और तेरी गन्दगी तुझ में से हलाक कर दूँगा।
16 ౧౬ కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.”
और तू क़ौमों के सामने अपने आप में नापाक ठहरेगा, और मा'लूम करेगा कि मैं ख़ुदावन्द हूँ।”
17 ౧౭ తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.
और ख़ुदावन्द का कलाम मुझ पर नाज़िल हुआ:
18 ౧౮ “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.”
कि ऐ आदमज़ाद, बनी इस्राईल मेरे लिए मैल हो गए हैं; वह सब के सब पीतल और रॉगा और लोहा और सीसा हैं जो भट्टी में हैं, वह चाँदी की मैल हैं।
19 ౧౯ కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు,
इसलिए ख़ुदावन्द ख़ुदा यूँ फ़रमाता है: कि चूँकि तुम सब मैल हो गए हो, इसलिए देखो, मैं तुम को येरूशलेम में जमा' करूँगा।
20 ౨౦ నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను.
जिस तरह लोग चाँदी और पीतल और लोहा और शीशा और राँगा भट्ठी में जमा' करते हैं और उनपर धौंकते हैं ताकि उनको पिघला डालें, उसी तरह मैं अपने क़हर और अपने ग़ज़ब में तुम को जमा' करूँगा, और तुम को वहाँ रखकर पिघलाऊँगा।
21 ౨౧ మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు.
हाँ, मैं तुम को इकट्ठा करूँगा और अपने ग़ज़ब की आग तुम पर धौंकूँगा, और तुम को उसमें पिघला डालूँगा।
22 ౨౨ కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.”
जिस तरह चाँदी भट्टी में पिघलाई जाती है, उसी तरह तुम उसमें पिघलाए जाओगे, और तुम जानोगे कि मैं ख़ुदावन्द ने अपना क़हर तुम पर नाज़िल किया है।
23 ౨౩ యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు,
और ख़ुदावन्द का कलाम मुझ पर नाज़िल हुआ:
24 ౨౪ “నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!
कि 'ऐ आदमज़ाद, उससे कह, तू वह सरज़मीन है जो पाक नहीं की गई और जिस पर ग़ज़ब के दिन में बारिश नहीं हुई।
25 ౨౫ అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
जिसमें उसके नबियों ने साज़िश की है, शिकार को फाड़ते हुए गरजने वाले शेर — ए — बबर की तरह वह जानों को खा गए हैं; वह माल और क़ीमती चीज़ों को छीन लेते हैं; उन्होंने उसमें बहुत सी 'औरतों को बेवा बना दिया है।
26 ౨౬ దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు.
उसके काहिनों ने मेरी शरी'अत को तोड़ा और मेरी पाक चीज़ों को नापाक किया है। उन्होंने पाक और 'आम में कुछ फ़र्क़ नहीं रख्खा और मैं उनमें बे'इज़्ज़त हुआ।
27 ౨౭ దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు.
उसके हाकिम उसमें शिकार को फाड़ने वाले भेड़ियों की तरह हैं, जो नाजाएज़ नफ़ा' की ख़ातिर खूँरेज़ी करते हैं और जानों को हलाक करते हैं।
28 ౨౮ దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు.
और उसके नबी उनके लिए कच्च गारा करते हैं; बातिल ख़्वाब देखते और झूटी फ़ालगीर करते हैं और कहते हैं कि ख़ुदावन्द ख़ुदा यूँ फ़रमाता है, हालाँकि ख़ुदावन्द ने नहीं फ़रमाया।
29 ౨౯ దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు.
इस मुल्क के लोगों ने सितमगरी और लूट मार की है, और ग़रीब और मोहताज को सताया है और परदेसियों पर नाहक सख़्ती की है।
30 ౩౦ నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు.
मैंने उनके बीच तलाश की, कि कोई ऐसा आदमी मिले जो फ़सील बनाए, और उस सरज़मीन के लिए उसके रखने में मेरे सामने खड़ा हो ताकि मैं उसे वीरान न करूँ, लेकिन कोई न मिला।
31 ౩౧ కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
इसलिए मैंने अपना क़हर उन पर नाज़िल किया, और अपने ग़ज़ब की आग से उनको फ़ना कर दिया; और मैं उनके चाल चलन को उनके सिरों पर लाया, ख़ुदावन्द ख़ुदा फ़रमाता है।