< యెహెజ్కేలు 20 >

1 బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
Afe a ɛto so ason no, ɔsram anum no da a ɛto so du no, Israel mpanyimfo no mu bi bebisaa Awurade hɔ ade, na wɔtenatenaa mʼanim.
2 అప్పుడు యెహోవా వాక్కు నాకు ఇలా వినిపించింది,
Na Awurade asɛm baa me nkyɛn se:
3 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
“Onipa ba, kasa kyerɛ Israel mpanyimfo no se: ‘Sɛɛ na Otumfo Awurade se: Moaba sɛ morebebisa me nkyɛn ade ana? Sɛ mete ase yi, meremma mo kwan ma mummisa me nkyɛn mmoa, Otumfo Awurade na ose.’
4 “వాళ్లకు న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, వాళ్లకు న్యాయం తీరుస్తావా? వాళ్ళ పితరులు చేసిన అసహ్యమైన పనులు వాళ్ళకు తెలియజేయి.
“Bu wɔn atɛn. Bu wɔn atɛn, onipa ba. Fa wɔn agyanom akyiwade a wɔyɛɛ no si wɔn anim
5 వాళ్ళతో చెప్పు, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్న రోజు, యాకోబు సంతానానికి ప్రమాణం చేసిన రోజు, ఐగుప్తుదేశంలో నన్ను వాళ్లకు ప్రత్యక్షం చేసుకుని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలంలో,
na ka kyerɛ wɔn se: ‘Sɛɛ na Otumfo Awurade se: Da a miyii Israel no, memaa me nsa so kaa ntam kyerɛɛ Yakobfi asefo, na miyii me ho adi kyerɛɛ wɔn wɔ Misraim. Memaa me nsa so ka kyerɛɛ wɔn se, “Mene Awurade, mo Nyankopɔn.”
6 వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి, వాళ్ళ కోసం నేను ఎంపిక చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించేది, అన్ని దేశాలకూ ఆభరణమైనది అయిన ఆ దేశంలోకి తీసుకు వెళ్తానని నేను ప్రమాణం చేశాను.
Saa da no, mekaa wɔn ntam se meyi wɔn afi Misraim na mede wɔn aba asase a mahwehwɛ ama wɔn, asase a ɛwo ne nufusu sen wɔ so, asase nyinaa mu nea ɛyɛ papa pa ara no.
7 అప్పుడు నేను వాళ్ళతో, నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడూ అసహ్యమైన పనులు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు విసిరేసి, వాటిని పూజించడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా ఉండాలి, అన్నాను.
Na meka kyerɛɛ wɔn se, “Mo mu biara ntow nsɛsode tantan a mode mo ani asi so no nkyene na mommfa Misraim ahoni no ngu mo ho fi, mene Awurade, mo Nyankopɔn.”
8 అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసి, అసహ్యమైన పనులు చెయ్యడం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహాలు పూజించడం మానలేదు గనుక వాళ్ళు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ మీద నా కోపం తీర్చుకుంటానని అనుకున్నాను.
“‘Nanso wɔyɛɛ dɔm tiaa me na wɔantie me; Wɔantotow nsɛsode tantan no a wɔde wɔn ani asi so no angu na wɔannyae ahoni a efi Misraim no akyidi. Enti mekaa se mehwie mʼabufuwhyew agu wɔn so de awie mʼabufuw wɔ wɔn so wɔ Misraim.
9 ఏ అన్యదేశాల ఎదుట నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నానో, ఏ అన్యప్రజల మధ్య వాళ్లున్నారో, ఆ అన్యప్రజల్లో, వాళ్ళున్న అన్యప్రజల ఎదుట వాళ్లకు నన్ను ప్రత్యక్షం చేసుకున్నాను. నా పేరుకు దూషణ కలగకుండా ఉండాలని ఆ విధంగా చెయ్యకుండా, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా ఘన నామం కోసం నేను వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించాను.
Nanso me din nti meyɛɛ nea ɛremma wonngu me ho fi wɔ amanaman a wɔtete mu no anim, aman a miyii me ho adi kyerɛɛ Israelfo wɔ mu, de yii wɔn fii Misraim no.
10 ౧౦ వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి నిర్జన ప్రదేశంలోకి తీసుకొచ్చి,
Enti midii wɔn anim fii Misraim, de wɔn baa sare no so.
11 ౧౧ వాళ్లకు నా కట్టడలు నియమించి, నా విధులు వాళ్లకు తెలియజేశాను. ఎవడైనా వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి బ్రతుకుతాడు.
Mede me nhyehyɛe maa wɔn na mema wohuu me mmara, efisɛ obiara a odi so no nam so benya nkwa.
12 ౧౨ యెహోవానైన నేనే వాళ్ళను పవిత్రపరచే వాడినని వాళ్ళు తెలుసుకునేలా నాకూ, వాళ్ళకూ మధ్య నా విశ్రాంతి దినాలను నేను వాళ్లకు సూచనగా నియమించాను.
Na mede me homenna maa wɔn sɛ ɛnyɛ nsɛnkyerɛnne wɔ yɛn ntam, sɛnea wobehu sɛ me Awurade na meyɛɛ wɔn kronkron no.
13 ౧౩ అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను.
“‘Nanso Israelfo tew mʼanim atua wɔ sare no so. Wɔanni me nhyehyɛe so, na wɔpoo me mmara no, nanso onipa a obedi so no benya nkwa wɔ wɔn mu, na woguu me homenna ho fi koraa. Enti mekaa se mehwie mʼabufuwhyew agu wɔn so na masɛe wɔn wɔ sare no so.
14 ౧౪ కాని నేను వాళ్ళను రప్పించినప్పుడు ఏ అన్యప్రజలు చూశారో, ఏ అన్యప్రజల్లోనుంచి నేను వాళ్ళను రప్పించానో, వాళ్ళ ఎదుట నా పేరుకు దూషణ కలగకుండా ఉండేలా నేను అనుకున్న ప్రకారం చెయ్యకుండా మానాను.
Nanso me din nti, meyɛɛ nea ɛremma ho kwan ma wonngu me ho fi wɔ amanaman a miyii wɔn fii so no ani so.
15 ౧౫ తమకిష్టమైన విగ్రహాలను అనుసరించాలని కోరి, వాళ్ళు నా విధులను తృణీకరించి, నా కట్టడలను అనుసరించకుండా నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు,
Afei memaa me nsa so kaa ntam wɔ sare no so sɛ meremfa wɔn nnkɔ asase a mede ama wɔn no so, asase a ɛwo ne nufusu sen wɔ so, nsase nyinaa mu nea eye pa ara no,
16 ౧౬ ఇస్తానని నేను చెప్పినదీ, పాలు తేనెలు ప్రవహించేదీ, అన్ని దేశాలకూ ఆభరణం అయిన ఆ దేశంలోకి వాళ్ళను తీసుకు రానని వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను ప్రమాణం చేశాను.
efisɛ wɔpoo me mmara, wɔanni mʼahyɛde so na woguu me homenna ho fi, esiane sɛ na wɔn koma da wɔn ahoni no so nti.
17 ౧౭ అయినా వాళ్ళు నశించిపోకుండా ఉండాలని వాళ్ళ మీద కనికరం చూపించి, ఎడారిలో నేను వాళ్ళను నాశనం చెయ్యలేదు.
Nanso mihuu wɔn mmɔbɔ, na mansɛe wɔn na mantɔre wɔn ase wɔ sare no so.
18 ౧౮ వాళ్ళు ఎడారిలో ఉండగానే వాళ్ళ పిల్లలతో నేను, మీరు మీ పితరులూ ఆచారాలు అనుసరించకుండా, వాళ్ళ పద్ధతుల ప్రకారం ప్రవర్తించకుండా, వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకుండా ఉండండి.
Meka kyerɛɛ wɔn mma wɔ sare no so se, “Munnni mo agyanom ahyɛde ne wɔn mmara so, na mommfa wɔn ahoni ngu mo ho fi.
19 ౧౯ మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను పాటించి, నేను నియమించిన విశ్రాంతి దినాలు ఆచరించండి.
Mene Awurade, mo Nyankopɔn; munni mʼahyɛde so na monhwɛ yiye nni me mmara so.
20 ౨౦ నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా ఆ విశ్రాంతిదినాలు నాకూ, మీకూ మధ్య సూచనగా ఉంటాయి.
Monyɛ me homenna kronkron na ɛnyɛ nsɛnkyerɛnne wɔ me ne mo ntam. Afei mubehu sɛ mene Awurade, mo Nyankopɔn no.”
21 ౨౧ అయినా వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు కూడా నా మీద తిరగబడి, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన నా కట్టడలు అనుసరించకుండా, నా విధులను పాటించకుండా, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేశారు గనుక, వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళ మీద నా కోపం తీర్చుకోవాలని అనుకున్నాను.
“‘Nanso mma no yɛɛ dɔm tiaa me. Wɔanni mʼahyɛde so, na wɔanhwɛ anni me mmara so; nea onipa di so a obenya nkwa no, woguu me homenna ho fi. Enti mekaa se mehwie mʼabufuwhyew agu wɔn so de awie mʼabufuw a etia wɔn wɔ sare no so no.
22 ౨౨ కాని నేను ప్రత్యక్షమైన అన్యప్రజల మధ్య నా పేరుకు అవమానం కలగకుండా ఉండేలా, ఏ ప్రజల్లోనుంచి వాళ్ళను రప్పించానో, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా చెయ్యి వెనక్కు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.
Nanso metwentwɛn so, na me din nti, meyɛɛ nea ɛremma ho ngu fi wɔ aman a miyii wɔn fii so no ani so.
23 ౨౩ వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి,
Memaa me nsa so kaa ntam wɔ sare no so se mɛhwete wɔn wɔ amanaman no so na mabɔ wɔn apansam wɔ nsase no so,
24 ౨౪ తమ పితరులు పెట్టుకున్న విగ్రహాలు పూజించాలని కోరుకున్నప్పుడు, అన్యప్రజల్లోకి వాళ్ళను చెదరగొట్టి, ప్రతి దేశంలోకీ వాళ్ళను వెళ్ళగొడతానని ప్రమాణం చేశాను.
efisɛ wɔanni me mmara so, na mmom wɔpoo mʼahyɛde guu me homenna ho fi, na wɔn ani kodii wɔn agyanom ahoni akyi.
25 ౨౫ తరువాత నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా, మంచివి కాని కట్టడలు, బ్రతకడానికి అనుకూలం కాని విధులు వాళ్ళకు ఇచ్చాను.
Enti memaa wɔn ahyɛde a enye ne mmara a ɛde asotwe mmom na ɛbɛba wɔn so, na ɛnyɛ nkwa;
26 ౨౬ మొదట పుట్టిన పిల్లలను మంటల్లోనుంచి దాటించి బలి అర్పించడం ద్వారా తమ్మును తాము అపవిత్రం చేసుకోనిచ్చాను.”
memaa ho kwan ma wɔde wɔn ayɛyɛde a ɛyɛ wɔn abakan bɔɔ afɔre de guu wɔn ho fi, sɛnea mede ahodwiriw bɛhyɛ wɔn ma ama wɔahu sɛ mene Awurade.’
27 ౨౭ కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఇలా ప్రకటించు. “ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరులు నా పట్ల అతిక్రమం చేసి, నన్ను దూషించి,
“Enti onipa ba, kasa kyerɛ Israelfo, ka kyerɛ wɔn se, ‘Nea Otumfo Awurade se ni: Na eyi mu nso, mo agyanom poo me na wɔnam so kaa abususɛm tiaa me:
28 ౨౮ వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.”
Mede wɔn baa asase a maka ntam sɛ mede bɛma wɔn no so no, wɔbɔɔ afɔre, yɛɛ afɔrebɔde maa koko biara a ɛkorɔn anaa dua biara a ɛso wɔ nhaban de hyɛɛ me abufuw; wɔde nnuhuam mae, na wohwiee ahwiesa maa wɔn.
29 ౨౯ అప్పుడు నేను వాళ్ళతో “మీరు బలులు తీసుకొస్తున్న ఈ ఉన్నత స్థలాలు ఏంటి?” అని అడిగాను. కాబట్టి దానికి “బామా” అనే పేరు ఈ రోజు వరకూ వాడుకలో ఉంది.
Na mibisaa wɔn se: Ɛhe ne saa sorɔnsorɔmmea a mokɔ hɔ yi?’” (Wɔfrɛ hɔ Bama de besi nnɛ.)
30 ౩౦ కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు. “ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరుల విధానంలోనే మీరూ అపవిత్రులు అయ్యారు. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను అనుసరిస్తూ మీరూ వ్యభిచారులయ్యారు.
“Enti ka kyerɛ Israelfi se: ‘Sɛɛ na Otumfo Awurade se: Mubegu mo ho fi sɛnea mo agyanom yɛe, na mo kɔn dɔ wɔn ahoni atantan no ana?
31 ౩౧ ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Sɛ mode mo ayɛyɛde a ɛyɛ mo mmabarima bɔ afɔre wɔ ogya so ma mo ahoni a, na mokɔ so de mo ahoni nyinaa gu mo ho fi besi nnɛ. Memma mommebisa me hɔ ade ana, Israelfi? Ampa ara sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, meremma mummmisa me hɔ ade.
32 ౩౨ ‘అన్యప్రజలు, భూమి మీద ఇతర జాతులూ చేస్తున్నట్టు మేము కూడా కొయ్యకూ, రాళ్లకూ పూజిస్తాం’ అని మీరు అనుకుంటున్నారు. మీ మనస్సులో ఏర్పడుతున్న ఈ ఆలోచన ఎన్నటికీ నెరవేరదు.
“‘Moka se, “Yɛpɛ sɛ yɛyɛ sɛ aman no, te sɛ wiasefo a wɔsom nnua ne abo no.” Nanso nea ɛwɔ mo adwene mu no rensi da.
33 ౩౩ నా జీవం తోడు, నా బలమైన చేతితో, ఉగ్రతతో, ఎత్తిన చేతితో నీ మీద రాజ్యపాలన చేస్తాను.
Sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, Mede nsa a ɛyɛ den, basa a wɔateɛ mu ne abufuwhyew a wɔahwie agu bedi mo so.
34 ౩౪ నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి
Mede mo befi amanaman no so, na maboaboa mo ano afi nsase a wɔapete mo wɔ so no so; mede nsa a ɛyɛ den ne abasa a wɔateɛ mu ne abufuwhyew a wɔahwie agu na ɛbɛyɛ.
35 ౩౫ జనాలున్న ఎడారిలోకి మిమ్మల్ని రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీకు తీర్పు చెబుతాను. ఇదే యెహోవా వాక్కు.
Mede mo bɛba amanaman no sare so, na hɔ na mebu mo atɛn anim ne anim.
36 ౩౬ ఐగుప్తీయుల దేశపు ఎడారిలో నేను మీ పితరులకు తీర్పు చెప్పినట్టు మీకూ తీర్పు చెబుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Sɛnea mibuu mo agyanom atɛn wɔ Misraim sare so no, saa ara na mebu mo atɛn, Otumfo Awurade asɛm ni.
37 ౩౭ “నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను.
Mɛma moafa mʼabaa no ase na mahu mo yiye na mede mo aba apam no nkyehama ase.
38 ౩౮ నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.”
Mɛsa mo mu ayi wɔn a wɔyɛ dɔm tia me. Ɛwɔ mu sɛ meyi wɔn afi aman a wɔte so no mu, nanso wɔn anan rensi Israel asase so. Afei mubehu sɛ mene Awurade no.
39 ౩౯ ఇశ్రాయేలు ఇంటివారలారా, ప్రభువైన యెహోవా మీతో చెప్పేదేమంటే “మీరు నామాట వినకపోతే, మీరు పెట్టుకున్న విగ్రహాలు మీ కిష్టమైనట్టుగా పూజించుకోండి, కాని మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు.”
“‘Na mo de, Israelfi, sɛɛ na Otumfo Awurade se: Mo mu biara nkɔsom nʼahoni! Nanso akyiri no, mubetie me na moremfa mo ayɛyɛde ne ahoni ngu me din kronkron ho fi bio.
40 ౪౦ ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “ఇశ్రాయేలీయుల ఎత్తయిన నా పవిత్ర పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటి వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. అక్కడ నేను వాళ్ళ పట్ల సంతోషిస్తాను. అక్కడ మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ ప్రథమ ఫలదానాలూ, ప్రతిష్ఠిత కానుకలన్నీ నేను అంగీకరిస్తాను.
Efisɛ me bepɔw kronkron no so, Israel bepɔw a ɛkorɔn no so, Otumfo Awurade na ose, hɔ wɔ asase no so na Israelfi nyinaa bɛsom me, na hɔ na mobɛsɔ mʼani. Ɛhɔ na mehia mo afɔrebɔde ne mo ayɛyɛde a edi mu no, aka mo afɔre kronkron no nyinaa ho.
41 ౪౧ దేశాల్లో నుంచి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లో నుంచి మిమ్మల్ని సమకూర్చేటప్పుడు, ఒక పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరిస్తాను. అన్యప్రజల ఎదుటా, మీ మధ్యలోనూ, నన్ను నేను పవిత్రం చేసుకుంటాను.
Sɛ miyi mo fi amanaman no mu na meboaboa mo ano fi nsase a wɔbɔɔ mo petee so no so a, mobɛsɔ mʼani sɛ kurobow a eyi hua, afei mɛda me kronkronyɛ adi wɔ mo mu ama amanaman no ahu.
42 ౪౨ మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశానికి, అంటే ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
Sɛ mede mo ba Israel asase a memaa me nsa so kaa ntam sɛ mede bɛma mo agyanom no so a, na mubehu sɛ mene Awurade.
43 ౪౩ అక్కడ చేరి, మీ ప్రవర్తనను, మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న మీ పనులన్నిటినీ గుర్తు చేసుకుని మీరు చేసిన చెడుపనులన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
Ɛhɔ no, mobɛkae mo suban ne nneyɛe nyinaa a mode agu mo ho fi, na mo ho bɛyɛ mo nwini esiane amumɔyɛ a moayɛ no nyinaa nti.
44 ౪౪ ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ చెడు చేష్టలను బట్టి కాక నా పేరును బట్టి మాత్రమే నేను మీ పట్ల ఈ విధంగా చేసినప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
Mubehu sɛ mene AWURADE no, bere a me ne mo di no sɛnea me din te na mmom ɛnyɛ sɛnea mo akwammɔne ne mo porɔwee nneyɛe no te, mo Israelfo, Otumfo Awurade asɛm ni.’”
45 ౪౫ ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.
Awurade asɛm baa me nkyɛn se:
46 ౪౬ “నరపుత్రుడా, నీ ముఖం దక్షిణం వైపు తిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు, దక్షిణ దేశపు ఎడారి అరణ్యాన్ని గూర్చి ప్రవచించి ఇలా చెప్పు,
“Onipa ba fa wʼani kyerɛ anafo fam, ka asɛm tia anafo fam na hyɛ nkɔm tia kwae a ɛwɔ anafo fam asase so.
47 ౪౭ దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీలో అగ్ని రగిలిస్తాను. అది నీలో ఉన్న పచ్చని పళ్ళ చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ కాల్చేస్తుంది. అది ఆరిపోదు. దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ భూతలమంతా ఆ భీకరమైన అగ్ని దహిస్తుంది.
Ka kyerɛ anafo fam kwae no se: ‘Tie Awurade asɛm. Sɛɛ na Otumfo Awurade se: Merebɛto wo mu gya, na ɛbɛhyew nnua a ɛwɔ wo so nyinaa: Nea ɛyɛ amono ne nea awo. Wɔrennum ogyaframa no na ɛbɛhyew asase no ani nyinaa; efi anafo fam kosi atifi fam.
48 ౪౮ అది ఆరిపోకుండా ఉండగా యెహోవానైన నేను దాన్ని రగిలించానని మనుషులందరూ చూస్తారు.”
Obiara behu sɛ me Awurade na masɔ ogya no ano; ɛrennum.’”
49 ౪౯ అప్పుడు నేను ఇలా అన్నాను “అయ్యో ప్రభూ, యెహోవా, వాళ్ళు నా గురించి, ‘వీడు కేవలం ఉపమానాలు చెప్పేవాడేగదా?’ అంటున్నారు.”
Afei mekae se, “Aa, Otumfo Awurade! Wɔka fa me ho se, ‘Ɛnyɛ mmɛ na ɔrebu yi ana?’”

< యెహెజ్కేలు 20 >