< యెహెజ్కేలు 19 >

1 “కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.
וְאַתָּה֙ שָׂ֣א קִינָ֔ה אֶל־נְשִׂיאֵ֖י יִשְׂרָאֵֽל׃
2 నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.
וְאָמַרְתָּ֗ מָ֤ה אִמְּךָ֙ לְבִיָּ֔א בֵּ֥ין אֲרָיֹ֖ות רָבָ֑צָה בְּתֹ֥וךְ כְּפִרִ֖ים רִבְּתָ֥ה גוּרֶֽיהָ׃
3 వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. అది మనుషులను మింగేసింది.
וַתַּ֛עַל אֶחָ֥ד מִגֻּרֶ֖יהָ כְּפִ֣יר הָיָ֑ה וַיִּלְמַ֥ד לִטְרָף־טֶ֖רֶף אָדָ֥ם אָכָֽל׃
4 అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు. వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు.
וַיִּשְׁמְע֥וּ אֵלָ֛יו גֹּויִ֖ם בְּשַׁחְתָּ֣ם נִתְפָּ֑שׂ וַיְבִאֻ֥הוּ בַֽחַחִ֖ים אֶל־אֶ֥רֶץ מִצְרָֽיִם׃
5 దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.
וַתֵּ֙רֶא֙ כִּ֣י נֹֽוחֲלָ֔ה אָבְדָ֖ה תִּקְוָתָ֑הּ וַתִּקַּ֛ח אֶחָ֥ד מִגֻּרֶ֖יהָ כְּפִ֥יר שָׂמָֽתְהוּ׃
6 ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.
וַיִּתְהַלֵּ֥ךְ בְּתֹוךְ־אֲרָיֹ֖ות כְּפִ֣יר הָיָ֑ה וַיִּלְמַ֥ד לִטְרָף־טֶ֖רֶף אָדָ֥ם אָכָֽל׃
7 తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు. అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది.
וַיֵּ֙דַע֙ אַלְמְנֹותָ֔יו וְעָרֵיהֶ֖ם הֶחֱרִ֑יב וַתֵּ֤שַׁם אֶ֙רֶץ֙ וּמְלֹאָ֔הּ מִקֹּ֖ול שַׁאֲגָתֹֽו׃
8 నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.
וַיִּתְּנ֨וּ עָלָ֥יו גֹּויִ֛ם סָבִ֖יב מִמְּדִינֹ֑ות וַֽיִּפְרְשׂ֥וּ עָלָ֛יו רִשְׁתָּ֖ם בְּשַׁחְתָּ֥ם נִתְפָּֽשׂ׃
9 అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు.
וַֽיִּתְּנֻ֤הוּ בַסּוּגַר֙ בַּֽחַחִ֔ים וַיְבִאֻ֖הוּ אֶל־מֶ֣לֶךְ בָּבֶ֑ל יְבִאֻ֙הוּ֙ בַּמְּצֹדֹ֔ות לְמַ֗עַן לֹא־יִשָּׁמַ֥ע קֹולֹ֛ו עֹ֖וד אֶל־הָרֵ֥י יִשְׂרָאֵֽל׃ פ
10 ౧౦ నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది. అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది.
אִמְּךָ֥ כַגֶּ֛פֶן בְּדָמְךָ֖ עַל־מַ֣יִם שְׁתוּלָ֑ה פֹּֽרִיָּה֙ וַֽעֲנֵפָ֔ה הָיְתָ֖ה מִמַּ֥יִם רַבִּֽים׃
11 ౧౧ రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.
וַיִּֽהְיוּ־לָ֞הּ מַטֹּ֣ות עֹ֗ז אֶל־שִׁבְטֵי֙ מֹֽשְׁלִ֔ים וַתִּגְבַּ֥הּ קֹֽומָתֹ֖ו עַל־בֵּ֣ין עֲבֹתִ֑ים וַיֵּרָ֣א בְגָבְהֹ֔ו בְּרֹ֖ב דָּלִיֹּתָֽיו׃
12 ౧౨ కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.
וַתֻּתַּ֤שׁ בְּחֵמָה֙ לָאָ֣רֶץ הֻשְׁלָ֔כָה וְר֥וּחַ הַקָּדִ֖ים הֹובִ֣ישׁ פִּרְיָ֑הּ הִתְפָּרְק֧וּ וְיָבֵ֛שׁוּ מַטֵּ֥ה עֻזָּ֖הּ אֵ֥שׁ אֲכָלָֽתְהוּ׃
13 ౧౩ కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది. దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,
וְעַתָּ֖ה שְׁתוּלָ֣ה בַמִּדְבָּ֑ר בְּאֶ֖רֶץ צִיָּ֥ה וְצָמָֽא׃
14 ౧౪ దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు. ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.” ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు.
וַתֵּצֵ֨א אֵ֜שׁ מִמַּטֵּ֤ה בַדֶּ֙יהָ֙ פִּרְיָ֣הּ אָכָ֔לָה וְלֹא־הָ֥יָה בָ֛הּ מַטֵּה־עֹ֖ז שֵׁ֣בֶט לִמְשֹׁ֑ול קִ֥ינָה הִ֖יא וַתְּהִ֥י לְקִינָֽה׃ פ

< యెహెజ్కేలు 19 >