< యెహెజ్కేలు 17 >

1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
And there is a word of YHWH to me, saying,
2 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు.
“Son of man, put forth a riddle, and use an allegory to the house of Israel,
3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.
and you have said, Thus said Lord YHWH: The great eagle, great-winged, long-pinioned, Full of feathers, that has diverse colors, Has come to Lebanon, And he takes the foliage of the cedar,
4 అది ఆ చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది. అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది.
He has cropped the top of its tender twigs, And he brings it to the land of Canaan. He has placed it in a city of merchants.
5 అది ఆ దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది. విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది. వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది.
And he takes of the seed of the land, And puts it in a field of seed, He took [it] by many waters, He has set it in a conspicuous place.
6 అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది.
And it springs up, and becomes a spreading vine, humble of stature, To turn its thin shoots toward itself, And its roots are under it, And it becomes a vine, and makes boughs, And sends forth beautiful branches.
7 పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది. చూడండి! ఈ ద్రాక్ష చెట్టు తన వేళ్ళను ఈ డేగ వైపుకి మళ్ళించింది. అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది.
And there is another great eagle, Great-winged, and abounding with feathers, And behold, this vine has bent its roots toward him, And it has sent out its thin shoots toward him, To water it from the furrows of its planting,
8 దాన్ని ఒక పెద్ద నీటి చెరువు పక్కనే మంచి నేల్లో అనేక కొమ్మలు వేసి, ఫలించి, చక్కని ద్రాక్ష తీగె కావాలని నాటడం జరిగింది.”
On a good field, by many waters, it is planted, to make branches, and to bear fruit, to be for a good vine.
9 ప్రజలను ఇలా అడుగు. “అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా? అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు.
Say, Thus said Lord YHWH: It prospers—does he not draw out its roots, And cut off its fruit, and it is withered? [In] all the leaves of its springing it withers, And not by great strength, or by numerous people, To lift it up by its roots.
10 ౧౦ ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.”
And behold, the planted thing—does it prosper? When the east wind comes against it, does it not utterly wither? On the furrows of its springing it withers.”
11 ౧౧ తరువాత యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
And there is a word of YHWH to me, saying,
12 ౧౨ “తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.
“Now say to the house of rebellion, Have you not known what these [are]? Say, Behold, the king of Babylon has come to Jerusalem, And he takes its king, and its princes, And brings them to himself to Babylon.
13 ౧౩ అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
And he takes of the seed of the kingdom, And makes a covenant with him, And brings him into an oath, And he has taken the mighty of the land,
14 ౧౪ ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటే దేశం నిలిచి ఉంటుంది.
That the kingdom may be humble, That it may not lift itself up, To keep his covenant—that it may stand.
15 ౧౫ కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?
And he rebels against him, To send his messengers to Egypt, To give to him horses, and many people, Does he prosper? Does he who is doing these things escape? And has he broken covenant and escaped?
16 ౧౬ నా ప్రాణం పైన ఒట్టు, ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. ఎవరితో చేసిన నిబంధనను అతడు భంగ పరిచాడో, ఏ రాజు దగ్గర ఒట్టు పెట్టాడో, ఏ రాజు తనని రాజుగా చేశాడో ఆ రాజు రాజ్యంలోనే అతడు చనిపోతాడు. అతడు బబులోను లోనే చనిపోతాడు!
[As] I live—a declaration of Lord YHWH, Does he not—in the place of the king who is causing him to reign, Whose oath he has despised, And whose covenant he has broken—die with him in the midst of Babylon?
17 ౧౭ బబులోను సైన్యాలు యుద్ధంలో ముట్టడికై ఉన్నత స్థలాలను కట్టినప్పుడు, ప్రజలను చంపడానికి ప్రాకారాలను ముట్టడి వేసినప్పుడు ఫరో, అతని బలమైన సైన్యం, అతడు యుద్ధానికి సమకూర్చిన మనుషులు యుద్ధంలో యెరూషలేము రాజును కాపాడలేవు.
And not with a great force, and with a numerous assembly, Does Pharaoh maintain him in battle, By pouring out a mound, and in building a fortification, To cut off many souls.
18 ౧౮ ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.”
And he despised the oath—to break covenant, And behold, he has given his hand, And all these he has done—he does not escape.
19 ౧౯ కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “అతడు తృణీకరించిన ప్రమాణం నాకు చేసింది కాదా! నా నిబంధనను అతడు భంగం చేశాడు కదా! కాబట్టి అతడి పైకి శిక్ష రప్పిస్తున్నాను.
Therefore, thus said Lord YHWH: [As] I live—My oath that he has despised, And My covenant that he has broken, Have I not put it on his head?
20 ౨౦ నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.
And I have spread out My snare for him, And he has been caught in My net, And I have brought him to Babylon, And judged him there [for the] trespass That he has trespassed against Me.
21 ౨౧ అతనితో ఉన్న సైన్యంలో తప్పించుకుని పారిపోయిన వాళ్ళందరూ ఖడ్గం చేత నిర్మూలం అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ని వైపులకీ చెదిరిపోతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందని ప్రకటిస్తున్నాను.”
And all his fugitives, with all his bands, Fall by sword, and those remaining, They are spread out to every wind, And you have known that I, YHWH, have spoken.
22 ౨౨ ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
Thus said Lord YHWH: I have taken of the foliage of the high cedar, And I have set [it], I crop a tender one from the top of its tender shoots, And I have planted [it] on a high and lofty mountain.
23 ౨౩ అది శాఖలుగా విస్తరించి ఫలాన్ని ఇచ్చేలా నేను దాన్ని ఇశ్రాయేలు పర్వతాల పైన నాటుతాను. అది ఎంతో ఘనమైన దేవదారు వృక్షం అవుతుంది. దాని కింద రెక్కలున్న పక్షులన్నీ నివసిస్తాయి. దాని కొమ్మల నీడలో అవి తమ గూళ్ళు కట్టుకుని పిల్లలను పెడతాయి.
In a mountain—the high place of Israel, I plant it, And it has borne boughs, and yielded fruit, And become a good cedar, And every bird of every [kind of] wing has dwelt under it, They dwell in the shade of its thin shoots.
24 ౨౪ అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.”
And all trees of the field have known That I, YHWH, have made the high tree low, I have set the low tree on high, I have dried up the moist tree, And I have caused the dry tree to flourish, I, YHWH, have spoken, and have done [it]!”

< యెహెజ్కేలు 17 >