< యెహెజ్కేలు 15 >

1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
RAB bana şöyle seslendi:
2 “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది?
“İnsanoğlu, asma odununun herhangi bir orman ağacının dalından daha fazla değeri var mı?
3 ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా?
Asma odunundan yararlı bir şey yapılabilir mi? Ya da üzerine eşya asmak için ondan askı yaparlar mı?
4 చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది?
Yakıt olarak ateşe atılır da ateş odunun iki ucunu yakıp ortasını kömürleştirince, işe yarar mı?
5 చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు!
Yanmadan önce işe yaramadıysa, yanıp kömür haline geldikten sonra bir işe yarar mı?
6 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను.
“Bu nedenle Egemen RAB şöyle diyor: Orman ağaçları arasında asma odununu nasıl yakıt olarak ateşe verdimse, Yeruşalim'de yaşayan halka da aynısını yapacağım.
7 నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
Onlara yüz çevireceğim. Şimdi ateşten kurtulsalar bile, ateş onları yine de yakıp yok edecek. Onlara yüz çevirince, benim RAB olduğumu anlayacaksınız.
8 వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
Ülkeyi viraneye çevireceğim. Çünkü bana sadakatsizlik ettiler. Egemen RAB böyle diyor.”

< యెహెజ్కేలు 15 >