< యెహెజ్కేలు 15 >
1 ౧ యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
耶和华的话临到我说:
2 ౨ “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది?
“人子啊,葡萄树比别样树有什么强处?葡萄枝比众树枝有什么好处?
3 ౩ ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా?
其上可以取木料做什么工用,可以取来做钉子挂什么器皿吗?
4 ౪ చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది?
看哪,已经抛在火中当作柴烧,火既烧了两头,中间也被烧了,还有益于工用吗?
5 ౫ చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు!
完全的时候尚且不合乎什么工用,何况被火烧坏,还能合乎什么工用吗?”
6 ౬ కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను.
所以,主耶和华如此说:“众树以内的葡萄树,我怎样使它在火中当柴,也必照样待耶路撒冷的居民。
7 ౭ నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
我必向他们变脸;他们虽从火中出来,火却要烧灭他们。我向他们变脸的时候,你们就知道我是耶和华。
8 ౮ వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
我必使地土荒凉,因为他们行事干犯我。这是主耶和华说的。”