< నిర్గమకాండము 8 >

1 యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.
И рече Господь к Моисею: вниди к фараону и речеши к нему: сия глаголет Господь: отпусти люди Моя, да Ми послужат:
2 నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.
аще же не хощеши ты отпустити, се, Аз побиваю вся пределы твоя жабами:
3 నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.
и изрыгнет река жабы, и излезшя внидут в домы твоя и в клети ложниц твоих, и на постели твоя и в домы рабов твоих и людий твоих, и в теста твоя и в пещы твоя,
4 ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.”
и на тя и на рабы твоя и на люди твоя возлезут жабы.
5 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు.
Рече же Господь к Моисею: рцы Аарону брату твоему: простри рукою твоею жезл твой на реки и на кладязи и на езера, и изведи жабы на землю Египетскую.
6 అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.
И простре Аарон руку на воды Египетския и изведе жабы: и излезоша жабы и покрыша землю Египетскую.
7 ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.
Сотвориша же и волсви Египетстии волхвованиями своими такожде и изведоша жабы на землю Египетскую.
8 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను” అని చెప్పాడు.
Призва же фараон Моисеа и Аарона и рече: помолитеся о мне ко Господу, да отженет от мене жабы и от людий моих: и отпущу люди, и пожрут Господви.
9 అందుకు మోషే “ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే” అన్నాడు. అప్పుడు ఫరో “రేపే ఆ పని చెయ్యి” అని బదులిచ్చాడు.
Рече же Моисей к фараону: определи мне, когда помолюся о тебе и о рабех твоих и о людех твоих, да погибнут жабы от тебе и от людий твоих и от домов ваших, точию в реце да останутся.
10 ౧౦ అందుకు మోషే “మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.
Он же рече: заутра. Рече убо: якоже рекл еси, да увеси, яко несть иного разве Господа:
11 ౧౧ కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి” అన్నాడు.
и отженутся жабы от тебе и от домов ваших и от сел, и от рабов твоих и от людий твоих, точию в реце останутся.
12 ౧౨ మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.
Изыде же Моисей и Аарон от фараона, и возопи Моисей ко Господу о определении жаб, якоже совеща с фараоном.
13 ౧౩ యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.
Сотвори же Господь, якоже рече Моисей: и изомроша жабы от домов и от сел и от нив их:
14 ౧౪ ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.
и собраша я в стоги стоги, и возсмердеся земля.
15 ౧౫ ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.
Видев же фараон, яко бысть отрада, отяготися сердце его, и не послуша их, якоже рече Господь.
16 ౧౬ అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.
И рече Господь к Моисею: рцы Аарону: простри рукою жезл твой и удари в персть земную, и будут скнипы в человецех и в скотех, и на фараоне и на доме его и рабех его, и весь песок земный станет скнипами во всей земли Египетстей.
17 ౧౭ అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.
Простре убо Аарон рукою жезл и удари в персть земную: и быша скнипы в человецех и в скотех, и во всякой персти земной быша скнипы во всей земли Египетстей.
18 ౧౮ మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు
Твориша же и волсви волхвованми своими такожде извести скнипы, и не возмогоша: и быша скнипы в человецех и скотех.
19 ౧౯ మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.
Реша убо волсви фараону: перст Божий есть сие. И ожесточися сердце фараоново, и не послуша их, якоже рече Господь.
20 ౨౦ కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
Рече же Господь к Моисею: востани заутра и стани пред фараоном, и се, он изыдет на воду, и речеши ему: сия глаголет Господь: отпусти люди Моя, да Ми послужат в пустыни:
21 ౨౧ నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.
аще же не хощеши отпустити людий Моих, се, Аз посылаю на тя и на рабы твоя, и на люди твоя и на домы вашя песия мухи: и наполнятся домове Египетстии песиих мух и в земли, на нейже суть:
22 ౨౨ భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.
и прославлю в той день землю Гесемску, на нейже людие Мои сташа, на нейже не будет тамо песиих мух, да увеси, яко Аз есмь Господь, Бог всея земли:
23 ౨౩ నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు.
и положу разлучение между людьми Моими и людьми твоими: во утрии же будет знамение сие на земли.
24 ౨౪ యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
Сотвори же Господь тако: и прииде песиих мух множество в домы фараоновы и в домы рабов его и во всю землю Египетску, и погибе земля от песиих мух.
25 ౨౫ అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.
Воззва же фараон Моисеа и Аарона, глаголя: шедше пожрите жертву Господу Богу вашему в земли сей.
26 ౨౬ అందుకు మోషే “అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.
И рече Моисей: не может се тако быти, хулно бо се Египтяном: не положим требу Господу Богу нашему: аще бо положим требу по хулению Египетску пред ними, камением побиют ны:
27 ౨౭ అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం” అని చెప్పాడు.
путем триех дний пойдем в пустыню и пожрем Господу Богу нашему, якоже рече Господь нам.
28 ౨౮ ఫరో “మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి” అన్నాడు.
И рече фараон: аз отпущаю вы, и пожрите Господу Богу вашему в пустыни: но не далече простирайтеся ити: помолитеся убо и о мне ко Господу.
29 ౨౯ అందుకు మోషే “నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు” అని చెప్పి
Рече же Моисей: се, аз изыду от тебе и помолюся ко Господу Богу, и отидут песия мухи от тебе и от рабов твоих и от людий твоих заутра: да не приложиши еще, фараоне, прельстити, еже не отпустити людий пожрети Господу.
30 ౩౦ ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.
Изыде же Моисей от фараона и помолися Богу.
31 ౩౧ యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.
Сотвори же Господь, якоже рече Моисей, и отя песия мухи от фараона и от рабов его и от людий его, и не остася ни едина.
32 ౩౨ అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
И отяготи фараон сердце свое и во время сие, и не восхоте отпустити людий.

< నిర్గమకాండము 8 >