< నిర్గమకాండము 4 >
1 ౧ అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు.
Musa akĩmũcookeria atĩrĩ, “Ĩ mangĩrega kũnjĩtĩkia kana kũnjigua, na manjĩĩre atĩrĩ, ‘Jehova ndakuumĩrĩire?’”
2 ౨ యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు.
Nake Jehova akĩmũũria atĩrĩ, “Nĩ kĩĩ kĩu ũrĩ nakĩo guoko?” Nake agĩcookia atĩrĩ, “Nĩ rũthanju.”
3 ౩ అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.
Jehova akĩmwĩra atĩrĩ, “Rũikie thĩ.” Musa akĩrũikia thĩ, naruo rũgĩtuĩka nyoka, nake akĩmĩũrĩra.
4 ౪ అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
Nake Jehova akĩmwĩra atĩrĩ, “Tambũrũkia guoko ũmĩnyiite mũtingʼoe.” Nĩ ũndũ ũcio Musa agĩtambũrũkia guoko akĩmĩnyiita, nayo ĩkĩgarũrũka, ĩgĩtuĩka rũthanju guoko-inĩ gwake.
5 ౫ ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు.
Nake Jehova akiuga atĩrĩ, “Ũndũ ũyũ nĩguo wa gũtũma metĩkie atĩ Jehova, o we Ngai wa maithe mao Ngai wa Iburahĩmu, na Ngai wa Isaaka, na Ngai wa Jakubu nĩakuumĩrĩire.”
6 ౬ తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.
Ningĩ Jehova akiuga atĩrĩ, “Ikia guoko nguo-inĩ yaku.” Nĩ ũndũ ũcio Musa agĩikia guoko nguo-inĩ yake, na rĩrĩa aakũrutire kwarĩ na mangũ, gũkeerũha ta ira.
7 ౭ తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.
Jehova agĩcooka akĩmwĩra atĩrĩ, “Cookia guoko nguo-inĩ yaku.” Nĩ ũndũ ũcio Musa agĩcookia guoko nguo-inĩ, na rĩrĩa aakũrutire kwagarũrũkĩte gũkahaanana na mwĩrĩ ũcio ũngĩ wake.
8 ౮ అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు.
Ningĩ Jehova akiuga atĩrĩ, “Mangĩaga gũgwĩtĩkia na kũrũmbũiya kĩama kĩa mbere, no gũkorwo nĩmagetĩkia gĩa keerĩ.
9 ౯ ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.
No mangĩaga gwĩtĩkia ciama ici cierĩ kana mage gũkũigua-rĩ, ũgaataha maaĩ kuuma Rũũĩ rwa Nili na ũmaite thĩ. Maaĩ macio ũgaataha kuuma rũũĩ nĩmagatuĩka thakame maitwo thĩ.”
10 ౧౦ మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.
Musa akĩĩra Jehova atĩrĩ, “Wee, Mwathani, nĩũũĩ niĩ ndirĩ ndatuĩka mũndũ mwaria wega, kuuma o tene o na kuuma wambĩrĩria kwaria na niĩ ndungata yaku. Niĩ ndirĩ mĩtũkĩ ya mĩario, na ndĩ rũrĩmĩ rũritũ.”
11 ౧౧ అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా.
Jehova akĩmwĩra atĩrĩ, “Nũũ waheire mũndũ kanua? Nũũ ũtũmaga mũndũ aage kũigua kana aremwo nĩ kwaria? Nũũ ũtũmaga mũndũ one kana atuĩke mũtumumu? Githĩ ti niĩ, Jehova?
12 ౧౨ కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను” అని మోషేతో చెప్పాడు.
Na rĩrĩ, thiĩ; nĩngakũhotithia kwaria na ngũrute ũrĩa ũkoiga.”
13 ౧౩ మోషే “ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు” అన్నాడు.
No Musa akiuga atĩrĩ, “Mwathani, ndagũthaitha tũma mũndũ ũngĩ akaarie.”
14 ౧౪ అందుకు యెహోవా మోషే మీద కోపపడి “లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు.
Namo marakara ma Jehova makĩrĩrĩmbũkĩra Musa, akĩmũũria atĩrĩ, “Ĩ mũrũ wa nyũkwa Harũni, ũrĩa Mũlawii-rĩ, ndangĩaria? Nĩnjũũĩ no aarie wega. Arĩ njĩra-inĩ agĩũka gũgũtũnga, na nĩegũkena akuona.
15 ౧౫ నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను.
Ũrĩmwaragĩria na ũkamwĩra ũrĩa ekuuga, na nĩngamũhotithia inyuĩ eerĩ kwaria, na ndĩmũrute ũrĩa mũgeeka.
16 ౧౬ అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క.
Nĩakaarĩria andũ handũ haku, na agaatuĩka taarĩ we kanua gaku, nawe ũtuĩke ta ũrĩ Ngai harĩ we.
17 ౧౭ ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి” అని చెప్పాడు.
No oya rũthanju rũrũ nĩguo ũhotage kũringa ciama naruo.”
18 ౧౮ ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు.
Nake Musa agĩcooka kwa Jethero mũthoni-we, akĩmwĩra atĩrĩ, “Njĩtĩkĩria njooke bũrũri wa Misiri kũrĩ andũ aitũ, ngarore kana nĩ kũrĩ matũire muoyo.” Jethero akiuga atĩrĩ, “Thiĩ, ndakũhoera thayũ.”
19 ౧౯ అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో “నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు” అని చెప్పాడు.
Na rĩrĩ, Jehova nĩarĩirie Musa arĩ o kũu Midiani, akĩmwĩra atĩrĩ, “Cooka bũrũri wa Misiri, nĩgũkorwo andũ othe arĩa meendaga gũkũũraga nĩmakuĩte.”
20 ౨౦ మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు.
Nĩ ũndũ ũcio Musa akĩoya mũtumia wake na ariũ ake, akĩmahaicia ndigiri na makĩambĩrĩria rũgendo rwa gũcooka bũrũri wa Misiri. Nake akĩoya rũthanju rwa Ngai akĩrũnyiita na guoko.
21 ౨౧ అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు.
Jehova akĩĩra Musa atĩrĩ, “Wacooka bũrũri wa Misiri-rĩ, tigĩrĩra nĩ weka morirũ mothe marĩa ngũhotithĩtie gwĩka mbere ya Firaũni. No nĩngomia ngoro yake nĩgeetha ndagetĩkĩrie andũ mathiĩ.
22 ౨౨ అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు.
Ningĩ wĩre Firaũni atĩrĩ, ‘Ũũ nĩguo Jehova ekuuga: Isiraeli nĩwe mũriũ wakwa wa irigithathi,
23 ౨౩ నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు’ అని అతనితో చెప్పాలి” అన్నాడు.
na nĩndakwĩrire atĩrĩ, “Reke mũriũ wakwa athiĩ akaahooe.” No nĩwaregire kũmwĩtĩkĩria athiĩ; nĩ ũndũ ũcio nĩngooraga mũriũ waku wa irigithathi.’”
24 ౨౪ ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు.
Marĩ handũ harĩa mararĩrĩire marĩ rũgendo-inĩ-rĩ, Jehova akiumĩrĩra Musa, na aarĩ hakuhĩ kũmũũraga.
25 ౨౫ మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది.
No Zipora akĩoya kahiga kaarĩ kogĩ ta kahiũ, akĩruithia mũriũ, na akĩhutithia gĩkonde kĩu nyarĩrĩ cia Musa. Agĩcooka akĩmwĩra atĩrĩ, “Ti-itherũ ũrĩ mũthuuri wakwa wa thakame.”
26 ౨౬ అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది.
Nĩ ũndũ ũcio Jehova agĩtigana nake. (Hĩndĩ ĩyo mũtumia ũcio wake oigire “ũrĩ mũthuuri wakwa wa thakame” aaragia ũhoro wa irua.)
27 ౨౭ మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు.
Nake Jehova akĩĩra Harũni atĩrĩ, “Thiĩ werũ-inĩ ũgathaagane Musa.” Nĩ ũndũ ũcio Harũni agĩtũnga Musa kĩrĩma-inĩ kĩa Ngai, akĩmũhĩmbĩria.
28 ౨౮ అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు.
Nake Musa akĩĩra Harũni ũrĩa wothe Jehova amũtũmĩte akoige, o na ningĩ ũhoro wa ciama ciothe iria aamwathĩte aringe.
29 ౨౯ తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు.
Musa na Harũni magĩcookanĩrĩria athuuri a Isiraeli othe,
30 ౩౦ మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు.
nake Harũni akĩmeera ũrĩa wothe Jehova eerĩte Musa. O na ningĩ Musa akĩringa ciama mbere yao;
31 ౩౧ యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.
nao magĩĩtĩkia. Na rĩrĩa maiguire atĩ Jehova nĩameciirĩtie na akona mĩnyamaro yao-rĩ, makĩinamĩrĩra, magĩthathaiya.