< నిర్గమకాండము 39 >
1 ౧ యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పవిత్ర స్థలం లో నిలిచి చేసే సేవ కోసం నీలం ఊదా ఎర్రని రంగుల సేవా వస్త్రాలు అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు.
А з блакиті й пурпуру та червені поробили вони службові шати для слу́ження в святині. І поробили священні шати, що вони для Аарона, як Господь наказав був Мойсеєві.
2 ౨ అతడు బంగారంతో, నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో ఏఫోదు చేశాడు.
І зробив він ефо́да з золота, блакиті, і пурпуру, і червені та з суканого віссону.
3 ౩ ఏఫోదు కోసం నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో, సన్నని నారతో నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగెలుగా కత్తిరించారు.
І повибивали вони золоті бляхи, та й настригли нито́к на роботу серед блакиті, і серед пурпуру, і серед червені, і серед віссону, — робота мистця́.
4 ౪ ఏఫోదుకు రెండు భుజ ఖండాలు చేసి రెండు అంచులలో నిలబెట్టారు.
Вони зробили для нього злучені нараменники, на обох кінцях його він був сполу́чений.
5 ౫ దానికి బంగారంతో నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో పేనిన అందమైన అల్లిక ఏకాండంగా రెండు వైపులా కుట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
А пояс мистецький для наклада́ння ефо́ду, що з ним з'є́днаний і одна́кового з ним виробу, — золото, блакить, і пурпур, і червень, і суканий віссон, як Господь наказав був Мойсеєві.
6 ౬ బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.
І поробили вони камені оніксові, оточені золотими гні́здами, ви́різьблені різьбою печатки, з імена́ми Ізраїлевих синів.
7 ౭ అవి ఇశ్రాయేలు ప్రజల జ్ఞాపకార్ధంగా ఉండేలా ఆ ముద్రలను ఏఫోదు భుజాల మీద ఉంచారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
І він їх поклав на ефодові нараменники, — камені на пам'ять для Ізраїлевих синів, як Господь наказав був Мойсеєві.
8 ౮ అతడు బంగారంతోనూ నీలం ఊదా ఎర్ర దారాలతోను పేనిన సన్న నారతో ఏఫోదును చేసినట్టు నైపుణ్యంగా ఒక వక్షపతకం తయారుచేశాడు.
І зробив він нагрудника, роботою мистця, як робота ефоду, — золото, блакить, і пурпур, і червень, і суканий віссон.
9 ౯ దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. ఆ పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది.
Квадрато́вий він був, скла́деним удвоє зробили нагру́дника, — п'ядь довжина його, і п'ядь ширина його, складений удвоє.
10 ౧౦ వారు దానిలో నాలుగు వరుసలుగా రత్నాలు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్న రత్నాలు,
І понаса́джували на ньому чотири ряди каменя. Ряд: рубі́н, топа́з і смара́гд — ряд перший.
11 ౧౧ రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంత మణులు ఉన్న రత్నాలు,
А ряд другий: карбу́нкул, сапфі́р і я́спіс.
12 ౧౨ మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,
А ряд третій: опа́ль, ага́т і амети́ст.
13 ౧౩ నాలుగవ వరుసలో ఎర్ర రంగు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతాలు ఉన్న రత్నాలు క్రమ పద్ధతిలో పొదిగించారు.
А четвертий ряд: хризолі́т, о́нікс і бері́л, — вони вставлені золотими наса́дами в своїх гні́здах.
14 ౧౪ ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.
А камені ті — на ймення дванадцятьо́х Ізраїлевих синів вони, на ймення їх; різьбою печатки кожен на ім'я́ його для дванадцяти́ племен.
15 ౧౫ వక్షపతకం కోసం దారాలు అల్లినట్టు స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు అల్లారు.
І поробили вони на нагруднику сукані ланцюги плетеною роботою зо щирого золота.
16 ౧౬ వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు.
І зробили вони два золоті гнізда та дві золоті каблучки, і дали ці каблучки на двох кінцях нагрудника.
17 ౧౭ అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను వక్షపతకం అంచులలో ఉన్న రెండు గుండ్రని కొంకీలలో వేశారు.
І дали два золоті шнури на дві ті каблучки до кінців нагрудника.
18 ౧౮ అల్లిన ఆ రెండు గొలుసుల అంచులు ఆ రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు.
А два кінці обох шнурів дали до двох гнізд, і дали на нараменники ефоду спереду його.
19 ౧౯ బంగారంతో రెండు గుండ్రని కొంకీలు చేసి ఏఫోదు ఎదురుగా ఉన్న వక్షపతకం లోపలి అంచు రెండు కొనలకు తగిలించారు.
І зробили дві золоті каблучки, та й поклали на обох кінцях нагрудника на краї́ його, що до сторони ефоду, всере́дину.
20 ౨౦ బంగారంతో మరో రెండు గుండ్రని కొంకీలు ఏఫోదు అల్లిక పైగా దాని రెండవ కూర్పు దగ్గర దాని ఎదురుగా, ఏఫోదు రెండు భుజఖండాలకు కింది భాగంలో వేశారు.
І зробили вони дві золоті каблучки, та й дали їх на обидва нараменники ефоду здолу, спе́реду його, при сполученні його, над мистецьким поясом ефоду.
21 ౨౧ వక్షపతకం ఏఫోదు అల్లిక కట్టు మీద ఉండేలా, ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేలా ఆ పతకాన్ని దాని గుండ్రని కొంకీలకూ ఏఫోదు కొంకీలకూ నీలం రంగు దారంతో కట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
І прив'язали нагрудника від каблучок його до каблучок ефоду блакитною ниткою, щоб був на мистецькім поясі ефоду, — і не буде ру́хатись нагрудник ізнад ефоду, як Господь наказав був Мойсеєві.
22 ౨౨ అతడు ఏఫోదు అంగీ కేవలం నీలం రంగు దారంతో అల్లిక పనిగా చేశాడు. ఆ అంగీ మధ్య ఉన్న రంధ్రాన్ని మూసి ఉంచే కవచం ఏర్పాటు చేశారు.
І зробив він ша́ту для ефоду, ткацькою роботою, всю блакитну.
23 ౨౩ ఆ రంధ్రం చిరిగి పోకుండా ఉండేందుకు రంధ్రం చుట్టూ కవచం ఉంచారు.
А о́твір ша́ти в сере́дині її, як отвір па́нцера; край отво́ру її обрамований навколо, — щоб не де́ртися їй.
24 ౨౪ అంగీ అంచుల మీద నీలం ఊదా ఎర్రని రంగుల గల నూలుతో పేని దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు.
І поробили вони на подо́лку шати гранатові яблука з блакиті, і пурпуру та з суканої червені.
25 ౨౫ స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి ఆ దానిమ్మపండ్ల ఆకారాల మధ్యలో, అంటే అంగీ అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్లవంటి వాటి మధ్యలో ఆ గంటలను పెట్టారు.
І поробили дзвінки́ зо щирого золота, і дали ті дзвінки поміж гранатові яблука на подолку ша́ти навколо, поміж ті гранатові яблука, —
26 ౨౬ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సేవ జరిగించడానికి ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండు వంటి ఆకారాన్ని అంగీ అంచుల మీద చుట్టూ తగిలించారు.
дзвінок і гранатове яблуко, дзвінок і гранатове яблуко на подолку шати тієї навколо, на слу́ження, як Господь наказав був Мойсеєві.
27 ౨౭ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అహరోనుకు, అతని కొడుకులకు సన్నని నారతో అల్లిక పని చేసి అంగీలు నేశారు. సన్నని నారతో తలపాగాలను చేసారు.
І поробили вони хіто́ни з віссону, робота ткача, для Аарона та для синів його,
28 ౨౮ సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.
і заво́я з віссону, і шапки́ накриття з віссону, і льняна́ спі́дня о́діж із суканого віссону, і пояса з суканого віссону,
29 ౨౯ నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.
і блакиті, і пурпура та з червені, робота гаптяря, як Господь наказав був Мойсеєві.
30 ౩౦ స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు.
І зробили квітку, вінця святости, зо щирого золота, і написали на нім письмом різьби печатки: „Святість для Господа“.
31 ౩౧ ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
І дали́ на нім блакитну нитку, щоб була́ на заво́ї згори, як Господь наказав був Мойсеєві.
32 ౩౨ ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.
І скінчи́лася вся робота скинії, скинії заповіту. І зробили Ізраїлеві сини все, — як Господь наказав був Мойсеєві, так зробили вони.
33 ౩౩ దైవ నివాసాన్ని, దానిలో సామగ్రి మొత్తాన్నీ అంటే, దాని కొక్కేలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
І позно́сили вони до Мойсея скинію внутрішню, намета зовнішнього та всі речі її: гачки її, дошки її, засуви її, і стовпи її та підстави її,
34 ౩౪ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, గండుచేప తోళ్ల పైకప్పు, పైకప్పు తెర,
і накриття з баранячих начервоно пофарбованих шкурок, і накриття з тахашевих шкурок, і завісу заслони,
35 ౩౫ శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం,
ковчега свідоцтва, і держаки його, і віко,
36 ౩౬ సన్నిధి బల్ల, దాని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
стола, усі речі його, і хліб показни́й,
37 ౩౭ పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,
чистого свічника та лямпадки його, лямпадки розста́влені, та всі речі його й оливу освітлення,
38 ౩౮ బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,
і золотого жертівника, миро пома́зання, і запашне́ кадило, і завісу при вході скинії,
39 ౩౯ ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి మొత్తం, గంగాళం, దాని పీట,
мідяного жертівника, і його мідяну мережку, держаки його, і всі речі його, умивальницю та підставу її,
40 ౪౦ ప్రహరీ తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ప్రహరీ ద్వారానికి తెర, దాని తాళ్ళు, మేకులు, సన్నిధి గుడారం మందిర సేవ కోసం కావలసిన సామగ్రి అంతా,
запони подвір'я, стовпи його, і підстави його, і заслону для брами подвір'я, шнури його, і кілки його, і всі речі для служби в скинії, у скинії заповіту,
41 ౪౧ పవిత్ర స్థలం లో సేవ చేసే యాజకుడైన అహరోనుకూ, అతని కొడుకులకూ యాజక పరిచర్య పవిత్ర వస్త్రాలు సిద్ధం చేసి వాటన్నిటినీ మోషే దగ్గరికి తీసుకు వచ్చారు.
службо́ві шати для слу́ження в святині, священні шати священика Аарона, і шати синів його для священнослу́ження.
42 ౪౨ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.
Усе так, як Господь наказав був Мойсеєві, так зробили Ізраїлеві сини всю ту роботу.
43 ౪౩ వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.
І побачив Мойсей усю ту роботу, і ось — вони зробили її! Як Господь наказав був, так зробили вони. І поблагословив їх Мойсей!