< నిర్గమకాండము 38 >

1 అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.
و مذبح قربانی سوختنی را از چوب شطیم ساخت. طولش پنج ذراع، وعرضش پنج ذراع مربع، و بلندیش سه ذراع.۱
2 దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.
وشاخهایش را بر چهار گوشه‌اش ساخت. شاخهایش از همان بود و آن را از برنج پوشانید.۲
3 బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.
و همه اسباب مذبح را ساخت، یعنی: دیگها وخاک اندازها و کاسه‌ها و چنگالها و مجمرها وهمه ظروفش را از برنج ساخت.۳
4 బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.
و برای مذبح، آتش دانی مشبک از برنج ساخت، که زیرحاشیه‌اش بطرف پایین تا نصفش برسد.۴
5 ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.
و چهارحلقه برای چهار سر آتش دان برنجین ریخت، تاخانه های عصاها باشد.۵
6 ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.
و عصاها را از چوب شطیم ساخته، آنها را به برنج بپوشانید.۶
7 ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.
و عصاهارا در حلقه‌ها بر دو طرف مذبح گذرانید، برای برداشتنش به آنها، و مذبح را از چوبها مجوف ساخت.۷
8 గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
و حوض را از برنج ساخت، و پایه‌اش را از برنج از آینه های زنانی که نزد دروازه خیمه اجتماع برای خدمت جمع می‌شدند.۸
9 అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.
و صحن را ساخت که برای طرف جنوبی به سمت یمانی. پرده های صحن از کتان نازک تابیده شده صد ذراعی بود.۹
10 ౧౦ ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.
ستونهای آنها بیست بود، و پایه های آنها بیست بود، از برنج و قلابهای آنهاو پشت بندهای آنها از نقره.۱۰
11 ౧౧ ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.
و برای طرف شمالی صد ذراعی بود، و ستونهای آنها بیست ازبرنج، و قلابهای ستونها و پشت بندهای آنها ازنقره بود.۱۱
12 ౧౨ పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.
و برای طرف غربی، پرده های پنجاه ذراعی بود، و ستونهای آنها ده و پایه های آنها ده، و قلابها و پشت بندهای ستونها از نقره بود.۱۲
13 ౧౩ తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.
وبرای طرف شرقی به سمت طلوع، پنجاه ذراعی بود.۱۳
14 ౧౪ ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
و پرده های یک طرف دروازه پانزده ذراعی بود، ستونهای آنها سه و پایه های آنها سه.۱۴
15 ౧౫ ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
و برای طرف دیگر دروازه صحن از این طرف واز آن طرف پرده‌ها پانزده ذراعی بود، ستونهای آنها سه و پایه های آنها سه.۱۵
16 ౧౬ ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.
همه پرده های صحن به هر طرف از کتان نازک تابیده شده بود.۱۶
17 ౧౭ స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.
و پایه های ستونها از برنج بود، و قلابها وپشت بندهای ستونها از نقره، و پوشش سرهای آنها از نقره، و جمیع ستونهای صحن به پشت بندهای نقره پیوسته شده بود.۱۷
18 ౧౮ ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.
و پرده دروازه صحن از صنعت طراز از لاجورد و ارغوان و قرمز و کتان نازک تابیده شده بود. طولش بیست ذراع، و بلندیش به عرض پنج ذراع موافق پرده های صحن.۱۸
19 ౧౯ వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.
و ستونهای آنها چهار، وپایه های برنجین آنها چهار، و قلابهای آنها ازنقره، و پوشش سرهای آنها و پشت بندهای آنهااز نقره بود.۱۹
20 ౨౦ వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.
و همه میخهای مسکن و صحن، به هر طرف از برنج بود.۲۰
21 ౨౧ మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.
این است حساب مسکن، یعنی مسکن شهادت، چنانکه حسب فرمان موسی به خدمت لاویان، به توسط ایتاماربن هارون کاهن حساب آن گرفته شد.۲۱
22 ౨౨ యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.
و بصلئیل بن اوری بن حور از سبطیهودا، آنچه را که خداوند به موسی‌امر فرموده بود بساخت.۲۲
23 ౨౩ దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.
و با وی اهولیاب بن اخیسامک ازسبط دان بود، نقاش و مخترع و طراز در لاجورد وارغوان و قرمز و کتان نازک.۲۳
24 ౨౪ పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్.
و تمام طلایی که در کار صرف شد، یعنی در همه کار قدس، ازطلای هدایا بیست و نه وزنه و هفتصد و سی مثقال موافق مثقال قدس بود.۲۴
25 ౨౫ జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్.
و نقره شمرده شدگان جماعت صد وزنه و هزار و هفتصد وهفتاد و پنج مثقال بود، موافق مثقال قدس.۲۵
26 ౨౬ ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.
یک درهم یعنی نیم مثقال موافق مثقال قدس، برای هر نفری از آنانی که به سوی شمرده شدگان گذشتند، از بیست ساله و بالاتر، که ششصد و سه هزار وپانصد و پنجاه نفر بودند.۲۶
27 ౨౭ అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.
و اما آن صد وزنه نقره برای ریختن پایه های قدس و پایه های پرده بود. صد پایه از صد وزنه یعنی یک وزنه برای یک پایه.۲۷
28 ౨౮ 1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.
و از آن هزار و هفتصد و هفتاد و پنج مثقال قلابها برای ستونها ساخت، و سرهای آنهارا پوشانید، و پشت بندها برای آنها ساخت.۲۸
29 ౨౯ అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు.
وبرنج هدایا هفتاد وزنه و دو هزار و چهارصد مثقال بود.۲۹
30 ౩౦ అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.
و از آن پایه های دروازه خیمه اجتماع، ومذبح برنجین، و شبکه برنجین آن و همه اسباب مذبح را ساخت.۳۰
31 ౩౧ ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.
و پایه های صحن را به هرطرف، و پایه های دروازه صحن و همه میخهای مسکن و همه میخهای گرداگرد صحن را.۳۱

< నిర్గమకాండము 38 >