< నిర్గమకాండము 38 >
1 ౧ అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.
Poi fece l’altare degli olocausti, di legno d’acacia; la sua lunghezza era di cinque cubiti; e la sua larghezza di cinque cubiti; era quadro, e avea un’altezza di tre cubiti.
2 ౨ దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.
E ai quattro angoli gli fece dei corni, che spuntavano da esso, e lo rivesti di rame.
3 ౩ బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.
Fece pure tutti gli utensili dell’altare: i vasi per le ceneri, le palette, i bacini, i forchettoni, i bracieri; tutti i suoi utensili fece di rame.
4 ౪ బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.
E fece per l’altare una gratella di rame in forma di rete, sotto la cornice, nella parte inferiore; in modo che la rete raggiungeva la metà dell’altezza dell’altare.
5 ౫ ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.
E fuse quattro anelli per i quattro angoli della gratella di rame, per farvi passare le stanghe.
6 ౬ ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.
Poi fece le stanghe di legno d’acacia, e le rivestì di rame.
7 ౭ ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.
E fece passare le stanghe per gli anelli, ai lati dell’altare le quali dovean servire a portarlo; e lo fece di tavole, vuoto.
8 ౮ గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
Poi fece la conca di rame e la sua base di rame, servendosi degli specchi delle donne che venivano a gruppi a fare il servizio all’ingresso della tenda di convegno.
9 ౯ అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.
Poi fece il cortile; dal lato meridionale, c’erano, per formare il cortile, cento cubiti di cortine di lino fino ritorto,
10 ౧౦ ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.
con le loro venti colonne e le loro venti basi di rame; i chiodi e le aste delle colonne erano d’argento.
11 ౧౧ ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.
Dal lato di settentrione, c’erano cento cubiti di cortine con le loro venti colonne e le loro venti basi di rame; i chiodi e le aste delle colonne erano d’argento.
12 ౧౨ పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.
Dal lato d’occidente, c’erano cinquanta cubiti di cortine con le loro dieci colonne e le loro dieci basi; i chiodi e le aste delle colonne erano d’argento.
13 ౧౩ తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.
E sul davanti, dal lato orientale, c’erano cinquanta cubiti:
14 ౧౪ ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
da uno dei lati dell’ingresso c’erano quindici cubiti di cortine, con tre colonne e le loro tre basi;
15 ౧౫ ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
e dall’altro lato (tanto di qua quanto di là dall’ingresso del cortile) c’erano quindici cubiti di cortine, con le loro tre colonne e le loro tre basi.
16 ౧౬ ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.
Tutte le cortine formanti il recinto del cortile erano di lino fino ritorto;
17 ౧౭ స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.
e le basi per le colonne eran di rame; i chiodi e le aste delle colonne erano d’argento, e i capitelli delle colonne eran rivestiti d’argento, e tutte le colonne del cortile eran congiunte con delle aste d’argento.
18 ౧౮ ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.
La portiera per l’ingresso del cortile era in lavoro di ricamo, di filo violaceo, porporino, scarlatto, e di lino fino ritorto; aveva una lunghezza di venti cubiti, un’altezza di cinque cubiti, corrispondente alla larghezza delle cortine del cortile.
19 ౧౯ వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.
Le colonne erano quattro, e quattro le loro basi, di rame; i loro chiodi eran d’argento, e i loro capitelli e le loro aste eran rivestiti d’argento.
20 ౨౦ వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.
Tutti i piuoli del tabernacolo e dei recinto del cortile erano di rame.
21 ౨౧ మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.
Questi sono i conti del tabernacolo, del tabernacolo della testimonianza, che furon fatti per ordine di Mosè, per cura dei Leviti, sotto la direzione d’Ithamar, figliuolo del sacerdote Aaronne.
22 ౨౨ యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.
Betsaleel, figliuolo d’Uri, figliuolo di Hur, della tribù di Giuda, fece tutto quello che l’Eterno aveva ordinato a Mosè,
23 ౨౩ దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.
avendo con sé Oholiab, figliuolo di Ahisamac, della tribù di Dan, scultore, disegnatore, e ricamatore di stoffe violacee, porporine, scarlatte e di lino fino.
24 ౨౪ పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్.
Tutto l’oro che fu impiegato nell’opera per tutti i lavori del santuario, oro delle offerte, fu ventinove talenti e settecentotrenta sicli, secondo il siclo del santuario.
25 ౨౫ జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్.
E l’argento di quelli della raunanza de’ quali si fece il censimento, fu cento talenti e mille settecento settantacinque sicli, secondo il siclo del santuario:
26 ౨౬ ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.
un beka a testa, vale a dire un mezzo siclo, secondo il siclo del santuario, per ogni uomo compreso nel censimento, dall’età di venti anni in su: cioè, per seicento tremila cinquecento cinquanta uomini.
27 ౨౭ అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.
I cento talenti d’argento servirono a fondere le basi del santuario e le basi del velo: cento basi per i cento talenti, un talento per base.
28 ౨౮ 1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.
E coi mille settecento settantacinque sicli si fecero dei chiodi per le colonne, si rivestirono i capitelli, e si fecero le aste delle colonne.
29 ౨౯ అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు.
Il rame delle offerte ammontava a settanta talenti e a duemila quattrocento sicli.
30 ౩౦ అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.
E con questi si fecero le basi dell’ingresso della tenda di convegno, l’altare di rame con la sua gratella di rame, e tutti gli utensili dell’altare,
31 ౩౧ ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.
le basi del cortile tutt’all’intorno, le basi dell’ingresso del cortile, tutti i piuoli del tabernacolo e tutti i piuoli del recinto del cortile.