< నిర్గమకాండము 37 >

1 బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,
比撒列用皂荚木做柜,长二肘半,宽一肘半,高一肘半。
2 దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
里外包上精金,四围镶上金牙边,
3 దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.
又铸四个金环,安在柜的四脚上:这边两环,那边两环。
4 అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
用皂荚木做两根杠,用金包裹。
5 మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు.
把杠穿在柜旁的环内,以便抬柜。
6 అతడు స్వచ్ఛమైన బంగారంతో కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర.
用精金做施恩座,长二肘半,宽一肘半。
7 బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.
用金子锤出两个基路伯来,安在施恩座的两头,
8 రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.
这头做一个基路伯,那头做一个基路伯,二基路伯接连一块,在施恩座的两头。
9 ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.
二基路伯高张翅膀,遮掩施恩座;基路伯是脸对脸,朝着施恩座。
10 ౧౦ అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు మూరన్నర.
他用皂荚木做一张桌子,长二肘,宽一肘,高一肘半,
11 ౧౧ అతడు దాని పైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించి, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
又包上精金,四围镶上金牙边。
12 ౧౨ దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు రేకు అమర్చాడు.
桌子的四围各做一掌宽的横梁,横梁上镶着金牙边,
13 ౧౩ బల్ల కోసం బంగారంతో నాలుగు గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల నాలుగు కాళ్ళ మూలలకు వాటిని బిగించాడు.
又铸了四个金环,安在桌子四脚的四角上。
14 ౧౪ బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి.
安环子的地方是挨近横梁,可以穿杠抬桌子。
15 ౧౫ బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
他用皂荚木做两根杠,用金包裹,以便抬桌子;
16 ౧౬ బల్లమీద ఉండే సామగ్రి, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయ అర్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.
又用精金做桌子上的器皿,就是盘子、调羹,并奠酒的瓶和爵。
17 ౧౭ అతడు దీప స్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాన్నీ, దాని అడుగు భాగాన్నీ, నిలువు భాగాన్నీ బంగారు రేకుతో అలంకరించాడు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు.
他用精金做一个灯台;这灯台的座和干,与杯、球、花,都是接连一块锤出来的。
18 ౧౮ దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.
灯台两旁杈出六个枝子:这旁三个,那旁三个。
19 ౧౯ దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఒక్కో కొమ్మకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఉన్నాయి.
这旁每枝上有三个杯,形状像杏花,有球有花;那旁每枝上也有三个杯,形状像杏花,有球有花。从灯台杈出来的六个枝子都是如此。
20 ౨౦ దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.
灯台上有四个杯,形状像杏花,有球有花。
21 ౨౧ దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.
灯台每两个枝子以下有球,与枝子接连一块;灯台杈出的六个枝子都是如此。
22 ౨౨ వాటి మొగ్గలు, కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించాడు.
球和枝子是接连一块,都是一块精金锤出来的。
23 ౨౩ దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.
用精金做灯台的七个灯盏,并灯台的蜡剪和蜡花盘。
24 ౨౪ దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు.
他用精金一他连得做灯台和灯台的一切器具。
25 ౨౫ అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. దాని పొడవు, వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి.
他用皂荚木做香坛,是四方的,长一肘,宽一肘,高二肘,坛的四角与坛接连一块;
26 ౨౬ దాని కప్పుకు, నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకులు పొదిగించి దానికి పై అంచు చుట్టూ బంగారం అలంకరించాడు.
又用精金把坛的上面与坛的四面并坛的四角包裹,又在坛的四围镶上金牙边。
27 ౨౭ ఆ అలంకారం కింద వేదికకు రెండు గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని రెండు పక్కలా రెండు మూలల్లో బంగారం అలంకారం చేశాడు.
做两个金环,安在牙子边以下,在坛的两旁、两根横撑上,作为穿杠的用处,以便抬坛。
28 ౨౮ దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు.
用皂荚木做杠,用金包裹。
29 ౨౯ పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.
又按做香之法做圣膏油和馨香料的净香。

< నిర్గమకాండము 37 >