< నిర్గమకాండము 36 >
1 ౧ మోషే “పవిత్ర స్థలం లో జరిగే సేవ కోసం అన్నిరకాల పనులు చేయడానికి బెసలేలు, అహోలీయాబు మొదలైన ప్రతిభావంతులను నియమించాము. ఈ పనులు చేయడానికి యెహోవా వాళ్లకు జ్ఞానం, వివేకం ప్రసాదించాడు. వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినట్టు పనులు జరిగిస్తారు” అన్నాడు.
И сотвори Веселеил и Елиав, и всяк мудрый умом, емуже дана есть премудрость и хитрость в них, разумети творити вся дела, яже ко святыни надлежащая, по всем, елика заповеда Господь.
2 ౨ బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.
И призва Моисей Веселеила и Елиава и вся имущыя премудрость, имже даде Бог разум в сердцы, и вся волею хотящыя приходити к делам, еже совершати я:
3 ౩ వాళ్ళు వచ్చి పవిత్ర స్థలం లో సేవ జరగడానికి, పవిత్ర స్థలం కట్టించడానికి ఇశ్రాయేలు ప్రజలు తీసుకువచ్చిన సామగ్రి అంతటినీ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మోషే దగ్గరికి కానుకలు తెస్తూనే ఉన్నారు.
и взяша от Моисеа вся участия, яже принесоша сынове Израилевы на вся дела святыни творити я: и тии приимаху еще приносимая от приносящих заутра заутра.
4 ౪ అప్పుడు పవిత్ర స్థలానికి చెందిన వేరు వేరు పనులు చేసే నిపుణులందరూ తాము చేస్తున్న పని వదిలిపెట్టి మోషే దగ్గరికి వచ్చారు.
И прихождаху вси мудрии, иже творяху дела святыни, кийждо по своему делу, еже сами делаху:
5 ౫ “సేవ జరిగించడానికి యెహోవా చేయమని చెప్పిన పని కోసం ప్రజలు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా తీసుకు వస్తున్నారు” అని మోషేతో చెప్పారు.
и рекоша Моисею, яко много приносят людие свыше дел, елика заповеда Господь сотворити.
6 ౬ మోషే “ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు” అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది.
И повеле Моисей, и проповеда в полце, глаголя: муж и жена ктому да не делают на начатки святыни. И возбранени быша людие ктому приносити.
7 ౭ ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు.
И дела быша им доволна на строение творити, и преизбыша.
8 ౮ ఆ పని చేసినవాళ్ళలో నిపుణులైన వారంతా నీలం, ఊదా, ఎర్రని రంగులతో నేసిన సన్నని దారాలతో దైవ సన్నిధి గుడారం కోసం కెరూబు నమూనాతో పది తెరలు చేశారు. ఇది అత్యంత నైపుణ్యం గల బెసలేలు చేతి పని.
И сотвори всяк премудрый в делающих ризы святыни, яже суть Аарону иерею, якоже заповеда Господь Моисею.
9 ౯ ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటి కొలతలు ఒక్కటే.
И сотвориша ризу верхнюю от злата и синеты, и багряницы и червленицы прядены и виссона сканаго:
10 ౧౦ ఐదు తెరలు చొప్పున రెండు జతలుగా ఒక దానితో ఒకటి కూర్చారు.
и изрезаша дщицы златы аки власы, еже соткати с синетою и с багряницею, и с червленицею пряденою и с виссоном сканым: дело тканое сотвориша е.
11 ౧౧ ఒక తెరల కూర్పు చివరి తెర అంచున నీలం రంగు నూలుతో ఉంగరాలు చేశారు. రెండవ కూర్పు బయటి తెర అంచుకు కూడా అదే విధంగా చేశారు.
Ризы верхния придержащыяся от обоих стран,
12 ౧౨ మొదటి కూర్పులో ఒక తెరకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో ఉన్న తెర అంచుకు ఏభై ఉంగరాలు చేశారు. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.
дело тканно, между собою сплетено: от него сотвориша е по его творению, от злата и синеты, и багряницы и червленицы спрядены и виссона сканаго, якоже заповеда Господь Моисею.
13 ౧౩ ఏభై బంగారు గుండీలను సిద్ధం చేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది దైవ సన్నిధి మందిరంగా నిలిచింది.
И сотвориша оба камени смарагдовы состеганы вервию и обложены златом, изваяны и вырезаны ваянием печати, от имен сынов Израилевых:
14 ౧౪ దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.
и возложиша я на рамена ризы верхния камение в память сынов израилевых, якоже заповеда Господь Моисею.
15 ౧౫ ఒక్కో తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
И сотвориша слово, дело тканно пестротою, по делу ризы верхния, от злата и синеты, и багряницы и червленицы спрядены и виссона сканаго,
16 ౧౬ ఆ పదకొండు తెరల కొలతలు ఒక్కటే. ఐదు తెరలను ఒక కూర్పుగా, ఆరు తెరలను ఒక కూర్పుగా చేశారు.
четвероуголно сугубо сотвориша логион пяди в долготу, и пяди в широту, сугубо:
17 ౧౭ మొదటి కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు ఏర్పాటు చేశారు.
и сшиста на нем швением по три камени четырми ряды: ряд камений: сардий и топазий и смарагд, ряд един:
18 ౧౮ వాటిని ఒక గుడారంగా కలపడానికి ఏభై యిత్తడి గుండీలు ఉపయోగించారు.
и ряд вторый, анфракс и сапфир и иаспис:
19 ౧౯ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కప్పునూ, గండుచేప తోళ్ళతో దానికి పైకప్పునూ సిద్ధం చేశారు.
и ряд третий, лигирий и ахат и амефист:
20 ౨౦ దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు.
и ряд четвертый, хрисолиф и вириллий и онихий, окованы около златом и всаждени в злате:
21 ౨౧ ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర.
и камение бяху от имен сынов Израилевых дванадесять, по именам их изваяно в печати, кийждо своим именем в дванадесять племен.
22 ౨౨ ప్రతి పలకకు ఒకదాని కొకటి సమానమైన నిడివిలో రెండు కుసులు చేశారు. అదే విధంగా పలకలన్నిటికి అమర్చారు.
И сотвориша над логионом тресны сплетены, дело плетеное от злата чиста:
23 ౨౩ మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు.
и сотвориша два щитца злата и два колца злата, и возложиша два колца злата на оба конца логиона:
24 ౨౪ ఒక్కొక్క పలక చొప్పున ఇరవై పలకల కింద రెండు కుసులకు రెండు దిమ్మలు, మొత్తం నలభై వెండి దిమ్మలు చేశారు.
и вложиша плетеницы златы в колца, со обоих стран логиона,
25 ౨౫ మందిరం రెండవ వైపు, అంటే ఉత్తరం వైపు ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను,
и в два сложения две плетеницы, и возложиша на два щитца: и возложиша на рамена ризы верхния, противу лицем к лицу.
26 ౨౬ ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.
И сотвориша два колца злата, и возложиша на два крила на край логиона, и на край созади верхния ризы, внутрьуду:
27 ౨౭ పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు.
и сотвориша два колца злата, и положиша на оба рамена ризы верхния с низу его на лице по согбению свыше состава ризы верхния:
28 ౨౮ వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు.
и стягнуша логион колцами, яже на нем, с колцами верхния ризы сложеными, из синеты сплетенными, во ткание ризы верхния, да не низпускается логион от ризы верхния, якоже заповеда Господь Моисею.
29 ౨౯ ఆ పలకలు కింది భాగంలో నిలిపి మొదటి ఉంగరం దాకా ఒకదానితో ఒకటి అంచు దాకా కలిపారు. అలా రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశారు.
И сотвориша исподнюю ризу, яже под верхнюю, дело тканно, все синее:
30 ౩౦ ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి అమర్చిన వెండి దిమ్మలు పదహారు. ప్రతి పలక అడుగునా రెండు దిమ్మలు ఉన్నాయి.
ожерелие же во внутренней ризе, на среде швенно, сплетено, ометы имущо около ожерелие неразлучено.
31 ౩౧ తుమ్మకర్రతో వాటికి అడ్డకర్రలు చేశారు. మందిరం ఒకవైపు పలకలకు ఐదు అడ్డకర్రలు,
И сотвориша на омете ризы внутренния долу яко процветающаго шипка пугвицы от синеты и багряницы, и червленицы прядены и виссона сканаго.
32 ౩౨ రెండో వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, పడమటి వైపు మందిరం వెనుక వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు చేశారు.
И сотвориша звонцы златы, и возложиша звонцы на ометы ризы внутренния окрест между пугвицами:
33 ౩౩ పలకల మధ్యలో ఉన్న ముఖ్యమైన అడ్డకర్ర ఈ అంచు నుండి ఆ అంచు వరకూ కలిసి ఉండేలా చేశారు.
звонец злат и пугвица на омете внутренния ризы окрест, к служению, якоже повеле Господь Моисею.
34 ౩౪ ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించారు. వాటి అడ్డకర్రలు ఉండే గుండ్రని కమ్మీలు బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించారు.
И сотвориша ризы виссонныя дело тканно, Аарону и сыном его,
35 ౩౫ నీలం ఊదా ఎర్రని రంగులు గల సన్నని నారతో పేని అడ్డతెరను సిద్ధం చేశారు. కెరూబు రూపాలను నైపుణ్యం గల పనితనంతో చేశారు.
и клобуки из виссона, и увясло из виссона, и надраги из виссона сканаго,
36 ౩౬ దాని కోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు సిద్ధం చేసి వాటికి బంగారు రేకులు పొదిగించారు. వాటి బంగారపు కొక్కేల కోసం నాలుగు వెండి దిమ్మలు పోతపోశారు.
и поясы их из виссона и синеты, и багряницы и червленицы прядены, дело пестрящаго, якоже заповеда Господь Моисею.
37 ౩౭ గుడారం ద్వారం కోసం నీలం, ఊదా, ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో, అడ్డ తెరను నేయించారు.
И сотвориша дщицу злату, отделение святыни от злата чиста, и написаша на ней писмена изваяна печатию: освящение Господу:
38 ౩౮ దాని ఐదు స్తంభాలూ, వాటి కొక్కేలూ తయారు చేశారు. ఆ స్థంభాలకూ, వాటి కొక్కేలకూ, వాటి పెండె బద్దలకూ బంగారం రేకులు పొదిగించారు. వాటికి ఉన్న ఐదు దిమ్మలు ఇత్తడివి.
и возложиша ю на омет синь, еже бы лежати на увясле свыше, якоже заповеда Господь Моисею.